
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల ప్రకటనపై ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మహాకూటమికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. మిత్రపక్షాలు వారికి ఎన్ని సీట్లు కావాలో తమకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కూటమి అభ్యర్థులందరినీ ఉమ్మడిగా ఒక్కేసారి ప్రకటించాలని చూస్తున్నట్టు వెల్లడించారు. దీపావళి రోజున కానీ, ఆ తర్వాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు.
ప్రజా కూటమిలో సామాజిక ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నామని.. ఆ ప్రతిపాదికపై మిత్రపక్షాలకు సీట్లు అడగాలని చెప్పామన్నారు. ప్రజాకూటమిని చూసి టీఆర్‌ఎస్‌కు భయమేస్తుందని ఆరోపించారు. అధికారంలో ఉండి టీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పే దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.