తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
- మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్
తెలంగాణా రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీరు కాదని కాంగ్రెస్ నేతమధుయాష్కీ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఏర్పాటుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మన్ను, మశానం అని చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో గత ప్రభుత్వాలు చేసిన ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ చెప్పటం సిగ్గుచేటని చెప్పారు. ఈనెల 23న ఎందుకు మహారాష్ట్ర వెళుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రతో చేసుకోబోయే ఒప్పందాలను ప్రజకు తెలియజేయాలని అన్నారు.
రీ డిజైన్ చేస్తున్న ప్రాజెక్టుల డిపిఅర్ లు బయట పెట్టాలని అడిగారు. హరీష్ రావు తనకు అనుకూలంగా లేని కాంట్రాక్టలను బెదిరిస్తున్నాడని ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. తాము చేస్తున్న అవినీతి పనులకు కేసీఆర్, హరీష్ రావు, కవిత లు జైలుకు వెళ్ళటం ఖాయం మని చెప్పుకోచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహరాష్ట్రతో కుదుర్చుకోనున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరో వైపు 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరగాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 123జీవో ద్వారా నిర్బందంగా భూసేకరణ చేస్తోందని ఆరోపించారు. 123జీవో చెల్లదని కోర్టు చెప్పినా అప్పీల్ కు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. మల్లన్న సాగర్ రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు.