తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దు: డీకే అరుణ | Problems will solve with discussions, says DK Aruna | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దు: డీకే అరుణ

Published Mon, Sep 9 2013 6:21 PM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM

తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దు: డీకే అరుణ

తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దు: డీకే అరుణ

హైదరాబాద్:
తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావోద్దని రాష్ట్రమంత్రులు డీకే అరుణ, బస్వరాజ్ సారయ్యలు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు తమ ఒత్తిడి కొనసాగుతుందని మంత్రి సారయ్య ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో సోనియాగాంధీ, రాహుల్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి సారయ్య అన్నారు. కావాలనే తెలంగాణ ప్రజల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు మంత్రి సారయ్య అన్నారు.

తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీసుకున్న నిర్ణయంపై  కాంగ్రెస్ వెనక్కిపోదు: డీకే అరుణ తెలిపారు. తెలంగాణ మంత్రులమంతా సీఎం కిరణ్ కుమార్, సీమాంధ్ర మంత్రులతో చర్చిస్తామని డీకే అరుణ అన్నారు.  నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలకు చర్చలతో పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావొద్దు అని డీకే అరుణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement