Madhu Goud Yaskhi
-
మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనర్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంపై పారాచూట్‌గా వచ్చి వాలుతున్నారంటూ పోస్టర్లు అంటించారు. గో బ్యాక్ నిజామాబాద్’ అంటూ పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. కాగా మధుయాష్కీపై పోస్టర్లు వేయిచింది ఎల్బీనగర్కు చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మధు యాష్కిగౌడ్ కోరారు. ఇక 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మధు యాష్కీ విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి బరిలోకి దిగిన మధుయాష్కీ.. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిచెందారు. చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలకపరిణామం ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీకి దూరంగా ఉండాలని మధు యాష్కీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన ఆయన.. ఎల్బీ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కాగా గాంధీభవన్‌లో నేటి ఉదయం 11 గంటల నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ వ్యక్తిగతంగా సమావేశం కానుంది. స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఒక్కొక్క నేతలతో సాయంత్రం వరకు సమావేశం కొనసాగనుంది. అదే విధంగా పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేయనుంది. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక అందజేయనుంది. చదవండి: ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె! -
తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే: మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. దీనిపై పార్టీ పెద్దల వద్ద చర్చ జరిగిందని తెలిపారు. త్వరలో ఏఐసీసీ ఇంఛార్జి నేతృత్వంలో సమీక్ష చేసుకుంటామన్నారు. త్వరలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యవేక్షణకు వస్తారన్నారు. పార్టీ ధిక్కరణ చర్యలకు పాల్పడే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్‌ను ఎవరూ సింగిల్‌గా గెలిపించలేరు. పార్టీలో ఉండాలనుకునేవారు కలిసి పనిచేయాల్సిందేనని అన్నారు. 'ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తూ బహుజనులు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలలు మూసేస్తున్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తున్నారు. తెలంగాణ లిక్కర్ పాలసీ ఢిల్లీ, పంజాబ్ పాలసీని కాపీ కొట్టినట్లు ఉంది. లిక్కర్ వ్యాపారంలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు. యువతను లిక్కర్, డ్రగ్స్‌కు అలవాటు చేస్తున్నారు. తెలంగాణ లిక్కర్ స్కాం పై సిబిఐ విచారణ జరగాలి' అని పేర్కొన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి కేసిఆర్ ప్రోటోకాల్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లినపుడు మోడీ కాళ్ల మీద పడి వస్తారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, బీజేపీ పంచాయతీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో దొంగలే దొంగ అన్నట్టు ఉందన్నారు. గవర్నర్‌కి అనుమానం ఉంటే హోంశాఖకి ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. గవర్నర్ ఫోన్ ట్యాప్ అయితే ఇక ఎవరికి రక్షణ ఉంటుంది అని ప్రశ్నించారు. దీని పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేత విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. చదవండి: (తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్) -
‘చలాన్ల బాదుడు.. కేసీఆర్ ఎన్ని కోట్లు వసూలు చేశారో తెలుసా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. తాజాగా ప్రజల రక్తమాంసాలను పీల్చేస్తూ.. ట్రాఫిక్ చలాన్ల రూపంలో కేసీఆర్ సర్కార్ మరో స్కామ్ చేస్తోందని కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మండిపడ్డారు. మధు యాష్కీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ట్రాఫిక్ చలాన్ల కేసులు 50 లక్షలుగా ఉండి ఫైన్ల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ. 95 లక్షలుగా ఉంది. ఇక, కేసీఆర్ సర్కార్ పాలనలో 2021లోనే కేసుల సంఖ్య 2 కోట్లకు పైనే ఉండగా.. చలాన్ వేసిన మొత్తం రూ.877 కోట్లకు చేరింది. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో 9 కోట్ల కేసులు పెట్టి.. రూ. 2,671 కోట్ల రూపాయలను ఫైన్లుగా వసూలు చేశారు. అర్దరాత్రి వరకూ బార్లకు, వైన్ షాపులకు అనుమతులు ఇచ్చి.. ఆయా షాపులు పక్కనే చీకట్లో మాటేసి, డ్రంకన్ డ్రైవ్ పేరుతో చలాన్లు బాదేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల కన్నాహీనంగా మారి చలాన్లు, ఫైన్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తోంది. ట్రాఫిక్ అధికారులను కేవలం ఫొటోలు తీసేందుకు, చలాన్లు రాసేందుకు మాత్రమే అన్నట్లుగా మార్చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలను దోచుకుని కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లను మాత్రం బాగుచేయడం లేదు. చలాన్ల సొమ్మును ఎక్కడ ఖర్చు పెట్టిందే శ్వేత పత్రం విడుదల చేయాలి. ఔరంగజేబు జిజియా పన్ను వేసినట్లుగా కేసీఆర్ వాహనదారులపై చలాన్ల పన్నేస్తూ జేబులు గుల్ల చేస్తున్నాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు చలాన్లపై కేసీఆర్ సర్కార్‌ను నిలదీయాలి’’ అని కోరారు. ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. -
‘కమిటి’మెంట్‌తో.. కలిసికట్టుగా..
నిర్మల్/బాసర: వారంతా వయసులో చిన్నవాళ్లు.. సాధారణ కుటుంబాల నుంచే వచ్చినవాళ్లు.. చదువుకునేచోట ఇబ్బందులతో ఆవేదన చెందారు.. సమస్యలను పరిష్కరించాలంటూ వరుసపెట్టి విజ్ఞప్తులు చేసుకున్నారు.. ఎక్కడా స్పందన లేకపోవడంతో నిరసన బాట పట్టారు. అడ్డగోలు నినాదాల్లేవు.. ఉద్రేక నిరసన ప్రదర్శనలు లేవు. ఓపికగా, ఓ పద్ధతిగా, వీసమెత్తు హింస లేకుండా ఆందోళన చేశారు. రాత్రీపగలు, ఎండావానను లెక్క చేయకుండా బైఠాయించారు. పక్కా ప్రణాళికతో, అందరి మద్దతు కూడగట్టుకునేలా వ్యవహరించి.. కోరుకున్నది సాధించారు. ఇదీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సాధించిన ఘనత. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆరు నెలల ముందు నుంచే.. ఈ నెల 14న బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్) విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ఎంతకూ వెనక్కి తగ్గకుండా కొనసాగించి విజయం సాధించారు. ఈ పోరాటం వెనుక ఆరు నెలల శ్రమ ఉంది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను ఎలాగైనా పరిష్కరించు కోవాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ముందే నేరుగా ఉద్యమానికి దిగకుండా.. అందరికీ తమ సమస్యలను చెప్పాలని నిర్ణయించుకున్నారు. క్యాంపస్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో మొద లుపెట్టి.. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి వీసీ, ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి, విద్యాశాఖ మంత్రి దాకా విజ్ఞప్తులు చేశారు. ఎలాంటి స్పందన రాకపో వడంతో చివరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు. ఎలా చేయచ్చో తెలుసుకుని.. తమ ఆందోళన ఎలా ఉండాలి? ఎలా ఉద్యమం చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది? నిరసన తెలిపే హక్కు (రైట్ టు ప్రొటెస్ట్) కింద ఏం చేయొచ్చు, ఏం చేయవద్దన్న అంశాలపై విద్యార్థులు అధ్య యనం చేశారు. ఆర్జీయూకేటీ చట్టం ఏం చెబుతోం దన్నదీ పరిశీలించారు. ఆందోళన సమయంలో సంయమనంతో ఎలా ముందుకు సాగాలనేది కూడా నోట్స్‌గా రాసుకున్నారు. క్రియాశీలకంగా ఉండేవారితో ‘స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ)’ ఏర్పాటు చేసుకున్నారు. వర్సిటీలోని మొత్తం 7 బ్రాంచ్లకుగాను ఒక్కో బ్రాంచ్‌కు ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని చొప్పున 14 మందిని ఎం పిక చేసుకున్నారు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులను, 20 మంది కోర్‌కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అనుసం ధానంగా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు టెక్నికల్ సపోర్ట్ టీమ్, విద్యార్థులను పోగు చేసే టీమ్, స్పైటీమ్.. ఇలా 12 కమిటీలను ఎన్నుకుని, ఎవరేం చేయాలో నిర్ణయించుకున్నారు. వీటిలో జూనియర్ విద్యార్థులనూ భాగస్వాములను చేశారు. ప్రతీది ప్రణాళికతోనే.. సీనియర్, జూనియర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యమం ఎందుకు చేస్తున్నామనేది వివరించారు. ఆందోళన ఎక్కడ చేయాలి? వరుసలో ఎలా, ఎవరెవరు కూర్చోవాలి? భోజన సమయంలో బ్యాచ్‌ల వారీగా ఎలా వెళ్లిరావాలనేది పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. దీనితోనే ఎర్రటి ఎండ మండినా, భారీ వర్షం ముంచెత్తినా ఒక్కరూ కదలలేదు. 24 గంటల దీక్షలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మాయిలు కూడా ఆరు బయటే నిద్రించారు. జిల్లా కలెక్టర్ వచ్చి నాలుగు గంటల పాటు బతిమాలినా లోపలికి వెళ్లలేదు. అంతా గమనిస్తూ.. విద్యార్థులు తమ ఆందోళన ఎక్కడా అదుపు తప్పకుండా, ఎవరూ తమను ప్రభావితం చేయకుండా పక్కాగా వ్యవహరించారు. వర్సిటీలో ఎక్కడేం జరుగుతోంది? ఎవరెవరు క్యాంపస్‌లోకి వస్తున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాన్ని 40 మందితో కూడిన స్పైకమిటీ గమనిస్తూ ఉండేది. రేవంత్‌రెడ్డి వర్సిటీ గోడదూకి వస్తున్న విషయం కూడా పోలీసుల కంటే విద్యార్థులకే ముందు తెలుసు. తమ మధ్య ఉంటూ ఆరా తీసేందుకు పోలీసులు ఎలా ప్రవరిస్తున్నారో కూడా గమనించగలిగారు. ఇక తమ పోరాటాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసేలా చేయడానికి పబ్లిసిటీ కమిటీ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అప్డేట్ చేస్తూ వచ్చింది. చివరి అస్త్రంగానే ఆందోళన మాది కొత్తగూడెం. నాన్న చనిపోవడంతో అమ్మ కష్టపడి చదివించింది. నాకు నాన్నే స్ఫూర్తి. ట్రిపుల్ఈ మూడో సంవత్సరం చదువుతున్నా. ఎంతగా విజ్ఞప్తి చేసినా వర్సిటీ సమస్యలు తీరకపోవడంతో చివరి అస్త్రంగానే ఆందోళనకు సిద్ధమయ్యాం. అందరం సమష్టిగా సాధించుకున్నాం. – మాదేశ్ సుంకరి, ఎస్జీసీ అధ్యక్షుడు సమష్టి విజయం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వెనకడుగు వేయకుండా విద్యార్థులమంతా సమష్టిగా సాధించిన విజయమిది. హుజూరాబాద్ నుంచి వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నా. ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులందరి భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆందోళన చేశాం. – లావణ్య గున్నేటి, ఎస్జీసీ ఉపాధ్యక్షురాలు శాంతియుతంగా పోరాడి.. మాది వరంగల్. సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. ఎవరికీ ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పోరాడాలనుకున్నాం. అలాగే చేసి సాధించుకున్నాం. – సాయిచరణ్, ఎస్జీసీ ప్రధాన కార్యదర్శి -
డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'దేశ యువత గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఫాసిస్టులకు వ్యతిరేకంగా గాంధీ చూపిన దారిలో యువత పోరాటం చేయాలి. మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారు. దేశ భవిష్యత్‌ను వారి చేతుల్లో పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి. డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు. తెలంగాణలో అమరుల కుటుంబాలు అనాధలైనవి. యువత రోడ్లమీద పడ్డది. గులాబీ చీడ నుంచి విముక్తి కల్పించడానికి కాంగ్రెస్ కార్యక్రమం తీసుకుంది. విద్యార్థి, నిరుద్యోగుల ఆశయాల కోసం జంగ్ సైరన్ మోగిస్తుంది. ర్యాలీ కోసం వస్తున్న కాంగ్రెస్ నేతలను, విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు కాలం చెల్లింది. శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీని రసాభాసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి లేదంటే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత' అంటూ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. 'త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. శాంతి యుతంగా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల కోసం జంగ్ సైరన్ ప్రారంభించాం. శాంతి యుతంగా చేయబోతున్న కాంగ్రెస్ నాయకుల పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. పోలీస్‌లు టీఆర్‌ఎస్‌గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అరెస్టులు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేసి పాదయాత్ర శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి' అని అన్నారు. చదవండి: (గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు) -
మేం కాదు, నువ్వే కొత్త బిచ్చగాడివి.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘మేం కాదు.. నువ్వే కొత్త భిక్షగాడివి. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా కోట్లు కూడబెట్టారు. కాంగ్రెస్ నేతలను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు’అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నేతలు మల్రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, బండి మధుసూదన్, సిద్ధేశ్వర్, జంగారెడ్డి, ధన్‌రాజ్‌గౌడ్‌లు మాట్లాడారు. అధికార పార్టీకి అమ్ముడుపోయిన వారికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. 2023లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు ఇతర నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఈనెల 12న రంగారెడ్డి జిల్లా కందుకూరు పట్టణ కేంద్రంలో 4 వేల మంది కార్యకర్తలతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హ్యాట్రిక్ వీరులు ముగ్గురే..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీలుగా ఎని మిది మంది విజయం సాధించగా అందులో హ్యాట్రిక్ సాధించిన వారు ముగ్గురే ఉన్నారు. ఈ స్థానానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 17వ ఎన్నికల జరుగనుంది. తొలి ఎంపీగా విజయం సాధించిన హరీశ్చంద్ర హెడా మూడుసార్లు ఎంపీగా ఎంపికై రికార్డును సృష్టించారు. 1952, 1957,1962లలో పార్లమెంట్ ఎన్నికలు జరుగగా హరీశ్చంద్ర హెడా వరుసగా ఎంపీగా గెలుపొందారు. ఆయన తరువాత ఎం.రాంగోపాల్‌రెడ్డి 1971, 1977, 1980లలో వరుసగా విజయం సాధించి హరీశ్చంద్ర హెడా రికార్డును చేరుకున్నారు. 1991లో కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈయన 1998, 1999లలో కూడా ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ ఎంపీగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హ్యాట్రిక్ సాధించిన ఎంపీలలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా కేశ్‌పల్లి గంగారెడ్డి టీడీపీ తరపున బరిలో నిలిచి ఎంపీ అయ్యారు. తాడూరి బాలాగౌడ్, మధుయాష్కిగౌడ్‌లు మాత్రం రెండుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మధుయాష్కి గౌడ్ 2014లోనూ పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఆశించినా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ కవిత చేతిలో ఓటమిపాలై హ్యాట్రిక్ రికార్డును చేరుకోలేక పోయారు. నారాయణరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డిలు ఒకేసారి ఎంపీలుగా తమ బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కవిత రెండోసారి పోటీ చేస్తుండగా మధుయాష్కిగౌడ్ నాలుగోసారి, ధర్మపురి అర్వింద్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా స్వతంత్రులుగా రైతులు 178 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో ఎవరికి ఎలాంటి రికార్డు లభిస్తుందో వేచి చూడాలి. -
‘ఇప్పటివరకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల ప్రకటనపై ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మహాకూటమికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. మిత్రపక్షాలు వారికి ఎన్ని సీట్లు కావాలో తమకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కూటమి అభ్యర్థులందరినీ ఉమ్మడిగా ఒక్కేసారి ప్రకటించాలని చూస్తున్నట్టు వెల్లడించారు. దీపావళి రోజున కానీ, ఆ తర్వాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజా కూటమిలో సామాజిక ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నామని.. ఆ ప్రతిపాదికపై మిత్రపక్షాలకు సీట్లు అడగాలని చెప్పామన్నారు. ప్రజాకూటమిని చూసి టీఆర్ఎస్కు భయమేస్తుందని ఆరోపించారు. అధికారంలో ఉండి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పే దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. -
మోదీ గులాం కేసీఆర్!
సాక్షి, జగిత్యాల: ప్రధాని నరేంద్ర మోదీ గులాం కేసీఆర్ అని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. మైనార్టీల గురించి ఏనాడూ పట్టించుకోని ఎంఐఎం పార్టీ సైతం కేసీఆర్‌కు తోడైందని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఐదేళ్లు పాలించమని రాష్ట్ర ప్రజ లు అధికారం అప్పగిస్తే.. పాలన చేతకాక తొమ్మిది నెలల ముందే అస్త్ర సన్యాసం చేసిన అసమర్థుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం ద్వారా తెలంగాణలో గడీల పాలనను అంతం చేయాలని ప్రజలను కోరారు. సకల జనుల ఆకాంక్షను అర్థం చేసుకున్న సోనియా గాంధీ నాడు మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన రాష్ట్రాన్ని నేడు కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. కవితపై ప్రశ్నల వర్షం.. ఒకప్పుడు ఓ అపార్ట్మెంటులో ఉన్న చెల్లెమ్మ (ఎంపీ కవిత) ఇప్పుడు రూ.40 కోట్ల విలువ చేసే విల్లాకు ఎలా మారారో సమాధానం చెప్పాలని మధుయాష్కీ అన్నారు. ‘నువ్వు బతుకమ్మ పేరిట బతుకు నేర్చుకున్నవ్. నీ జీవితాన్ని బంగారుమయం చేసుకున్నవ్. నీ జాగృతి చిట్టా విప్పు’ అని డిమాండ్ చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కబంద హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. -
‘కుమారస్వామికి ఆఫర్ ఇచ్చింది మేమే’
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ మినిమమ్ ప్రొగ్రామ్ ఆధారంగా కర్ణాటకలో తమ ప్రభుత్వం కొనసాగుతుందని కర్ణాటక కాంగ్రెస్ సహాయ ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతెలిపారు. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చింది తామేనని, తమ పార్టీ సీఎం పదవి అడగబోదని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మళ్లీ కాంగ్రెస్ సీఎం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మంత్రివర్గ కూర్పు దామాషా పద్ధతిలో ఉంటుందన్నారు. దూరదృష్టితో తమ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సజావుగా నడించేందుకు సమన్వయ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. ఐదేళ్ళ పాటు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ త్యాగం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కుమారస్వామికి సీఎం సీటు ఎర కాదని మధు యాష్కీ స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిసేందుకు కుమారస్వామికి ఢిల్లీకి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ఆయన చర్చించనున్నారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్‌ను కుమారస్వామి ఆహ్వనించనున్నారు. -
ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్‌గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్ తరలించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం... యెడ్డీ ఆదేశాల తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంట తర్వాత యెడ్యూరప్ప.. పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్, షాంగ్రీ-లా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేయాలని, భద్రత ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. గంటల వ్యవధిలోని పోలీస్‌శాఖ ఆ ఆదేశాలను అమలు చేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని వెంటనే రాష్ట్రం తరలించాలని ఆయా పార్టీలు ప్రణాళిక రచించాయి. కాంగ్రెస్ తరపున డీకే శివకుమార్, జేడీఎస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు. ఆటంకాలు... తొలుత వారిని ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా కొచ్చి(కేరళ)కు గానీ తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ(Directorate General of Civil Aviation) నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) తప్పనిసరై మరోచోటకు తరలించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అంతకు ముందు జేడీఎస్ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందిన విషయం తెలిసిందే. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేల తరలింపు సాగిందిలా... తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. రాత్రి 11.30 ని. సమయంలో డీజీసీఏ.. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఫ్లాన్ మార్చి వారిని రాష్ట్రం దాటించాలని నిర్ణయించారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఈగల్టన్ రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. బస్సులు నిండిపోవటంతో మరో బస్సు(స్లీపర్) వాటికి కలిసింది. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా పరిస్థితులు సర్దుకున్నాక ఆ మూడు బస్సులు వేగంగా ఆంధ్రా సరిహద్దు వైపు కదిలాయి. ముందస్తు జాగ్రత్తగా... అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో(గౌరీబిదనూరు, చికబళ్లాపూర్ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నాలు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్ వరకు ఎమ్మెల్యేలు జమీర్ అహ్మద్ ఖాన్, శివరామ హెబ్బర్‌లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కీ మాటల్లో.. ‘మా పార్టీ ఎమ్మెల్యేల తరలింపు చాలా ప్రణాళిక బద్ధంగా జరిగింది. వారికి హైదరాబాద్‌లో ఉంచటమే సురక్షితమని భావించి ఇక్కడికి రప్పించాం. అధికారం కోసం బీజేపీ దారుణంగా దిగజారింది. అందుకు ప్రధాని మోదీ మద్ధతు పలకటం దారుణం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ కిడ్నాప్ చేసింది. ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తోంది. బీజేపీ నేతలు క్రిమినల్స్‌లాగా వ్యవహరిస్తున్నారు’ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ మండిపడ్డారు. -
రైతులు కష్టాల్లో ఉంటే ఆర్భాటాలా?
మాజీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీ ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంక్షోభంలో ఉంటే.. వారిని ఆదుకోవడాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ప్లీనరీలు, బహిరంగ సభల పేరిట వృథా చేస్తూ ఆర్భాటాలకు పోతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ మండిపడ్డారు. గురువారం వారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక విషయాల్లో మొట్టికాయలు వేసిన విషయం అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విడుదల చేసిన 19 జీవోలను న్యాయస్థానాలు కొట్టేశాయని వారు గుర్తు చేశారు. మూడేళ్లలో ప్రభుత్వం 12 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందన్నారు. అందుకే నిరుద్యోగుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో సీఎం కేసీఆర్ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించకుండానే వెనుదిరిగారని విమర్శించారు. -
ఎంపీ కవితపై మధుయాష్కీ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో రావుల పాలనలో ప్రజలకు ఏమీ రావని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవితపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బంగారు వడ్డాణం ఇస్తానంటేనే కార్యక్రమాలకు వెళ్లే ఎంపీ కవితకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. కలెక్టర్లతో సేవలు చేయించుకుంటూ తాను దొరసానినని చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీకి ఏ టీం, బి టీంలుగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే తెలంగాణలో చిన్న మోదీ కేసీఆర్ అంతం ఖాయమని వ్యాఖ్యానించారు. -
మధుయాష్కీకి మతిస్థిమితం తప్పింది
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ మతిస్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీ కవితలపై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. యాష్కీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలసి గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని కవిత అభివృద్ధి చేస్తున్నారని, ఏడు నియోజకవర్గాల్లో రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కవితదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ టీఆర్ఎస్ను కవిత బలోపేతం చేస్తున్నారని.. పార్టీ బలపడితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్న అక్కసుతోనే యాష్కీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా సోకుల కోసమే కవిత విదేశాలకు వెళుతున్నారని యాష్కీ అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుమన్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై యాష్కీ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలు అర్థరహితమని, ఆ విద్యలు కాంగ్రెస్ నేతలకే తెలుసన్నారు. ప్రధాని మోదీని రాహుల్ కలిస్తే లేని తప్పు.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిస్తే తప్పా అని నిలదీశారు. తాము ఏం చేసినా బాజాప్తా చేస్తామని, ఉస్మానియా వర్సిటీపై కాంగ్రెస్ నేతలకు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మధు యాష్కీ పవర్ పోయి పరేషాన్ లో మాట్లాడుతున్నారని, ఎంపీ నిధులను ఖర్చు చేయకుండా వాపస్ పంపిన ఘనత యాష్కీదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. -
విదేశీ షోకులు తప్ప.. ఓయూలో శోకాలు పట్టవా
• ఎంపీ కవితను ప్రశ్నించిన మధుయాష్కీ • నోరు అదుపులో లేకుంటే తీవ్ర పరిణామాలు: పొన్నం, దానం సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండి పడింది. రాహుల్‌పై స్థాయికి మించి మాట్లా డితే తీవ్ర పరిణామాలుంటాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురువా రం యాష్కీ మాట్లాడుతూ.. విదేశీ పర్యటన ల్లో షోకులు చూసి రావడం తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శోకాలు పట్టవా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఎంపీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు వర్సిటీకి వెళ్లడానికి ఎందుకు భయపడు తున్నారని ప్రశ్నించారు. అధికా రంలోకి వచ్చిన తర్వాత కమీషన్లతో రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మనీలాం డరింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చిందని యాష్కీ అన్నారు. ఈడీ కేసుల నుంచి తప్పించుకోడానికే నవంబర్ 18న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్లు కేసీఆర్ మొక్కారని విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శిం చే స్థాయి కవితకు లేదని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఇందిరాగాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామా లుంటాయని హెచ్చరించారు. రాహుల్‌పై నోరు పారేసుకున్న కవితకు విద్యార్థి లోకమే బుద్ధి చెబుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతుల్లో కవితకు తగిన గుణపాఠం తప్పదన్నారు. శవాల దగ్గర ఏడ్చే జాతి సీఎం కేసీఆర్ కుటుంబానిదేనని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. మహిళలపై ఉన్న గౌరవం పోగొట్టేలా కవిత మాట్లాడుతున్నారని.. అసలైన రుడాలీ జాతి ఎంపీ కవితదే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎంపీ కవిత అనుచితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కవిత దిష్టిబొమ్మను టీపీసీసీ మహిళా విభాగం నేతలు గాంధీభవన్‌లో చెప్పులతో కొట్టారు. -
ఇక్కడి వనరులు ప్రజాభివృద్ధికే ఉపయోగపడాలి
- ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడం అందరి లక్ష్యం - ఏపూరి సోమన్న పాటల సీడీ ఆవిష్కరణలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం - కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు హైదరాబాద్: ప్రజల అభివృద్ధికి ఇక్కడున్న వనరులు ఉపయోగపడాలని, ఆ దిశగా పాలన కొనసాగాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక తెలంగాణ గుండె చప్పుడు ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న రాసి పాడిన ’గడీల పాలనపై ఏపూరి గళం’ అనే పాటల సీడీని కోదండరాం ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది పాటలేనన్నారు. ఉద్యమ ఆకాంక్షలను సాధించు కోవాలనేది అందరి లక్ష్యమన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ తెలంగాణలో బడుగుల బతుకులు బాగుపడుతాయని సోనియా తెలంగాణ ఇచ్చిందని అన్నారు. తెలంగాణలో నాయకత్వం అమ్ముడుపోవచ్చు కాని ప్రజలు అమ్ముడు పోరన్నారు. రూ.100 కోట్లతో ఇల్లు నిర్మించుకున్న వారు ఎవరూ లేరని, చివరికి బాత్ రూమ్‌ను కూడా బుల్లెట్ ప్రూఫ్‌తో కట్టుకున్నాడని సీఎంను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటానని చెప్పిన కేసీఆర్ తెలంగాణ కళాకారులందరిని కాపల కుక్కలుగా చేయాలని భావించినట్లు విమర్శించారు. కేసీఆర్ నన్ను వాడుకోవటమే కాదు.. నాకు కూడా వాడుకోవటం తెలుసునని చెప్పారు. విమలక్క మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దొరల పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి అనేది పేపర్లు, టీవీల్లోనే కనిపిస్తుంది తప్ప ప్రజల్లో కాదని విమర్శించారు. ఏపూరి సోమన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎడిటర్ కె.శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, నాయకులు శ్రవంత్రెడ్డి, మాదిగ దండోర నాయకులు సతీశ్, వరంగల్ రవి తదితరులు పాల్గొన్నారు. -
కొడుకుకు కలిసిరాదని కూల్చేస్తారా..?
సచివాలయం కూల్చివేతపై మధుయాష్కీ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి కొడుకులు ముఖ్యమంత్రి కాలేదని, అల్లుళ్లకి కలసి వస్తుందనే కారణంతో సచివాలయాన్ని కూల్చివేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం సరైంది కాదని మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేసే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ తమ ఆస్తులు కాపాడుకోవడానికే పనిచేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది
మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద ప్రజలకు సర్కారు వైద్యం అందక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటుచేసిన 108, 104 లను సీఎం కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. వేలాది మంది పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మండలానికొక ఆస్పత్రి, నియోజకవర్గానికొక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి చొప్పున నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు పెద్దపీట వేసి, ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఎంపీ కల్వకుంట్ల కవిత వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందన్నారు. బెదిరింపుల ధోరణితో విపక్షాల నోరు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. -
నిజాం షుగర్ కోసం కవితకు ముడుపులు
-
నిజాం షుగర్ కోసం కవితకు ముడుపులు
కాంగ్రెస్ నేత మధు యాష్కీ సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా ఉండేందుకు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఎంపీ కవితకు ముడుపులు అందాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలసి గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని, 100 రోజుల్లో దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీనిచ్చిన టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. గాయత్రీ షుగర్స్ నుంచి కవితకు ముడుపులు అందడం వల్లే నిజాం షుగర్స్‌ను తెరిపించడం సాధ్యంకాదని చెబుతున్నారని మధు యాష్కీ ఆరోపించారు. బతుకమ్మ పేరుతో రూ.15 కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యల్ని గాలికొదిలేసిందని విమర్శించారు. గతంలో తెలంగాణ జాగతి సంస్థ చేసిన అక్రమ వసూళ్లు, అవినీతిని ఆధారాలతో సహా బయటపెడ్తామన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితిగా మారిందన్నారు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
- మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్ తెలంగాణా రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీరు కాదని కాంగ్రెస్ నేతమధుయాష్కీ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఏర్పాటుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మన్ను, మశానం అని చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో గత ప్రభుత్వాలు చేసిన ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ చెప్పటం సిగ్గుచేటని చెప్పారు. ఈనెల 23న ఎందుకు మహారాష్ట్ర వెళుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రతో చేసుకోబోయే ఒప్పందాలను ప్రజకు తెలియజేయాలని అన్నారు. రీ డిజైన్ చేస్తున్న ప్రాజెక్టుల డిపిఅర్ లు బయట పెట్టాలని అడిగారు. హరీష్ రావు తనకు అనుకూలంగా లేని కాంట్రాక్టలను బెదిరిస్తున్నాడని ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. తాము చేస్తున్న అవినీతి పనులకు కేసీఆర్, హరీష్ రావు, కవిత లు జైలుకు వెళ్ళటం ఖాయం మని చెప్పుకోచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహరాష్ట్రతో కుదుర్చుకోనున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరో వైపు 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరగాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 123జీవో ద్వారా నిర్బందంగా భూసేకరణ చేస్తోందని ఆరోపించారు. 123జీవో చెల్లదని కోర్టు చెప్పినా అప్పీల్ కు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. మల్లన్న సాగర్ రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. -
తలసాని నీతులు చెప్పడమా?
మాజీ ఎంపీ మధుయాష్కీ హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తలసాని టీఆర్ఎస్ మంత్రివర్గంలో చేరిన తెలంగాణద్రోహి అని, ప్రాజెక్టులకు అడ్డుపడొద్దంటూ ఆయన కూడా తెలంగాణవాదులకు నీతులు చెబితే అర్థం ఏముందని మాజీ ఎంపీ మధుయాష్కీ మండిపడ్డారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమసమయంలో తెలంగాణవాదులపై దాడి చేసిన తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన అరాచకాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. తలసాని అవినీతిని బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఏ ఒక్క కుటుంబమూ అభివృద్ధి చెందలేదన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ అంతా సీఎం కేసీఆర్ కుటుంబమే మింగేసిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో ఎత్తు పెంచడం, జనాన్ని ముంచడం, డబ్బులు దోచుకోవడమే టీఆర్ఎస్ పాలనలోని అసలు గుట్టు అని అన్నారు. కడియం, లక్ష్మారెడ్డిని తప్పించాలి: మహేశ్ ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులైన మంత్రులు కడియం శ్రీహరి, సి.లక్ష్మారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుం బానికి దగ్గరగా ఉండే వ్యక్తుల ద్వారా ఎంసెట్ లీకేజీలో దాదాపు రూ.200 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. -
దళితులను వంచిస్తున్న కేసీఆర్: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు అంబేడ్కర్‌కు విగ్రహాలు కడుతూ, దండలు వేస్తూ మరోవైపు దళితులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వంచిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి వారిని మోసం చేశాడని విమర్శించారు. దళితులను మరోసారి మోసం చేయడానికే అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. దళిత జాతికి చెందిన రోహిత్ వేముల హంతకులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, మోదీల అసలు స్వరూపాన్ని గుర్తించి, బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
కేసీఆర్ కుల దురహంకారి: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: దళితజాతి మహనీయులను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం, అట్టడుగువర్గాల అభివృద్ధి కోసం పోరాడిన బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే జయంతి వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారని విమర్శించారు. దళిత మహనీయులు, ప్రజల పట్ల కేసీఆర్కున్న చులకన భావానికి, కుల దురహంకారానికి ఇది నిదర్శనమన్నారు. -
కేటీఆర్ ది అవివేకం, అహంకారం
ధ్వజమెత్తిన మధుయాష్కీ, శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: అవివేకం, అహంకారం, అజ్ఞానంతో రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందంటే టీఆర్ఎస్కు, కేటీఆర్‌కు ఉలుకు, వణుకు ఎందుకని వారు ప్రశ్నించారు. అవినీతి బయట పడుతుందని కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేటీఆర్‌కు ఐటీ తప్ప చట్టం తెలిసినట్టులేదని మధు యాష్కీ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్‌పై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు విషయంలో ఎంపీ కవిత డ్రామాలు ఆడుతున్నారని వారన్నారు. -
సీఎం మద్ధతుతోనే విద్యార్థులపై దాడులు: యాష్కీ
సీఎం కేసీఆర్ మద్దతుతోనే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థులపై దాడులు జరిగాయని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. దేశంతోపాటు రాష్ట్రంలో ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణం వెనుక వీసీ అప్పారావు హస్తంపై విచారణ జరుగుతున్న తరుణంలో వీసీని విధుల్లోకి తీసుకోవడం వెనుకా కేసీఆర్ హస్తం ఉందన్నారు. దళిత విద్యార్థి మరణిస్తే కనీసం సీఎం పరామర్శించలేదని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఇరిగేషన్ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం అదే కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టబెడుతున్నారని ఆరోపించారు. టీజేఏసీని నిర్వీర్యం చేయడం వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే వారిపై ప్రతిదాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. కేసీఆర్ ఒక్కరే సీడీఎఫ్ రూ.5 వేల కోట్లు దగ్గర పెట్టుకుని కొడుకు, అల్లుడికే నిధులిస్తూ బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
'సీఎంలు ఇద్దరూ అమావాస్య చంద్రులు'
ధర్మపురి (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అమావాస్య చంద్రులని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కిగౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరస్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ.. పుష్కరాలకు మొక్కుబడి ఏర్పాట్లతో మమా అనిపించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య చంద్రులు పాలిస్తుండటంతో వరుణుడు ముఖం చాటేశాడని విమర్శించారు. రాజమండ్రి సంఘటనకు ఏపీ సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని మధుయాష్కి గౌడ్ కోరారు. -
'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్, నదీజలాల సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్, కోర్టులను ఎందుకు ఆశ్రయించరని ప్రశ్నించారు. బీజేపీతో కలిసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నారని మధుయాష్కీ అన్నారు. -
రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు?
హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో ఎంతమంది తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... తెలంగాణలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అండతోనే సాగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. దళితుడైన రాజయ్యను బర్తరఫ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. మెడికల్ కాలేజీల ఫీజుల విషయంలో రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినా.. సీఎం వాటిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.రేషన్ కార్డులు, పింఛన్లలో తప్పుడు లెక్కలున్నయంటూ ప్రజలనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ...మిషన్ కల్వకుంట్ల గా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా , వారిపై లాఠీలు ఝుళిపించిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
రామోజీ ఫిలింసిటీని దున్నటం ఏమైంది?
సీఎం కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్న కరీంనగర్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలింసిటీని వెయ్యి నాగళ్లు కట్టి దున్నిస్తామన్న కేసీఆర్ హెచ్చరికలు ఏమయ్యాయని కరీంనగర్, నిజామాబాద్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్లో వారు విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న కేసీఆర్ మాటమార్చడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. చిల్లర పార్టీలంటూ ఎదురుదాడికి దిగడం, తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలు కేసీఆర్ అహం కార ధోరణికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని, హద్దుమీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అందరిలో ధీమా !
నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో మొత్తం 16 మంది బరిలో ఉంటే.. ప్రధాన పార్టీల అభ్యర్థులు కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), మధుయాష్కీ గౌడ్ (కాంగ్రెస్), సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్ఆర్ సీపీ)లు ప్రచారం నిర్వహించారు. అయితే పోలింగ్ నాటికి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొనగా.. ఇద్దరూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నా కొద్దిపాటి తేడాతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటపడ వచ్చన్న చర్చ జరుగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సురేశ్‌కుమార్ షెట్కార్ (కాంగ్రెస్), భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్ (టీఆర్ఎస్), కె.మదన్మోహన్రావు (టీడీపీ), మహమూద్ మొహియొద్దీన్ (వైఎస్ఆర్ సీపీ)లు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడగా.. ఇక్కడ నూటికి నూరుశాతం టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ బయట పడే అవకాశం ఉందని అంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, టీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొనగా టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గడ్డం ఆనందరెడ్డి మూడో స్థానంలో నిలుస్తారంటున్నారు. అయితే డి.శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్‌లలో ఎవరో ఒకరు స్వల్ప ఆధిక్యతను చాటుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో అంతిరెడ్డిశ్రీధర్రెడ్డి(వైఎస్సార్సీపీ), బిగాల గణేశ్‌గుప్త (టీఆర్ఎస్), బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ (కాంగ్రెస్), డి.సూర్యనారాయణగుప్త(బీజేపీ), మీర్ మజాజ్ అలీ(ఎంఐఎం)లు ప్రధాన పోటీ దారులు కాగా... బిగాల గణేశ్‌గుప్త, సూర్యనారాయణ గుప్తలలో ఎవరో ఒకరిని విజయం వరించే అవకాశం ఉందంటున్నారు. బాన్సువాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజ్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థులుగా ఆర్.శోభన మహేందర్‌గౌడ్, బద్యానాయక్లుండగా పోలింగ్ రోజు టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. దీంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓటు బ్యాంకుకు కొంత గండి పడిందని అంటున్నా పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంది. ఎల్లారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి(టీఆర్ఎస్), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ), జాజాల సురేందర్ (కాంగ్రెస్), పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి(వైఎస్ఆర్సీపీ)లు ప్రధాన పార్టీల అభ్యర్థులు. అయితే పోలింగ్ నాటికి ఇక్కడ టీఆర్ఎస్కు ఎదురుగాలి వీచిందంటున్నారు. ఈ నేపథ్యంలో కారా? చేయా? అన్నది కొద్ది తేడాతో తేలుతుందంటున్నారు. బాల్కొండ బరిలో 12 మంది అభ్యర్థులుంటే ఇక్కడ పంచముఖ పోటీ ఏర్పడింది. వేముల ప్రశాంత్‌రెడ్డి (టీఆర్ఎస్), ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), ఏలేటి మల్లికార్జున్ రెడ్డి(టీడీపీ), పాలెపు మురళి (వైఎస్ఆర్సీపీ), స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ మధుశేఖర్ల మధ్య పోటీ ఉంది. అయితే ఇక్కడ పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ఉండగా, టీఆర్ఎస్కు ఛాన్స్ ఉంటుందని ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(టీఆర్ఎస్), టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి సిద్ది రాములు, వైఎస్ఆర్ సీపీ నుంచి పైలా కృష్ణారెడ్డిలుండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడ ఎవరికి వారే తమకే విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి రాజారాం యాదవ్‌లు పోటీ పడగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే హోరాహోరిగా మారింది. తన గెలుపు తథ్యమని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), ఎండీ షకీల్ (టీఆర్ఎస్), కాటిపల్లి సుదీప్ రెడ్డి (వైఎస్ఆర్సీపీ), మేడపాటి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ)ల నుంచి బోధన్ నియోజక వర్గంలో పోటీ పడగా... ఈసారి కూడ విజయం తనదేనని పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నాయుడు ప్రకాశ్, ఎస్. గంగారాం (కాంగ్రెస్), సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే (టీఆర్ఎస్), కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అరుణతార, మద్దెల నవీన్ (టీడీపీ)లలో గెలుపు తనదేనని లెక్కలు వేస్తున్నారు. -
‘తెలంగాణ’లో డీఎస్ది కీలకపాత్ర
నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటాల వెనుక డీఎస్ ఉన్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, అయితే రాష్ట్రం ఏర్పాటు కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని యాష్కీ ఆరోపించారు. ఇప్పుడు ఏ విధంగా విజయోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారంటూ సోనియాగాంధీపై గుజరాత్ ము ఖ్యమంత్రి నరేంద్రమోడి విమర్శలు చేయటం తగదన్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటులో ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటిని తట్టుకుని తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని ప్రభుత్వ మాజీ విప్ అనిల్ పేర్కొన్నారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా ప్రజాభీష్టానికే మద్దతుగా నిలిచారన్నారు. తెలంగాణకు అడ్డుపడాలని బీజేపీ చూసిందని, తీరా ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ప్రజలు చిన్నమ్మను మరచిపోవద్దంటూ సుష్మాస్వరాజ్ మాట్లాడారని విమర్శించారు. డీఎస్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసేవారని ఎమ్మెల్సీ రాజేశ్వర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపించి పెద్ద నాయకుడిని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం తెలంగాణ చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలుపుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ నిజామాబాద్ నుంచే ప్రకటన చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకుందామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ ప్రజ లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పీసీసీ కార్యదర్శులు సురేందర్, రత్నాకర్, సత్యం రాయల్వార్, పీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, నిజామాబాద్ ఏ ఎంసీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, మాజీ మేయర్ డి.సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటం ఫలించింది
బీసీ విద్యార్థి సంఘాల మూడేళ్ల పోరాటం, జిల్లా అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల ప్రయత్నం ఫలించింది. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి అనుమతి లభించింది. విశాల భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జీఓఆర్టీ నం. 21 విడుదలైంది. ఇక బీసీ విద్యార్థుల చదువు కష్టాలు తీరనున్నాయి. ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎంపీ మధుగౌడ్ యాష్కీ కూడా ఇప్పటికే తన ఫండ్ నుంచి రూ.30 లక్షల నిధులను కేటా యిం చారు. తెలిసిందే. ప్రభుత్వం మంజురు చేసినవి, ఎంపీ ఇచ్చినవి మొత్తం రూ.2.55 కోట్లు భవన నిర్మాణానికి సమకూరాయి. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. బీసీ విద్యార్థి సంఘాల పోరాటం జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలని మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ వస్తోంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టింది. ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించింది. రాష్ర్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు, జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇతర ప్ర జా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు కూడా విన్నవించింది. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. తెచ్చారు. బీసీ సంఘాల నాయకులు కూడా అధికారులను, మంత్రులను కలిసి విజ్ఞాపనలు సమర్పించారు. ప్రజా ప్రతినిధుల చొరవ... అధికారుల కృషి ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముందుగా ఎంపీ మదుగౌడ్ స్పందించి నిధులు ఇవ్వడమే కాకుండా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వ రాజ్ సారయ్యతో మాట్లాడారు. ఆయ న ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయించా రు. మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. జిల్లాలో గతంలో పని చేసిన ముగ్గురు కలెక్టర్లతోపాటు ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న కూడా దీనిపై దృష్టిసారించారు. స్థలం కూడా రెడీ బీసీ స్డడీ సర్కిల్ భవన నిర్మాణానికి అధికారులు స్థలం రెడీగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ పేజ్-1లో ఉన్న 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. గతంలో నాగారాం తదితర ప్రాంతాలలో స్థలాలు చూశారు. జిల్లా కేంద్రానికి దూరం కావడంతో ఎంపిక చేయలేదు. విశాలవంతంగా, అన్ని హంగులు, సౌకర్యాల తో నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయితే బీసీ విద్యార్థులకు అనువుగా ఉంటుంది. గ్రూప్స్, సివిల్స్, ఇతర పరీక్షలకు ఇందులోనే ఉచితంగా ప్రిపేర్ కావచ్చు. టెండర్లు పూర్తి కాగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణాని కి ప్రభుత్వం నిధులు మంజురు చేసింది. భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాం. కలెక్టర్ అనుమతి తీసుకుని టెండర్లు వే యగానే పనులు ప్రారంభం అవుతాయి. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి విద్యార్థుల పోరాట ఫలితమే మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థులు చేపట్టిన పోరాట ఫలితంగానే బీసీ స్టడీ సర్కిల్ సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.నిధుల మం జూరుకు కృషి చేసిన ఎంపీ మధుగౌడ్, మంత్రులు బస్వరాజ్ సారయ్య, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్లకు ప్రత్యేకంగా అబినందనలు. -శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాణ్యమైన విద్య అందుతుంది బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి ప్రభుత్వం అధిక మొ త్తంలో నిధులు కేటాయించడం, ఇటు ఎంపీ కూడా స హాయం చేయడం ఆనందంగా ఉంది. బడుగు బల హీన వర్గాలకు ఇక నుంచి నాణ్యమైన విద్య అందుతుంది. ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ పొందవచ్చు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలి. -నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
ముఖ్యమంత్రి తప్పులను లెక్కిస్తున్నాం : మధుయాష్కీ
హైదరాబాద్: శిశుపాలుడిలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న తప్పులను లెక్కిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. విభజనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అడ్డుకుంటారంటూ సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల మేరకు జరుగుతోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగదన్నారు. ఇతర పార్టీలేవీ సహకరించకపోయినా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్న గట్టి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వచ్చే జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని మధుయాష్కీ అన్నారు.