రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు? | madhu yaskhi goud blames kcr | Sakshi
Sakshi News home page

రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు?

Published Mon, Jan 26 2015 2:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు? - Sakshi

రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు?

హైదరాబాద్:  రామోజీ ఫిలింసిటీలో ఎంతమంది తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... తెలంగాణలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అండతోనే సాగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. దళితుడైన రాజయ్యను బర్తరఫ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.

మెడికల్ కాలేజీల ఫీజుల విషయంలో రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినా.. సీఎం వాటిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.రేషన్ కార్డులు, పింఛన్లలో తప్పుడు లెక్కలున్నయంటూ ప్రజలనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ...మిషన్ కల్వకుంట్ల గా మారిందని ఎద్దేవా చేశారు.  తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా , వారిపై లాఠీలు ఝుళిపించిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement