కాంగ్రెస్ నేత మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా ఉండేందుకు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఎంపీ కవితకు ముడుపులు అందాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలసి గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని, 100 రోజుల్లో దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీనిచ్చిన టీఆర్‌ఎస్ మోసం చేసిందన్నారు.
గాయత్రీ షుగర్స్ నుంచి కవితకు ముడుపులు అందడం వల్లే నిజాం షుగర్స్‌ను తెరిపించడం సాధ్యంకాదని చెబుతున్నారని మధు యాష్కీ ఆరోపించారు. బతుకమ్మ పేరుతో రూ.15 కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యల్ని గాలికొదిలేసిందని విమర్శించారు. గతంలో తెలంగాణ జాగతి సంస్థ చేసిన అక్రమ వసూళ్లు, అవినీతిని ఆధారాలతో సహా బయటపెడ్తామన్నారు. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితిగా మారిందన్నారు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజాం షుగర్ కోసం కవితకు ముడుపులు
Published Wed, Oct 5 2016 3:44 AM | Last Updated on Mon, Oct 8 2018 3:39 PM
Advertisement
Advertisement