బీసీ విద్యార్థి సంఘాల మూడేళ్ల పోరాటం, జిల్లా అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల ప్రయత్నం ఫలించింది. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి అనుమతి లభించింది. విశాల భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జీఓఆర్‌టీ నం. 21 విడుదలైంది. ఇక బీసీ విద్యార్థుల చదువు కష్టాలు తీరనున్నాయి.
ఇందూరు, న్యూస్‌లైన్:
జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎంపీ మధుగౌడ్ యాష్కీ కూడా ఇప్పటికే తన ఫండ్ నుంచి రూ.30 లక్షల నిధులను కేటా యిం చారు. తెలిసిందే. ప్రభుత్వం మంజురు చేసినవి, ఎంపీ ఇచ్చినవి మొత్తం రూ.2.55 కోట్లు భవన నిర్మాణానికి సమకూరాయి. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి.
బీసీ విద్యార్థి సంఘాల పోరాటం
జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలని మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ వస్తోంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టింది. ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించింది. రాష్ర్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు, జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇతర ప్ర జా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు కూడా విన్నవించింది. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. తెచ్చారు. బీసీ సంఘాల నాయకులు కూడా అధికారులను, మంత్రులను కలిసి విజ్ఞాపనలు సమర్పించారు.
ప్రజా ప్రతినిధుల చొరవ... అధికారుల కృషి
ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముందుగా ఎంపీ మదుగౌడ్ స్పందించి నిధులు ఇవ్వడమే కాకుండా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వ రాజ్ సారయ్యతో మాట్లాడారు. ఆయ న ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయించా రు. మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. జిల్లాలో గతంలో పని చేసిన ముగ్గురు కలెక్టర్‌లతోపాటు ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న కూడా దీనిపై దృష్టిసారించారు.
స్థలం కూడా రెడీ
బీసీ స్డడీ సర్కిల్ భవన నిర్మాణానికి అధికారులు స్థలం రెడీగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ పేజ్-1లో ఉన్న 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. గతంలో నాగారాం తదితర ప్రాంతాలలో స్థలాలు చూశారు. జిల్లా కేంద్రానికి దూరం కావడంతో ఎంపిక చేయలేదు. విశాలవంతంగా, అన్ని హంగులు, సౌకర్యాల తో నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయితే బీసీ విద్యార్థులకు అనువుగా ఉంటుంది. గ్రూప్స్, సివిల్స్, ఇతర పరీక్షలకు ఇందులోనే ఉచితంగా ప్రిపేర్ కావచ్చు.
టెండర్లు పూర్తి కాగానే
బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణాని కి ప్రభుత్వం నిధులు మంజురు చేసింది. భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాం. కలెక్టర్ అనుమతి తీసుకుని టెండర్లు వే యగానే పనులు ప్రారంభం అవుతాయి.
-విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి
విద్యార్థుల పోరాట ఫలితమే
మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థులు చేపట్టిన పోరాట ఫలితంగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.నిధుల మం జూరుకు కృషి చేసిన ఎంపీ మధుగౌడ్, మంత్రులు బస్వరాజ్ సారయ్య, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్‌లకు ప్రత్యేకంగా అబినందనలు.
-శ్రీనివాస్‌గౌడ్,
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నాణ్యమైన విద్య అందుతుంది
బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి ప్రభుత్వం అధిక మొ త్తంలో నిధులు కేటాయించడం, ఇటు ఎంపీ కూడా స హాయం చేయడం ఆనందంగా ఉంది. బడుగు బల హీన వర్గాలకు ఇక నుంచి నాణ్యమైన విద్య అందుతుంది. ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ పొందవచ్చు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలి.
-నరాల సుధాకర్,
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
పోరాటం ఫలించింది
Published Sun, Feb 2 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement