పాలమూరు విద్యార్థులు ముందుండాలి | MLA Srinivas Goud Comments On Minority Youth Mahabubnagar | Sakshi
Sakshi News home page

పాలమూరు విద్యార్థులు ముందుండాలి

Published Thu, Aug 2 2018 12:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

MLA  Srinivas Goud Comments On Minority Youth Mahabubnagar - Sakshi

బీసీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థులకు పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే, అధికారులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు నిలుస్తూ ఉద్యోగా ల సాధనలో కూడా ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షన తీసుకుంటున్న అభ్యర్థులకు బుధవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్‌ మా ట్లాడుతూ వెనుకబడిన పేద విద్యార్థులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీకి పెద్దసంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నందున ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌తో పాటు కొరమోని వెంకటయ్య, సుదీప్‌రెడ్డి,  మహేష్‌కుమార్, శివశంకర్, రవీందర్, రమాదేవి పాల్గొన్నారు.


మైనార్టీ యువత ఉద్యోగాల్లో రాణించాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యాన న్యూటౌన్‌లోని ప్రగతి కోచింగ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరపున మొదటిసారి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాదాపు 190 మంది విద్యార్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. సూపరింటెండెంట్‌ బక్క శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంతియాజ్‌ ఇసాక్, మక్సూద్‌ హుస్సేన్, తఖీ హుస్సేన్, అబ్రార్, వెంకటయ్య, శివశంకర్‌ పాల్గొన్నారు.

నూతన పంచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నూతన గ్రామపంచాచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ను కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. నూతన గ్రామపంచాయితీల ద్వారా ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకాధికారుల హయాంలోఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో కూడళ్ల అభివృద్ధి పనులు, మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మైనార్టీ అభ్యర్థుల శిక్షణలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement