BC study circle
-
కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ దారితప్పింది. గ్రూప్–3, గ్రూప్–4 కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు లోపభూయిష్టంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్–3, గ్రూప్–4 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేటు శిక్షణ సంస్థలను ఎంపిక చేసి తరగతుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.5500 చొప్పున ఫీజు నిర్దేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50 శిక్షణ తరగతులకు ప్రైవేటు సెంటర్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించింది. మూడు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ శిక్షణ తరగతులు పలుచోట్ల నామమాత్రంగా సాగగా... కొన్నిచోట్ల అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎంపిక ప్రక్రియలో నిబంధనలు గాలికి... రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల తెరిచిన సెంటర్లకు ఏడు సంస్థలను బీసీ స్టడీ సర్కిల్ ఎంపిక చేసింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 సెంటర్ల బాధ్యతలు అప్పగించగా... మిగతా 30 సెంటర్ల నిర్వహణను మిగిలిన ఆరు సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సంస్థను ఎంపిక చేసేటప్పుడు ఆ సంస్థ నేపథ్యం, అనుభవం, సామర్ధ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా అభ్యర్థుల పెంపు... ఒక్కో బీసీ స్టడీ సెంటర్లో గ్రూప్–3, గ్రూప్–4 శిక్షణ తరగతుల కోసం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. మొత్తంగా 5వేల మందికి శిక్షణ ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెప్టెంబర్ 15 నాటికి తరగతులు ప్రారంభించి డిసెంబర్ 15కల్లా ముగించేలా కార్యాచరణ రూపొందించింది. కానీ చాలా కేంద్రాల్లో నిర్దేశించిన అభ్యర్థుల సంఖ్య కంటే సగం, అంతకంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నమోదయ్యారు. దీంతో గిట్టుబాటు కాదనుకున్న ప్రైవేటు సంస్థలు అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల సంఖ్య పెంపునకు అవకాశం కోరగా... తరగతులు ప్రారంభమైన నెలరోజుల తర్వాత అవకాశం కల్పిస్తూ బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ స్టడీ సెంటర్లుగా ఎంపిక చేసిన భవనాలన్నీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలే కావడంతో... ఏకంగా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులను సైతం చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల కాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రయోజనకరం కాకున్నా అవకాశం కల్పించడం వివాదాలకు తావిస్తోంది. సెంటర్ల నిర్వహణపై ఫిర్యాదుల వెల్లువ... బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై పలుచోట్ల అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడ్డగోలు నిర్వహణతో విలువైన సమయాన్ని వృథా చేశారంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు ఏకంగా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇరవై రోజుల్లో మూసేశారు... బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అంటే మరో ఆలోచన లేకుండా అడ్మిషన్ తీసుకున్నాను. కానీ కేవలం ఇరవై రోజుల్లో స్టడీ సెంటర్‌ను మూసేశారు. 25 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదు. మరోవైపు గ్రూప్–4 నోటిఫికేషన్ రాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వస్తుందని సమాచారం. ఇంతటి కీలక సమయంలో సెంటర్ మూసివేయడంతో మరో చోట కోచింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వకపోవడంతో ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు. వెంటనే స్టడీ సెంటర్‌ను తెరిచి శిక్షణ తరగతులు నిర్వహించాలి. – ప్రసాద్, వికారాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థి నిరుద్యోగుల జీవితాలతో ఆటలా... ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనడంతో ఎంతో నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు బీసీ స్టడీ సెంటర్లలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ప్రైవేటు సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడం... పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకుండా మధ్యలోనే చేతులెత్తేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. – ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలు నిబంధనల ప్రకారమే శిక్షణ సంస్థలకు బాధ్యతలు అప్పగించాం. స్టడీ సెంటర్ నిర్వహణ, వసతులన్నీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టగా... ఫ్యాకల్టీ, మాక్ టెస్టులు మాత్రం ప్రైవేటు కేంద్రానికి అప్పగించాం. తక్కువ కాల వ్యవధి శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి వారికి వేతనాలు ఇవ్వడం పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – అలోక్ కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్ -
మీకు నేనెవరో తెలుసా.!
సాక్షి, అనంతపురం : నేనెవరో మీకు తెలుసా? అంటూ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ప్రశ్నించారు. అభ్యర్థులు ఒక్కసారిగా లేచి జిల్లా మంత్రి శంకర నారాయణ అని బదులిచ్చారు. బుధవారం ఉదయం మంత్రి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలో ఉద్యోగుల వివరాలు అడిగారు. అటెండరు తప్ప తక్కిన ఉద్యోగులు లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు పని చేయాల్సి ఉండగా అటెండరు మాత్రమే ఉండడమేంటని మండిపడ్డారు. ఇంతలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, టీచరు రవి అక్కడికి చేరుకోగా తాను వచ్చి ఎంతసేపయింది ఇప్పటిదాకా ఎక్కడికెళ్లారు? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మంత్రి అభ్యర్థులతో మాట్లాడారు. క్వాలిఫై కాకపోయినా చాలామంది శిక్షణ తీసుకుంటున్నామని, తమకు కూడా మెటీరియల్ ఇచ్చేలా చూడాలని మంత్రిని కోరగా..వెంటనే ఆయన స్పందించి డెప్యూటీ డైరెక్టర్ ఉమాదేవితో ఫోన్లో మాట్లాడారు. అదనంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. మొత్తం 300 మందికి స్టడీ మెటీరియల్ ఇస్తారని మంత్రి ప్రకటించగా అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మానాయక్ ఉన్నారు. ఐసీడీఎస్ ఉద్యోగులపై మంత్రి కన్నెర్ర కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఉన్న కార్యాలయంలో ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారా? అని ఐసీడీఎస్ కార్యాలయ ఉద్యోగులపై మంత్రి శంకరనారాయణ కన్నెర్ర చేశారు. బుధవారం ఉదయం మంత్రి ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు, ఏయే హోదాల్లో పని చేస్తున్నారని పీడీ చిన్మయిదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయోమెట్రిక్ వివరాలను అడగగా నెల రోజులుగా యంత్రం పని చేయడం లేదని వివరించగా అటెండెన్స్ రిజిష్టర్ తెప్పించుకుని పరిశీలించారు. అందులో పలు లోపాలను గుర్తించి పీడీని మందలించారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఎందుకు సంతకాలు చేయడం లేదని ప్రశ్నించగా...ఏడాది కిందట సస్పెండ్ అయ్యారని మంత్రికి తెలిపారు. ఆ విషయం రికార్డులో పొందుపరచకుండా ప్రతినెలా ఎందుకు ఆయన పేరు రాస్తున్నారంటూ మండిపడ్డారు. మరో సీనియర్ అసిస్టెంట్ భారతి, అటెండెర్ లక్ష్మీదేవి ఆఫీసులో ఉన్నా రిజిష్టరులో ఎందుకు సంతకాలు చేయలేదని? ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీపై చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తానని మంత్రి ప్రకటించారు. -
పాలమూరు విద్యార్థులు ముందుండాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు నిలుస్తూ ఉద్యోగా ల సాధనలో కూడా ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షన తీసుకుంటున్న అభ్యర్థులకు బుధవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ వెనుకబడిన పేద విద్యార్థులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీకి పెద్దసంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నందున ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో పాటు కొరమోని వెంకటయ్య, సుదీప్‌రెడ్డి, మహేష్‌కుమార్, శివశంకర్, రవీందర్, రమాదేవి పాల్గొన్నారు. మైనార్టీ యువత ఉద్యోగాల్లో రాణించాలి స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యాన న్యూటౌన్‌లోని ప్రగతి కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరపున మొదటిసారి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాదాపు 190 మంది విద్యార్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. సూపరింటెండెంట్ బక్క శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఇసాక్, మక్సూద్ హుస్సేన్, తఖీ హుస్సేన్, అబ్రార్, వెంకటయ్య, శివశంకర్ పాల్గొన్నారు. నూతన పంచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నూతన గ్రామపంచాచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. నూతన గ్రామపంచాయితీల ద్వారా ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకాధికారుల హయాంలోఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో కూడళ్ల అభివృద్ధి పనులు, మినీ ట్యాంక్‌బండ్ వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీసీ సంఘ భవనంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ప్రారంభ, స్టడీ మెటీరియల్ పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు గ్రూప్–4, వీఆర్వో స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. బీసీ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఉద్యోగాల భర్తీ పరంపర మొదలైందన్నారు. ఇప్పటి వరకు 82 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగస్తులుగా మారాలని ఆకాంక్షించారు. ఒక ఉద్యోగంతో ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థ మారిపోతోందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాల వారికి సేవ చేయడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో 4 ఎకరాల్లో బీసీ భవనం నిర్మించ తలపెట్టామని, అందులో బీసీలే కాకుండా అన్ని పేదల వర్గాల వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు నమ్మకం, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ తరగతులకు ఎంపిక కానీ అభ్యర్థులు నిరాశ చెందవద్దన్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షలు వెచ్చించి మరో 200 మందికి శిక్షణ ఇíప్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ పర్సన్ రంగినేని మనీషా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పార్థ సారిథి, సభ్యులు వెండి బద్రేశ్వర్‌రావు, ప్రమోద్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు బండారు సతీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
‘గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్’
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అలాగే గట్టులో బీసీ బాలికల గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మంత్రి జోగురామన్నను బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్ కలిశారు. అక్షరాస్యత, ఉపాధి కల్పనలో జిల్లా వెనకబడి ఉన్నందున అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రిని కోరారు. వీటిపై ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
బీసీ స్టడీసర్కిల్‌లో సామాజిక కోటా
సాక్షి, హైదరాబాద్: సామాజిక కోటా కింద తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా బీసీలకు 75శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం సీట్లు ఇవ్వాలని పేర్కొంది. -
సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : బయోమెట్రిక్ పద్ధతి అమలుకన్నా ముందు హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఉదయం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వార్డన్ల సమావేశాన్ని వీరు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనేక హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ విద్య బలహీనపడుతోందన్నారు. వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదని, వంట మనుషులపై ఆధారపడుతున్నారన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేదే లేదని స్పష్టం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు బయటకి పంపారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం బండి పరుశురాం, ఏఐఎస్ఎఫ్ జాన్సన్, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం సాకే నరేష్, శివ, సురేష్, అనిల్, మధు, రాఘవ, భార్గవ్, రితేష్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పని సరి
ఆదిలాబాద్ రూరల్ : జిల్లాలోని కళాశాల విద్యార్థులకు సమాచార నైపుణ్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోటీ ప్రపంచంలో వివిధ పట్టాలు పొందడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుందని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ జి. ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ స్టడీ సర్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో చదవడం, రాయడం, మాట్లాడడం, వినడం, భాష, శరీర భాష వంటి వాటిపై స్కిల్స్ నేర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లక్ష్మీనరసింహ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం తము ఎంపిక చేసుకున్న రంగాల్లో అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సిన వ్యక్తీకరణ సమర్థ్యాలు అవసరమన్నారు. ఏదైనా ఉద్యోగం పొందాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని తెలిపారు. ఇది వరకు జిల్లాలోని బీసీ కళాశాల బాలికల, బాలుర ఆదిలాబాద్ వసతి గృహల్లో, ఎస్సీ మహిళా, బాలుర కళాశాల ఆదిలాబాద్‌లలో నిర్వహిస్తున్నామన్నారు. బాలికల, బాలుర కళాశాల బెల్లంపల్లి, బీసీ మహిళా మందమర్రి, బీసీ సంఘ భవనంలో ఆదిలాబాద్, బీసీ బాలికల కళాశాల కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ
సిద్దిపేట జోన్: ఎస్ఐ అర్హత సాధించిన యువతకు మెయిన్స్ కోసం శుక్రవారం నుంచి సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ కె.రాములు తెలిపారు. ఎస్ఐ ప్రిలిమినరీ పాసై, ఈవెంట్స్‌లో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. సంబంధిత విద్యార్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ టౌన్ హాల్‌నందు హాజరుకావాలని సూచించారు. అనుభవం కలిగిన నిపుణులచే శిక్షణ ఇప్పించి ఎస్ఐలుగా ఎంపికయ్యేందుకు స్టడీ సర్కిల్ దోహదపడుతుందన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి, ఉచిత స్టడీ మెటీరియల్‌ను కూడా అందిస్తామన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 80080 09970 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఎస్ఐ శారీరక దారుఢ్య పరీక్షల్లో ఆర్హత పొంది, రాత పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తారన్నారు. బీసీ సంక్షేమ శాఖ అదేశానుసారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా శిక్షన ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 3 వరకు ఆన్ లైన్లో tsbcstudycarcle. gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం. సెల్ నం. 9985434941లో సంప్రదించాలన్నారు. -
కలెక్టర్ ఆదేశించినా !
ఇందూరు: దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదు’ అన్న చందంగా ఉంది బీసీ స్టడీ సర్కిల్ అధికారి తీరు. తనకు అన్యాయం జరిగిందని.., న్యాయం చేసి ఆదుకోవాలని బాధిత ప్రభుత్వ ఉద్యోగి కలెక్టర్‌ను వేడుకున్నాడు. దీంతో బాధితుడి ఆవేదనలో న్యాయం ఉందని గ్రహించిన కలెక్టర్ బకారుులు చెల్లించాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. కానీ, సదరు అధికారి మాత్రం తన నీచబుద్ధిని చూపించాడు. బాధితుడిని ముప్పుతిప్పలు పెట్టడంతో బాధితుడు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు. జిల్లా కేంద్ర శివారు నాగారం ప్రాంతంలో ఉన్న జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో ఎన్. లక్ష్మి నరసింహచారి 2010 డిసెంబర్ 1వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్సోర్సింగ్ పద్దతిపై నియామకమయ్యూడు. అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు నెలసరి వేతనం రూ.8 వేలు ఉండగా, కొన్ని రోజుల తరువాత రూ.9500కు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు అదనంగా పెరిగిన రూ.1500 వేతనాన్ని పొందుతున్నారు. ఇతడికి మాత్రం పెరిగిన వేతనం నేటి వరకు అమలు కాలేదు. ఈ విషయమై తనకు న్యాయం చేయూలని గతంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ అధికారి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా న్యాయం జరగలేదు. దీంతో సదరు బాధిత ఉద్యోగి తనకు రావాల్సిన సుమారు రూ.70 వేలు నష్టపోయూడు. ఇటీవల మరోసారి ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి న్యాయం చేయూలని వేడుకున్నాడు. తనకు న్యాయం చేయూలని గ్రీవెన్స్ సెల్లో విన్నవించుకున్నాడు. దీంతో స్పందించిన ఆయన స్టడీ సర్కిల్ అధికారికి ఫైలు సమర్పించమని ఆయన సూచించారు.దీంతో ఆయన ఏజేసీకి ఫైలు సమర్పించగా పరిశీలించిన ఆయన కంప్యూటర్ ఆపరేటర్ వేతనం కోల్పోయిన విషయం వాస్తవమే అని గ్రహించి ఫైలును కలెక్టర్‌కు పంపించారు. దానిని పరిశీలించిన కలెక్టర్ బాధిత ఉద్యోగికి రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని స్టడీ సర్కిల్ అధికారిని ఆదేశించారు. దీంతో బాధిత ఉద్యోగి తనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు. మరుసటి రోజు బీసీ స్టడీ సర్కిల్ అధికారి వద్దకు వెళ్లి బాకాయి వేతనంపై వివరణ కోరగా సదరు అధికారి నేనివ్వని మోకాలడ్డాడు. ఏజేసీ, కలెక్టర్ ఫైలును సరిగా చూడకుండా సంతకం పెట్టారు. మరోసారి నేను వారితో మాట్లాడుతానని అన్నట్లు బాధితుడు తెలిపాడు. చేతుల వరకు బాకాయి డబ్బులు చేజారి పోయూయని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.అయినా పట్టువదలని బాధితుడు తనకు న్యాయం చేయూలని కోరుతూ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిచాడు. పర్సంటేజీ కోసమేనా...? కంప్యూటర్ ఆపరేటర్‌గా మూడేళ్లు పనిచేసిన బా ధితుడు తనకు రావాల్సిన బకాయి వేతనాలు ఇవ్వాలని తిరుగుతున్నా అధికారులు సతాయించడం వెనుక ఆం తర్యమేమిటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్సం టేజీ ఇస్తే డబ్బులు ఇచ్చే వారేమో అనే ఆరోపణలు విని పిస్తున్నాయి. స్వయంగా కలెక్టర్, ఏజేసీ ఆదేశించినా బకాయిలు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అనే వాదనలు ఉన్నాయి. ‘అతడికి చెప్పు... అందులోం చి పర్సంటేజీ ఇవ్వాలని. అలా చేస్తే రావాల్సిన బాకాయిలు ఇప్పిస్తా’ అని కార్యాలయంలోని ఓ మధ్యవర్తితో సదరు ఉద్యోగి అన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
సమస్యల ‘సర్కిల్’
ఇందూరు: అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా బీసీ స్టడీ సర్కిల్ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన స్టడీ సర్కిల్‌ను నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అది కూడా అడవి, గుట్ట ప్రాంతం మధ్యలో ఉంది. ఇక్కడ పాములు, విష పురుగుల భయంతోపాటు, సాయంత్రమైతే మందుబాబుల బెడద తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇంత దూరం వరకు వచ్చి శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. వారికి ప్రతిరోజు దారి ఖర్చులే రూ.50 వరకు అవుతాయి. వసతులు సరిగా లేని అద్దె భవనంలో శిక్షణ పొందటం, చుట్టూ భయానక వాతావరణం ఉండడంతో అభ్యర్థులు జంకుతున్నారు. ఉచిత శిక్షణ కోసం బీసీ విద్యార్థులు, అభ్యర్థులు గ్రూప్స్, పోలీసు, ఆర్మీ, ఫారెస్ట్, ఎక్సైజ్, డీఎస్సీ, వీఆర్ఓ, వీఆర్ఏ, బ్యాంకు, తదితర పోటీ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం 2010లో బీసీ స్టడీ సర్కిల్‌ను మంజూరు చేసింది. ఆ సమయంలో జిల్లా కేంద్రంలోనే అద్దె భవనంలో దీనిని ఏర్పాటు చేయగా, తర్వాత నాగారం రాజారాం స్టేడియం వెనుక ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి అభ్యర్థులు స్టడీ సర్కిల్‌కు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి నిత్యం ఏడు కిలో మీటర్ల దూరం వెళ్లే బదులు జిల్లా కేంద్రంలో ఉన్న ఏదో ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరిపోదామని ఆలోచిస్తున్నారు. మహిళలు నాగారం వరకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇన్నేళ్లో శిక్షణ తీసుకోవడానికి మహిళలు ఐదుగురికి మించి రాలేదు. 2014-15 సంవత్సరానికి కేవలం రెండు కోర్సుల అభ్యర్థులకే శిక్షణనిచ్చారు. అవి కూడా ఒకటి ఫారెస్ట్ పరీక్షలు కాగా, మరొకటి బ్యాంకింగ్ కోచింగ్. ఫారెస్టు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్వారికే శిక్షణ ఇస్తుంది. ఇందులో 60 సీట్లకు గాను కేవలం 26 మంది మాత్రమే కోచింగ్ తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ కోచింగ్ తీసుకునే వారికి మెటీరియల్ బుక్స్ అందలేదు. డబ్బులిస్తాం మీరే కొనుక్కోవాలని సూచించినట్లు సమాచారం. నిధులు వృథా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు, స్టడీ సర్కిల్లో పని చేసే ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం ఏటా రూ.25 లక్షలను మంజూరు చేస్తుంది. కానీ, సంవత్సరంలో రెండు నుంచి మూడు కోర్సులకు మాత్రమే శిక్షణ ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. బయటి వ్యక్తులచే అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అలా అయితే ఉద్యోగులు ఉండి ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇతరులచే క్లాస్ చెప్పించే కార్యక్రమం పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. స్టడీ సర్కిల్లో ప్రస్తుతం కోర్సు కో ఆర్డినేటర్, లైబ్రేరియన్, వాచ్‌మన్, అటెండర్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్/ టైపిస్టు/ కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, ఇలా మొత్తం ఏడుగురు ఉద్యోగులు పని చే స్తున్నారు. గతంలో ఇంతమంది అవసరం లేదని, నిధులు వృథా అవుతున్నాయని అటెండర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు తప్ప మిగతావాటిని రద్దు చేసింది. రాజకీయ నాయకుల సహకారంతో మళ్లీ ఆ నాలుగు పోస్టులను తిరిగి మంజురు చేయించుకున్నారు. ప్రస్తుతం వారు ఏ పని లేకపోగా కూర్చుండి నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు. విషయం తెలిసీ కూడా సంబంధిత ఉన్నతాధికారులు మౌనంగా ఉంటున్నారు. స్టడీ సర్కిల్ లక్ష్యం నెరవేరకుండానే, ఏటా రూ.25 లక్షల నిధులు వృథాగా అవుతున్నాయి. కలగానే నూతన భవన నిర్మాణం బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని జిల్లా కేంద్రంలో నిర్మించాలని ఒత్తిడితేగా ప్రభుత్వం 2012లో మంజురు చేసింది. ఇందుకు నగరంలోని గంగాస్థాన్‌లో ఉన్న 2000 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.15 కోట్లను కూడా మంజురు చేసింది. అప్పటి ఎంపీ మధుగౌడ్ అదనంగా రూ. 30 లక్షలు కూడా అందజేశారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడంతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముంది. చర్యలు తీసుకుంటున్నాం బీసీ స్టడీ సర్కిల్లో సమస్యలు వాస్తవమే. శిక్షణ తీసుకునేందుకు అభ్యర్థులు నాగారం వరకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అద్దె భవనం పాతది కావడంతో అభ్యర్థులు శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో కోర్సులు ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలో కొత్త భవనం మంజూరై రెండేళ్లవుతోంది. నిర్మించడంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారు. -విమలాదేవి, బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ అధికారి -
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణకు నేడు ఎంట్రన్స్
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రాల (బీసీ స్టడీసర్కిళ్ల) ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ కోసం ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్లోనే ఈ ప్రవేశపరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్)ను నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ (60 సీట్లు), కరీంనగర్ (40 సీట్లు), వరంగల్ (40 సీట్లు) బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉచితంగా శిక్షణనిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 2,600 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి డెరైక్టర్ ఆలోక్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
బీసీ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ శిక్షణ
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2015 ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ సంచాలకులు మల్లిఖార్జున్ తెలిపారు. HTPP://TSBCSTUDYCIRCLES.CGG.GOV.IN అనే వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉందని, ఆన్లైన్ ద్వారా నవంబర్ 5లోగా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. నవంబర్ 16న జరిగే ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైనవారికి హైదరాబాద్, వరంగల్, కరీంనగ ర్లోగల బీసీ స్టడీసర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 040-24611408, 18004250039 నంబర్లలో సంప్రదించవచ్చు. -
పోరాటం ఫలించింది
బీసీ విద్యార్థి సంఘాల మూడేళ్ల పోరాటం, జిల్లా అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల ప్రయత్నం ఫలించింది. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి అనుమతి లభించింది. విశాల భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జీఓఆర్టీ నం. 21 విడుదలైంది. ఇక బీసీ విద్యార్థుల చదువు కష్టాలు తీరనున్నాయి. ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎంపీ మధుగౌడ్ యాష్కీ కూడా ఇప్పటికే తన ఫండ్ నుంచి రూ.30 లక్షల నిధులను కేటా యిం చారు. తెలిసిందే. ప్రభుత్వం మంజురు చేసినవి, ఎంపీ ఇచ్చినవి మొత్తం రూ.2.55 కోట్లు భవన నిర్మాణానికి సమకూరాయి. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. బీసీ విద్యార్థి సంఘాల పోరాటం జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలని మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ వస్తోంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టింది. ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించింది. రాష్ర్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు, జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇతర ప్ర జా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు కూడా విన్నవించింది. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. తెచ్చారు. బీసీ సంఘాల నాయకులు కూడా అధికారులను, మంత్రులను కలిసి విజ్ఞాపనలు సమర్పించారు. ప్రజా ప్రతినిధుల చొరవ... అధికారుల కృషి ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముందుగా ఎంపీ మదుగౌడ్ స్పందించి నిధులు ఇవ్వడమే కాకుండా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వ రాజ్ సారయ్యతో మాట్లాడారు. ఆయ న ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయించా రు. మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. జిల్లాలో గతంలో పని చేసిన ముగ్గురు కలెక్టర్లతోపాటు ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న కూడా దీనిపై దృష్టిసారించారు. స్థలం కూడా రెడీ బీసీ స్డడీ సర్కిల్ భవన నిర్మాణానికి అధికారులు స్థలం రెడీగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ పేజ్-1లో ఉన్న 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. గతంలో నాగారాం తదితర ప్రాంతాలలో స్థలాలు చూశారు. జిల్లా కేంద్రానికి దూరం కావడంతో ఎంపిక చేయలేదు. విశాలవంతంగా, అన్ని హంగులు, సౌకర్యాల తో నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయితే బీసీ విద్యార్థులకు అనువుగా ఉంటుంది. గ్రూప్స్, సివిల్స్, ఇతర పరీక్షలకు ఇందులోనే ఉచితంగా ప్రిపేర్ కావచ్చు. టెండర్లు పూర్తి కాగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణాని కి ప్రభుత్వం నిధులు మంజురు చేసింది. భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాం. కలెక్టర్ అనుమతి తీసుకుని టెండర్లు వే యగానే పనులు ప్రారంభం అవుతాయి. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి విద్యార్థుల పోరాట ఫలితమే మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థులు చేపట్టిన పోరాట ఫలితంగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.నిధుల మం జూరుకు కృషి చేసిన ఎంపీ మధుగౌడ్, మంత్రులు బస్వరాజ్ సారయ్య, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్లకు ప్రత్యేకంగా అబినందనలు. -శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాణ్యమైన విద్య అందుతుంది బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి ప్రభుత్వం అధిక మొ త్తంలో నిధులు కేటాయించడం, ఇటు ఎంపీ కూడా స హాయం చేయడం ఆనందంగా ఉంది. బడుగు బల హీన వర్గాలకు ఇక నుంచి నాణ్యమైన విద్య అందుతుంది. ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ పొందవచ్చు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలి. -నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీసర్కిల్ సెంటర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సర్కిల్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్, స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. వివరాలకు ఏలూరు సెయింట్ ఆన్స్ కళాశాల సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట ఉన్న బీసీ స్టడీ సెంటర్లో గాని, 08812 232477 నంబర్‌లోగాని సంప్రదించాలని మల్లికార్జునరావు సూచించారు. -
బీసీ స్టడీ సర్కిల్లో రూ. 5 కోట్ల కుంభకోణం: ఆర్.కృష్ణయ్య
విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్ ఉన్నతాధికారులు రూ. ఐదు కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. పుస్తకాలు, పత్రికల పేరుతో బోగస్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను అధికారులు స్వాహా చేశారని, దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. బహిరంగ టెండర్లు పిలవకుండానే పుస్తకాలు, మ్యాగజైన్లు కొనుగోలు చేశామని బీసీ స్టడీ సర్కిల్ అధికారులు దొంగ బిల్లులు సృష్టించి రూ. ఐదు కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని, దీని గురించి సీఎస్‌కు వివరించినట్టు చెప్పారు.