ఇందూరు: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదు’ అన్న చందంగా ఉంది బీసీ స్టడీ సర్కిల్ అధికారి తీరు. తనకు అన్యాయం జరిగిందని.., న్యాయం చేసి ఆదుకోవాలని బాధిత ప్రభుత్వ ఉద్యోగి కలెక్టర్‌ను వేడుకున్నాడు. దీంతో బాధితుడి ఆవేదనలో న్యాయం ఉందని గ్రహించిన కలెక్టర్ బకారుులు చెల్లించాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. కానీ, సదరు అధికారి మాత్రం తన నీచబుద్ధిని చూపించాడు. బాధితుడిని ముప్పుతిప్పలు పెట్టడంతో బాధితుడు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు.
జిల్లా కేంద్ర శివారు నాగారం ప్రాంతంలో ఉన్న జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో ఎన్. లక్ష్మి నరసింహచారి 2010 డిసెంబర్ 1వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్‌సోర్సింగ్ పద్దతిపై నియామకమయ్యూడు. అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు నెలసరి వేతనం రూ.8 వేలు ఉండగా, కొన్ని రోజుల తరువాత రూ.9500కు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు అదనంగా పెరిగిన రూ.1500 వేతనాన్ని పొందుతున్నారు.
ఇతడికి మాత్రం పెరిగిన వేతనం నేటి వరకు అమలు కాలేదు. ఈ విషయమై తనకు న్యాయం చేయూలని గతంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ అధికారి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా న్యాయం జరగలేదు. దీంతో సదరు బాధిత ఉద్యోగి తనకు రావాల్సిన సుమారు రూ.70 వేలు నష్టపోయూడు. ఇటీవల మరోసారి ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి న్యాయం చేయూలని వేడుకున్నాడు. తనకు న్యాయం చేయూలని గ్రీవెన్స్ సెల్‌లో విన్నవించుకున్నాడు.
దీంతో స్పందించిన ఆయన స్టడీ సర్కిల్ అధికారికి ఫైలు సమర్పించమని ఆయన సూచించారు.దీంతో ఆయన ఏజేసీకి ఫైలు సమర్పించగా పరిశీలించిన ఆయన కంప్యూటర్ ఆపరేటర్ వేతనం కోల్పోయిన విషయం వాస్తవమే అని గ్రహించి ఫైలును కలెక్టర్‌కు పంపించారు. దానిని పరిశీలించిన కలెక్టర్ బాధిత ఉద్యోగికి రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. దీంతో బాధిత ఉద్యోగి తనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.
మరుసటి రోజు బీసీ స్టడీ సర్కిల్ అధికారి వద్దకు వెళ్లి బాకాయి వేతనంపై వివరణ కోరగా సదరు అధికారి నేనివ్వని మోకాలడ్డాడు. ఏజేసీ, కలెక్టర్ ఫైలును సరిగా చూడకుండా సంతకం పెట్టారు. మరోసారి నేను వారితో మాట్లాడుతానని అన్నట్లు బాధితుడు తెలిపాడు. చేతుల వరకు బాకాయి డబ్బులు చేజారి పోయూయని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.అయినా పట్టువదలని బాధితుడు తనకు న్యాయం చేయూలని కోరుతూ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిచాడు.
పర్సంటేజీ కోసమేనా...?
కంప్యూటర్ ఆపరేటర్‌గా మూడేళ్లు పనిచేసిన బా ధితుడు తనకు రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని తిరుగుతున్నా అధికారులు సతాయించడం వెనుక ఆం తర్యమేమిటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్సం టేజీ ఇస్తే డబ్బులు ఇచ్చే వారేమో అనే ఆరోపణలు విని పిస్తున్నాయి. స్వయంగా కలెక్టర్, ఏజేసీ ఆదేశించినా బకాయిలు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అనే వాదనలు ఉన్నాయి. ‘అతడికి చెప్పు... అందులోం చి పర్సంటేజీ ఇవ్వాలని. అలా చేస్తే రావాల్సిన బాకాయిలు ఇప్పిస్తా’ అని కార్యాలయంలోని ఓ మధ్యవర్తితో సదరు ఉద్యోగి అన్నట్లు విశ్వసనీయ సమాచారం.
కలెక్టర్ ఆదేశించినా !
Published Fri, May 1 2015 5:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement