ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను వేధిస్తున్న స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు మాతృశాఖకు పంపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఆరోగ్యవిభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్‌ను ఆదేశించారు. బాధితురాలు మేయర్‌కు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
చార్మినార్ జోన్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు, కొందరు యూనియన్ నేతలకు గత వారమే తన బాధలు తెలియజేశారు. తాజాగా సోమవారం నేరుగా మేయర్ విజయలక్ష్మిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు. విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన శ్రీనివాస్ గత ఫిబ్రవరిలో పదోన్నతిపై బల్దియాకు వచ్చారు.
గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తరచూ చార్మినార్ జోన్‌కు వెళ్లేవాడని సమాచారం. తన విషయం బహిర్గతమవుతుందని తెలిసి సోమవారం అయ్యప్పమాల ధరించినట్లు జీహెచ్‌ఎంసీలో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment