ఢిల్లీ సమావేశానికి ఇద్దరు నేతలు డుమ్మా | two leaders missing to delhi meeting | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సమావేశానికి ఇద్దరు నేతలు డుమ్మా

Published Sat, Jan 18 2014 6:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

two leaders missing to delhi meeting

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఏఐసీసీ సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు డుమ్మాకొట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, పీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ హరి రమాదేవి సమావేశానికి గైర్హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి సారయ్య చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. సొంత పని కారణంగా హరి రమాదేవి వెళ్లలేక పోయినట్లు పేర్కొంటున్నారు.

జిల్లా నుంచి ఆహ్వానం అందుకున్న తొమ్మిదిలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, రాపోలు ఆనందభాస్కర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్, జిల్లా అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో వాగ్వా దం జరిగినట్లు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో చెప్పారు.

ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానం అందని లగడపాటి అక్కడికి వచ్చి సమైక్యాంధ్ర నినాదా లు చేస్తున్న సమయంలో తాను జై తెలంగాణ అనడం తో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన మీకు ఈ సమావేశంలో పాల్గొనే హక్కులేదని వాదించినట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement