Baswaraj Saraiah
-
మాజీ మంత్రికి షాక్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సారయ్యకు టిక్కెట్ ఇవ్వటానికి ఆయన నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతికి కూడా కేసీఆర్ టిక్కెట్ ఇచ్చేందకు నిరాకరించారు. ఆదివారం బస్వరాజ్ సారయ్య, కుంజా సత్యవతి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని వారిని కేసీఆర్ బుజ్జగించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని నేతలకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వని నేతలకు కేసీఆర్ ముందుగానే సమాచారం ఇస్తున్నారు. ఎమ్మెల్సీగా, కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం ఇస్తానని బుజ్జగిస్తున్నారు. -
సారయ్యపై కొండా సురేఖ విజయం
వరంగల్ : వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ గెలుపొందారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్యపై 40వేల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. మరోవైపు వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ గెలుపొందారు. వర్థన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ విజయం సాధించారు. ఇక టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. -
అధికారులే సుప్రీం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో ప్రజాప్రతినిధుల పాలనకు తాత్కాలికంగా తెరపడింది. రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడంతో పాలనపై సర్వాధికారాలు గవర్నర్ చేతుల్లోకి వెళ్లాయి. దీంతో జిల్లాలో కలెక్టర్, ఎస్పీలే కీలకం కానున్నారు. పాలనా వ్యవహారాల్లో పూర్తి అధికారాలు, బాధ్యతలు వారి చేతుల్లోకి వెళ్లాయి. శాసనసభ సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యేలు పదవుల్లో కొనసాగుతున్నా, ప్రజలకు మాత్రం అధికార యంత్రాంగమే జవాబుదారీ కానుంది. రాష్ట్రపతి పాలనలో పనిచేయడం కొత్తగా, ఆసక్తిగా ఉందని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అన్ని అంశాలపై స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ పాలనా తీరు ఎలా ఉంటుందో చెప్పలేమని జిల్లా ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు అనేక ఇబ్బందులు పడిన అధికారులకు ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి. సారయ్య నియోజకవర్గానికే పరిమితం.. రాష్ట్ర మంత్రి వర్గం రద్దు కావడంతో బస్వరాజు సారయ్య మాజీ మంత్రి అయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఆయన ఇకపై తన నియోజకవర్గం వరంగల్ తూర్పునకే పరిమితం కానున్నారు. జిల్లా అధికార యంత్రాంగంపై ఈ మంత్రి అజమాయిషీ చేయడానికి అవకాశం ఉండదు. ఇక నుంచి జిల్లాలో ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వీల్లేకుండా పోయిం ది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నెల రోజులుగా జిల్లాలోని ప్రజాప్రతినిధు లు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మునిగితేలారు. ఇప్పుడు ఇన్చార్జి మంత్రి జిల్లాలో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. సాధారణంగా ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించాక ఈ పరిస్థితులుంటాయి. కానీ రాష్ట్రపతి పాలన కారణంగా షెడ్యుల్ రాకముందే ఇలాంటి పరిస్థితి నెలకొనడం గమనార్హం. అడుగులకు మడుగులొత్తితే ఇక అంతే.. అధికార యంత్రాంగానికి ఇప్పుడు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కొద్ది రోజులైనా పనిచేసే అవకాశం లభించింది. ఈ సమయంలోనైనా జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో అనేక మంది అధికారులు నేతల చెప్పు చేతల్లో పనిచేశారనే విమర్శలున్నాయి. ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తిన ఓ అధికారిపై సరేండర్ వేటు పడిన విషయం విధితమే. ఇప్పుడు అధికారులు ఇలాంటి వ్యవహారాలకు మరింత దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరికి అనుకూలంగా వ్యవహరించడం, బిల్లులు, ఇతర పాలనా వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడితే గవర్నర్ దృష్టికి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో కఠిన చర్యలుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పోరాటం ఫలించింది
బీసీ విద్యార్థి సంఘాల మూడేళ్ల పోరాటం, జిల్లా అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల ప్రయత్నం ఫలించింది. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి అనుమతి లభించింది. విశాల భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జీఓఆర్టీ నం. 21 విడుదలైంది. ఇక బీసీ విద్యార్థుల చదువు కష్టాలు తీరనున్నాయి. ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎంపీ మధుగౌడ్ యాష్కీ కూడా ఇప్పటికే తన ఫండ్ నుంచి రూ.30 లక్షల నిధులను కేటా యిం చారు. తెలిసిందే. ప్రభుత్వం మంజురు చేసినవి, ఎంపీ ఇచ్చినవి మొత్తం రూ.2.55 కోట్లు భవన నిర్మాణానికి సమకూరాయి. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. బీసీ విద్యార్థి సంఘాల పోరాటం జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలని మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ వస్తోంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టింది. ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించింది. రాష్ర్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు, జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇతర ప్ర జా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు కూడా విన్నవించింది. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. తెచ్చారు. బీసీ సంఘాల నాయకులు కూడా అధికారులను, మంత్రులను కలిసి విజ్ఞాపనలు సమర్పించారు. ప్రజా ప్రతినిధుల చొరవ... అధికారుల కృషి ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముందుగా ఎంపీ మదుగౌడ్ స్పందించి నిధులు ఇవ్వడమే కాకుండా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వ రాజ్ సారయ్యతో మాట్లాడారు. ఆయ న ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయించా రు. మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. జిల్లాలో గతంలో పని చేసిన ముగ్గురు కలెక్టర్లతోపాటు ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న కూడా దీనిపై దృష్టిసారించారు. స్థలం కూడా రెడీ బీసీ స్డడీ సర్కిల్ భవన నిర్మాణానికి అధికారులు స్థలం రెడీగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ పేజ్-1లో ఉన్న 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. గతంలో నాగారాం తదితర ప్రాంతాలలో స్థలాలు చూశారు. జిల్లా కేంద్రానికి దూరం కావడంతో ఎంపిక చేయలేదు. విశాలవంతంగా, అన్ని హంగులు, సౌకర్యాల తో నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయితే బీసీ విద్యార్థులకు అనువుగా ఉంటుంది. గ్రూప్స్, సివిల్స్, ఇతర పరీక్షలకు ఇందులోనే ఉచితంగా ప్రిపేర్ కావచ్చు. టెండర్లు పూర్తి కాగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణాని కి ప్రభుత్వం నిధులు మంజురు చేసింది. భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాం. కలెక్టర్ అనుమతి తీసుకుని టెండర్లు వే యగానే పనులు ప్రారంభం అవుతాయి. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి విద్యార్థుల పోరాట ఫలితమే మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థులు చేపట్టిన పోరాట ఫలితంగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.నిధుల మం జూరుకు కృషి చేసిన ఎంపీ మధుగౌడ్, మంత్రులు బస్వరాజ్ సారయ్య, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్లకు ప్రత్యేకంగా అబినందనలు. -శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాణ్యమైన విద్య అందుతుంది బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి ప్రభుత్వం అధిక మొ త్తంలో నిధులు కేటాయించడం, ఇటు ఎంపీ కూడా స హాయం చేయడం ఆనందంగా ఉంది. బడుగు బల హీన వర్గాలకు ఇక నుంచి నాణ్యమైన విద్య అందుతుంది. ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ పొందవచ్చు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలి. -నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
మరిసారన్నా..
ఇండోర్ స్టేడియం... దయనీయం క్రీడల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఇండోర్ స్టేడియం పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా క్రీడాకారులకు ఉపయోగపడడడం లేదు. రూ.3.50 కోట్లతో నిర్మించిన స్టేడియాన్ని కార్పొరేషన్ డంప్ యార్డుగా మార్చారు. ఇటీవలే చెత్త పోయడం నిలిపివేశారు. హన్మకొండ, కాజీపేట వాసులకు ఓపెన్ ఎయిర్ స్టేడియంలు, ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్‌ఫూల్ అందుబాటులో ఉన్నాయి. వరంగల్ క్రీడాకారులకు ఆ సౌకర్యం లేకుండా పోయింది. పార్క నో... జిల్లా కేంద్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు టైక్స్టైల్స్ పార్కు ఏర్పాటు విషయంలో మంత్రి సారయ్య చేస్తున్న చర్యలు ఏమీ లేవు. పార్కు కు కేటాయించిన స్థలం కబాకు గురైంది. మంత్రి నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి. మో‘డల్’ మార్కెట్ వరంగల్ కూరగాయల మార్కెట్ ప్రాంతం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మార్కెట్లో కనీస వసతులు లేవు. రూ.3 కోట్లతో మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. ‘నీటి’మూటలే... వరంగల్ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని మంత్రి సారయ్య చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. నగర ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్‌రెడ్డి రూ.178 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. నాసిరకం పైపులైన్లు, అధికార పార్టీ నేతల, అధికారుల కమీషన్ల కక్కుర్తితో పనులు నాసిరకంగా సాగాయి. నాణ్యతలేని పైపులైన్లతో నగర ప్రజలకు తాగు నీటి కష్టాలు తొలగడంలేదు. కలగానే... మ్యూజియం ఖిలావరంగల్ కోటలో మ్యూజియం నిర్మాణం కోసం ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. గుండు చెరువు సమీప స్థలంలో 2010 మే 26న అప్పటి పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డిచే శంకుస్థాపన చేయించారు. స్థల వివాదంతో అది అటకెక్కింది. కోటలోని మరో స్థలంలో 2012 మార్చి 19న శంకుస్థాపన జరిగింది. ఇప్పటికీ ఇది మందుకుపడడంలేదు. అంతరిక్ష విజ్ఞానం అందించే ప్లానిటోరి యం మూతపడింది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూడేళ్లుగా తాళం వేసి ఉంది. ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి దాపురించింది. -
ఢిల్లీ సమావేశానికి ఇద్దరు నేతలు డుమ్మా
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఏఐసీసీ సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు డుమ్మాకొట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, పీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ హరి రమాదేవి సమావేశానికి గైర్హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి సారయ్య చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. సొంత పని కారణంగా హరి రమాదేవి వెళ్లలేక పోయినట్లు పేర్కొంటున్నారు. జిల్లా నుంచి ఆహ్వానం అందుకున్న తొమ్మిదిలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, రాపోలు ఆనందభాస్కర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్, జిల్లా అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో వాగ్వా దం జరిగినట్లు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో చెప్పారు. ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానం అందని లగడపాటి అక్కడికి వచ్చి సమైక్యాంధ్ర నినాదా లు చేస్తున్న సమయంలో తాను జై తెలంగాణ అనడం తో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన మీకు ఈ సమావేశంలో పాల్గొనే హక్కులేదని వాదించినట్లు తెలిపారు. -
భారతావనికే ఆదర్శం కాకతీయుల పాలన
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : కాకతీయుల పాలన యావత్ భారతదేశానికే ఆద ర్శం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాకతీ య ఉత్సవాలు ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. కాకతీయ ముగింపు ఉత్సవా ల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు వేయిస్తంభాల గుడి లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం. కళా సాహిత్య రంగాల అభివృద్ధికి కాకతీయులు చేసిన సేవలు భావితరాలకు మార్గదర్శకం కావడానికి ఈ ఉత్సవాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. తెలంగాణ పునఃర్నిర్మాణంలో కవులు, కళాకారులు, మేధావులు సహకరించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. విషిష్ట అతిథిగా హాజరైన ఎంపీ రాజయ్య మాట్లాడుతూ కాకతీయుల పాలన స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. తన నిధుల నుంచి వరంగల్ కోట అభివృద్ధికి రూ.5 కోట్లు, రామప్ప పరిరక్షణకు రూ.5.80 కోట్లు, గణపురం కోటగుళ్లకు రూ.3.50 కోట్లు, పాండవుల గుట్ట కు రూ.1.50కోట్లు, చేర్యాల, పెంబర్తి హస్త కళాకారుల అభివృ ద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. చట్టసభల్లో మన వాటాకోసం పోరాడి సాధించుకుందామని అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాల కోసం నిర్వహించిన రివ్యూలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు ముందు రూ.300కోట్లు విడుదల చేయాలని కోరితే గుడ్డి, చెవిటి చేతకాని సీమాంధ్ర ప్రభుత్వం ముష్టి రూ.30లక్షల ఇచ్చిందని విమర్శించారు. శ్రీకృష్ణ దేవరాయుల ఉత్సవాల కోసం రూ.300కోట్లు కేటాయించి, తపాల బిళ్ల సైతం విడుదల చేసిన సర్కారు కాకతీయ ఉత్సవాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని చెప్పారు. కార్యక్రమంలో వేయిస్తంభాల ఆల య ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ప్రముఖ నవ లా రచయిత అంపశయ్య నవీన్, ఏపీఆర్ఓ శ్రీనివాస్, పులి రజినీకాంత్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొనగా వ్యాఖ్యాతగా వల్స పైడి వ్యవహరించారు. శిల్ప కళావైభవం అద్భుతం ఖిలావరంగల్ : కాకతీయుల శిల్ప కళావైభవం అద్భుతమని మంత్రి బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శనివారం ఖిలావరంగల్ మధ్యకోటలో జరిగిన కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి సముచిత స్థానం కల్పిస్తున్నామని, కాకతీయులు నాడే రాణి రుద్రమదేవికి రాజ్యాధికారం అప్పగించి మహిళలకు పెద్ద పీట వేశారని చెప్పారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ వరంగల్ ఘన కీర్తిని ఢిల్లీలో చెప్పుకుంటారని అన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశామన్నారు. తెలంగా ణ ప్రాంత రాజకీయ నాయకులు కలిసి కట్టుగా ముందు సాగి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపించిందని, ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైన తర్వాత వరంగల్కోట సమగ్ర అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. జెడ్పీ సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు కాకతీయులు కట్టడానికి వినియోగించిన టెక్నాలజీని గమనించి వారి తీపిగురుతుగా గుర్తుంచుకోవాలన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాకతీయులు గొప్ప కళాకారులు, శిల్పులని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ కౌన్సిలర్ సిరబోయిన కృష్ణ, బిల్లశ్రీకాంత్, యాకయ్య, జీవన్‌గౌడ్, గైడ్స్ రవియాదవ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి మంత్రి సుడిగాలి పర్యటన
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య శనివారం తూర్పు, పశ్చిమ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి రచ్చబండలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 10.30 గంటలకు బెల్లంపల్లికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి బెల్లంపల్లి మండ లం గురిజాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన రూ.13కోట్లతో తలపెట్టిన సాంఘిక సంక్షేమ బాలుర విద్యాలయం, రూ.3కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహం, రూ.కోటితో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం ఆసిఫాబాద్‌కు వెళ్లారు. రూ.40లక్షలతో నిర్మించిన అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేశారు. ఆసిఫాబాద్‌లో రూ.6.5 కోట్లతో ఫిల్టర్‌బెడ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.80 లక్షలతో ఆర్అండ్బీ రోడ్ నుంచి సాలెగూడకు బీటీ రోడ్డు నిర్మాణానికి, వాంకిడి మండలం కనర్గాంలో రూ.7.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి కెరమెరి మండలానికి చేరుకున్నారు. కెరమెరిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైనూర్, కెరమెరి మండలాల్లో రూ.1.35 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు భూమిపూజ చేశారు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో మార్లవాయి, కంచెన్పల్లి, కోహినూర్ గ్రామాల్లో రూ.1.70 కోట్లతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిర్యాణి మండలం రోంపల్లిలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, వాంకిడి మండలం బంబరలో రూ.50 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సిర్పూర్, జైనూర్ మండలాల్లో రూ.3 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. -
తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దు: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దని రాష్ట్రమంత్రులు డీకే అరుణ, బస్వరాజ్ సారయ్యలు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు తమ ఒత్తిడి కొనసాగుతుందని మంత్రి సారయ్య ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో సోనియాగాంధీ, రాహుల్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి సారయ్య అన్నారు. కావాలనే తెలంగాణ ప్రజల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు మంత్రి సారయ్య అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కిపోదు: డీకే అరుణ తెలిపారు. తెలంగాణ మంత్రులమంతా సీఎం కిరణ్ కుమార్, సీమాంధ్ర మంత్రులతో చర్చిస్తామని డీకే అరుణ అన్నారు. నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలకు చర్చలతో పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావొద్దు అని డీకే అరుణ అన్నారు.