MLA Srinivas Goud
-
పాలమూరు విద్యార్థులు ముందుండాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు నిలుస్తూ ఉద్యోగా ల సాధనలో కూడా ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షన తీసుకుంటున్న అభ్యర్థులకు బుధవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ వెనుకబడిన పేద విద్యార్థులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీకి పెద్దసంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నందున ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో పాటు కొరమోని వెంకటయ్య, సుదీప్‌రెడ్డి, మహేష్‌కుమార్, శివశంకర్, రవీందర్, రమాదేవి పాల్గొన్నారు. మైనార్టీ యువత ఉద్యోగాల్లో రాణించాలి స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యాన న్యూటౌన్‌లోని ప్రగతి కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరపున మొదటిసారి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాదాపు 190 మంది విద్యార్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. సూపరింటెండెంట్ బక్క శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఇసాక్, మక్సూద్ హుస్సేన్, తఖీ హుస్సేన్, అబ్రార్, వెంకటయ్య, శివశంకర్ పాల్గొన్నారు. నూతన పంచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నూతన గ్రామపంచాచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. నూతన గ్రామపంచాయితీల ద్వారా ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకాధికారుల హయాంలోఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో కూడళ్ల అభివృద్ధి పనులు, మినీ ట్యాంక్‌బండ్ వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు. -
హరితపథం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమ నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా నాలుగో విడత హరితహారం గురువారం ప్రారం భం కానుంది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండగా.. శాఖల వారీగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. జూలై నెల మొదట్లో వర్షాలు కురవగా.. అప్పుడే హరిత హారంలో భాగంగా మొక్కలు నాటాలని అధికారులు భావించినా కుదరలేదు. దీంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గుంతలు.. మొక్కలు జిల్లావ్యాప్తంగా మొత్తం 185 నర్సరీలు ఉన్నాయి. ఇందులో అటవీ శాఖ ఆధ్వర్యాన 115, డీఆర్డీఓ ఆధ్వర్యాన 70 నర్సరీల్లో హరితహారానికి అవసరమైన మొక్కలు సిద్ధం చేశారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవగా హరితహారం ప్రారంభించాలనుకున్నా మళ్లీ వెనుకడుగు వేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల మొక్కలు నాటా రు. ఇక నుంచి గురువారం నుంచి పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గుంతలు తీయడం పూర్తికాగా, నాటాల్సిన మొక్కలపై శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. 1.97 కోట్ల మొక్కలు... నాలుగో విడత హరితహారంలోభాగంగా జిల్లాలో 1.97 కోట్లు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో 1.03 కోట్ల టేకు మొక్కలు, 15 లక్షలు ఈత మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. ఇక అత్యధికంగా ఐకేపీ–డ్వామా(డీఆర్డీఓ) ఆధ్వర్యాన 1,56,28,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే, ఎక్సైజ్‌కు 10 లక్షలు, అటవీ శాఖకు 10 లక్షలు, పశు సంవర్థక శాఖకు 3 లక్షలు, పోలీస్ శాఖకు 10 వేలు, పీయూకు 30 వేలు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు 20 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా అత్యల్పంగా బీసీ సంక్షేమ శాఖ, సివిల్ సప్లయీస్, రవాణా శాఖలకు కేవలం వెయి చొప్పున లక్ష్యం నిర్ణయించారు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2 లక్షలు, నారాయణపేట పరిధిలో 50 వేల మొక్కలు నాటనున్నారు. మొక్కల ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొక్కల పెంపకం ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత ఉపాద్యాయులపై ఉందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యాన స్థానిక పిల్లలమర్రి సమావేశ హాల్లో హరిత పాఠశాల, స్వచ్ఛ పాఠశాల అంశాలపై విద్యా శాఖ అధికారులకు బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ భావి తరాలైన విద్యార్థులకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత, వాటితో లాభాలను వివరించాలన్నారు. పాఠశాలతో పాటు ఇళ్లలో మొక్కలను పెంచేలా విద్యార్థులకు ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మొక్కలను ఎలా నాటాలి, ఎంత లోతు గుంత తీయాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం డీఎఫ్ఓ గంగారెడ్డి మాట్లాడుతు ప్రతీ మండలం నుంచి ఎంఈఓ, ఓ హెచ్ఎంతో పాటు అటవీ శాఖ ఉద్యోగికి అవగాహన కల్పించగా.. వారు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు వివరించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈత మొక్కలను కాపాడుకోవాలి పాలమూరు: ఈత మొక్కలను కాపాడుకోవ డం వల్ల గీత కార్మికులకు భవిష్యత్‌లో ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రజలందరూ సహకరిస్తే హరితహారం విజయవంతమవుతుందన్నారు. హరితహారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యాన బుధవారం హన్వాడ మండలం చిన్నదర్పల్లి శివారులోని సహదేవుడుగౌడ్ పొలంలో ఎమ్మె ల్యే, ఆబ్కారీ శాఖ ఉమ్మడి జిల్లా డీసీ జయసేనారెడ్డితో పాటు అధికారులు, గీత కార్మికులు కలిపి 3వేల ఈత మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హరితహారంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సీజన్ లో జిల్లావ్యాప్తంగా 11 లక్షల ఈత మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సై జ్ ఈఎస్ అనిత, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మానవ జీవనానికి మనుగడ స్టేషన్ మహబూబ్‌నగర్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, అప్పుడే మానవ జీవనానికి మనుగడ ఉంటుందని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ అన్నారు. స్థానిక డిపో ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ మహేశ్, స్థానిక డిపో మేనేజర్ రాజగోపాలాచారితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆర్ఎం బి.వరప్రసాద్ -
'గుర్తుకొస్తున్నాయి'... : ఎమ్మెల్యే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : చిన్నప్పుడు ఆడిన గోలీల ఆటను ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ రైతు బజార్ పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అక్క డే గోలీలు ఆడుకుంటున్న చిన్నారులను చూసిన ఆయన పరిశీలిస్తుండగా.. వారు మీరు కూడా ఆడతారా అంటూ అడిగారు. దీంతో ఎమ్మెల్యే వారి వద్ద నుంచి గోలీ తీసుకుని కాసేపు సరదాగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇలాంటి ఆటలకు ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తరం ఇండోర్ గేమ్స్, కంప్యూటర్లకే పరిమిత మవుతున్నారని తెలిపారు. అయితే, వేసవి సెలవుల సందర్భంగా పిల్లల విషయమై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. -
కళాకారుల ఆనందమే ఆయన ఆహారం
‘‘లలిత కళలంటే లలితాగాయత్రి యొక్క అంశ కలిగిన కళలు. ఈ కళలు అబ్బటం ఆ దేవత ఆశీర్వచనం. అటువంటి కళాకారులు ఎక్కడ పుట్టినా గౌరవించేవాళ్లు కొందరు ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన చిరస్థాయిగా ఉన్నారంటే కళలకు, కళాకారులకు ఆయన చేసిన సేవే. ఆయన పేరు వినగానే మనకు ‘భువనవిజయం’ గుర్తొస్తుంది. కళలకు ఉన్న గొప్పతనం అలాంటిది. సుబ్బరామి రెడ్డి మనసెప్పుడూ కళల మీద, కళాకారుల మీదే ఉంటుంది. వాళ్లను గౌరవించటం. వాళ్ల ఆనందమే ఈయన ఆహారం. నా పూర్వ జన్మ సుకృతం వల్ల రేపు కాకతీయ కళలను గుర్తు చేసుకుంటూ తీసుకోబోయే ఈ అవార్డు నాకు ప్రత్యేకమైంది. ఆలీ నాకంటే నటనలో సీనియర్. పరిశ్రమలో నటించటం పక్కన పెడితే, అసలు ఉండటమే కష్టం. అందుకే ఆలీ ‘ఏ’ నేను ‘బీ’’ అన్నారు బ్రహ్మానందం. ‘కాకతీయ లలిత కళా పరిషత్’ ఏర్పాటు చేసి, కళాకారులను సన్మానిస్తున్నారు సుబ్బరామి రెడ్డి. మార్చి 11న మహబూబ్‌నగర్‌లో జరగనున్న ఈ ఉత్సవాల్లో బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘కళలోనే దైవత్వం ఉంది. అందుకే కళాకారులను గౌరవించినా, అభినందించినా, సత్కరించినా.. మనకు ఆ శక్తి వస్తుంది. 700 సంవత్సరాల క్రి తం పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల వైభవం, కళల సంపద అపూర్వం. ఆ తర్వాత మనకు గుర్తు వచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు. కాకతీయ కళా పరిషత్‌ను 2 నెలల క్రితం ప్రారంభించినప్పుడు మోహన్‌బాబును సత్కరించాం. ఇప్పుడు రూరల్ ఏరియాస్‌లో కూడా ఈ కళా వైభవోత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. తెలంగాణాలో మొట్టమెదటిగా æమహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. కళాకారులను, స్థానిక కళాకారులను, సినీ కళాకారులని ఇందులో సన్మానించదలిచాము. ఈ కార్యక్రమంలో 1100 చిత్రాల్లో నటించి, హాస్యాన్ని పంచిన బ్రహ్మానందంకు ‘హాస్య నట బ్రహ్మా’ అనే బిరుదు ప్రదానం చేయనున్నాం. దాదాపు 40 ఇయర్స్ కెరీర్ ఉన్న ఆలీకు కూడా అవార్డ్ ఇవ్వబోతున్నాం. పలువురు సినీరంగ ప్రముఖులను, స్థానిక కళాకారులను ‘‘కాకతీయ అవార్డు’తో సత్కరిస్తాం’’ అన్నారు. ‘‘బ్రహ్మానందం గారు తెలియని తెలుగువారుండరు. సుబ్బరామిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడి కంటే గొప్ప భక్తుడు,కళా పోషకుడు, కళా బంధువు’’ అన్నారు శాసన సభ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్. ‘‘నటరాజుకి కళాకారులంటే ఇష్టం. ఆ నటరాజే సుబ్బరామిరెడ్డి గారు. కేవలం 33 సంవత్సరాల్లో 1100 సినిమాలు పూర్తి చేసిన బ్రహ్మానందంగారిని సన్మానించటం ఆనందం’’ అన్నారు ఆలీ. -
టీఆర్ఎస్లో మాటల లొల్లి !
-
ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో ...అందులోని బలమైన నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకువడం ద్వారా సుస్థిరమైన ప్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా రెండురోజుల క్రితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారని తనదైన శైలిలో విరుచుకుపడిన విషయం విదితమే. అయితే తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామని అన్నారు. -
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దిష్టిబొమ్మ దహనం..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవనించేలా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఆయన దిష్టిబొమ్మను ప్రధాన ద్వారం వద్ద దహనం చేశారు. ఏబీవీపీ, జేఎన్టీయూఎచ్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీని నిర్వహించారు . ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి జవ్వాజి దిలీప్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వద్ద మెప్పు పొందడం కోసం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ రాక ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది కలగలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాక ఇంజనీరింగ్ విద్యార్థులు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారని, అనవసరంగా కొందరు విద్యార్థులు రాద్ధాంతం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస
-
‘పాలమూరు’కు కాంగ్రెస్ నేతలే అడ్డు
జైపాల్‌రెడ్డి, డీకే అరుణలపై శ్రీనివాస్‌గౌడ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిప డ్డారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ ఈ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ, అధికారం కోల్పోగానే వారికి పాలమూరు జిల్లా ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. రాయలసీమకు అక్రమంగా నీళ్లు తరలిం చుకుపోతుంటే జైపాల్‌రెడ్డి, డీకే అరుణ అధికారంలో ఉండగా ఏంచేశారన్నారు. -
మయూరీని పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దుతా
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మయూరీపార్క్‌ను పెద్ద పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దుతానని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మయూరీ పార్క్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా పర్యాటకులను కలిసి పార్క్ గురించి ముచ్చటించారు. ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని.. అడిగి తెలుసుకున్నారు. కోట్ల రుపాయలతో పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, అడ్వైంచర్ ఈవెంట్లను మరింత పెంచడానికి కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ తరహాలో పార్న్ను తయారుచేస్తానని, పార్క్‌ను సందర్శించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మెచ్చుకున్నారని, ఇక్కడి తరçహాలో సిద్దిపేట జిల్లాలో తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాసేపు చిన్నారులతో సెల్ఫీలకు ఫోజులుఇచ్చారు. అనంతరం మహిళలు ఎమ్మెల్యే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, శివకుమార్, శివశంకర్ పాల్గొన్నారు. -
ఉన్నతాధికారిగా తెలంగాణ వాళ్లే ఉండాలి
► ఆంధ్రా ఉద్యోగులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలి ► తెలంగాణ గెజిటెడ్ అధికారుల సమావేశంలో తీర్మానించిన నేతలు ► త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారి బాధ్యతలు తెలంగాణ అధికారులకే కట్టబెట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తీర్మానిం చింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి వివరించనున్నట్లు పేర్కొంది. శనివారం టీజీవో భవన్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కార్యవర్గ సమావేశం జరిగింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో పదోన్నతుల్లోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయడం మంచిదేనని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కేడర్లుగా ఏర్పాటు చేయడం ఉద్యోగులకు ప్రయోజ నకరమని చెప్పారు. అయితే నియామకాల విషయంలో స్థానికులకు 90 శాతం అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాలో అక్షరాస్యత తక్కువని, దాంతో అక్కడి అభ్యర్థులు అక్షరాస్యతలో ముందువరుసలో ఉన్న జిల్లా అభ్యర్థులతో పోటీ పడలేరని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నియామకాలన్నీ జిల్లా స్థాయి లోనే 90 శాతం స్థానికులతో చేపట్టాలన్నారు. పోస్టిం గ్ విషయంలో మాత్రం రాష్ట్ర క్యాడర్‌ను పరిగణించి ఇవ్వొచ్చన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యో గులపై పనిభారం పెరిగిందన్నారు. అదేవిధంగా పదవీ విరమణతో ఖాళీలు పెరిగాయని, ఈ క్రమంలో అర్హులైన ఉద్యోగులం దరికీ పదోన్నతులు ఇచ్చి.. ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచొద్దని కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశామని, వీటిని త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. -
డ్రగ్స్ రాకెట్లో ఉన్న నేతలెవరో చెప్పండి
ఉత్తమ్, దిగ్విజయ్‌కి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సవాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిని చూసి కొంతమంది ఢిల్లీ పెద్ద మనుషులు ఓర్చుకోలేక పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. దమ్ముంటే డ్రగ్స్ రాకెట్లో టీఆర్ఎస్ నాయకులు ఎవరున్నారో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ బయటపెట్టాలని, 24 గంటల్లో విచారణ జరిపి వారిని అరెస్టు చేయిస్తామని సవాలు విసిరారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యా లయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పేకాట క్లబ్బులు మూయించింది, మియాపూర్ భూకుంభకోణాన్ని బయట పెట్టింది తమ ప్రభుత్వమేనని తెలిపారు. పేకాటక్లబ్బులను, గుడంబా తయారీని ప్రోత్సహిం చింది, నడిపించింది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఎవరెన్నీ ట్వీట్లు పెట్టినా తమను ఎవరూ ఏం చేయలేరన్నారు. -
ప్రజల జీవితాలతో ఆటలా?
హైదరాబాద్: ప్రైవేటు బస్సుల మాఫియా ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చట్టానికి విరుద్ధంగా ఈ బస్సులు తిరుగుతున్నాయని, ఇష్టానుసారంగా పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బస్సుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రవేటు బస్సులు ఎలా లాభాల్లో ఉంటాయి.. ఆర్టీసీ బస్సులు ఎలా నష్టాలు.. వస్తాయని ప్రశ్నించారు. అక్రమ పద్ధతిలో బస్సులు నడిపితే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలంగాణ నుంచి కూడా ఏపీకి అన్నే బస్సులు నడపాలని, లేకుంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ విషయం గురించి తాము స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే..
► ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ జెడ్పీసెంటర్: లారీ యాజమాన్యాల డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగిల్ పర్మిట్ విధానం లేకపోవడం వల్ల లారీ యజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లారీలు నడిచే ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. సింగిల్ పర్మింట్ విదానాన్ని అమలుచేయాలని కోరారు. ప్రైవేట్ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్‌పార్టీ బీమాను ఏప్రిల్ నుంచి 50 శాతం పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలని కోరారు. 15ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలని కోరారు. తెలుగు రాష్ట్రల్లో అమలయ్యేలా సింగిల్ పర్మిట్‌కు అవకాశం కల్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం సమ్మె పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఆర్టీఏ మెంబర్ జావిద్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు సాక్షి, మహబూబ్‌నగర్: ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య విభేదాలు మరోసారి పొడచూపాయి. తమ మధ్య విభేదాలు లేవంటూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జితేందర్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. మొదట జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియా కావాలని లేనిపోని కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారని.. సదరు విషయాన్ని ఓ మంత్రి చెప్పారని వ్యాఖ్యానించారు. మంత్రి పదవిని తాను అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానని జితేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. అయినా, మంత్రి పదవి అనేది తలరాత ఉంటేనే దక్కుతుందని.. ఎవరో అడ్డుపడితే ఆగేది కాదన్నారు. అయినా, సీఎం కేసీఆర్ ఒకరు చెప్తే వింటారా? అందులోనూ మంత్రి పదవుల విషయంలో వింటారా? అని ఎదురు ప్రశ్నించారు. 14 ఏళ్లు ఆయనను దగ్గరుండి చూశానంటున్న శ్రీనివాస్‌గౌడ్.. ఇతరులు చెప్తే ఎట్లా నమ్ముతారని చెప్పారు. ఈ విషయంలో చాలెం జ్ చేస్తున్నా.. ‘ఏ మంత్రి చెప్పాడో అతన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్దాం. నేను అడ్డుపడ్డట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అని సవాల్ చేశారు. ఇరువురి మధ్య వేడి రగులుతుండటంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. -
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
-
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
మహబూబ్‌నగర్: వేసవి సీజన్లో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పట్టణ ప్రజలకు భరోసా కల్పించారు. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ రాధాఅమర్‌తో కలిసి పట్టణంలోని వెంకటేశ్వర్ కాలనీలో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పట్టణంలో తాగునీటి సరఫరా విధానంపై ఆయన ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. పట్టణంలో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేసిన దాఖాలాలు లేవని, తాము అ ధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించగలిగామని అన్నా రు. పట్టణంలో డేబైడే నీటిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాగునీటి పంపిణీపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో మిషన్‌భగీరథ పథకం పనులను పూర్తి చేసి పట్టణంలో నిత్యం తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పైపులైన్‌కు నిధులు పట్టణంలో రూ.167కోట్లతో పైపులైను పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో రూ. 40కోట్లతో రోడ్లు, డ్రైనేజీల పనులను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లో పట్టణంలో ఎల్ఈడీ స్ట్రీట్లైట్లను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరమయంగా చేస్తామన్నారు. ఇకపై పట్టణంలోని వార్డులలో ఆకస్మికంగా తనిఖీలు నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రణాళికబద్దంగా పనిచేయాలని ఆయన సూ చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ రాధాఅమర్, కౌన్సిలర్ గంజి అంజనేయులు, మున్సిపల్ డీఈలు బెంజ్‌మెన్, మధు, సానిటరీ ఇన్సిపెక్టర్లు శ్రీమన్నారాయణ, వజ్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అందులో భాగంగానే వీఓఏల వేతనాలను పెంచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్హాల్లో ప్రభుత్వం వీఓఏల వేతనాలను పెంచడంపై వీఓఏలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గా ల అబివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుం దన్నారు. గతంలో వీఓఏలను పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. చాలీ చాలని వేతనాలతో ఇబ్పందులు పడుతు న్న వారికి రూ. 5వేల వేతనం పెంచినట్లు తెలిపారు. ఇందులో రూ.3వేలు నేరుగా ప్రభుత్వ ఖాతా నుంచి రాగా, మిగతా రూ.2 వేలు ఆ స్థానిక మహిళ సంఘాల నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మందికి వేతనాలను పెంచినట్లు తెలిపారు. వీఓఏలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణం గా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న ప్రతి సంక్షేమ పథకంపై గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. మహిళలకు పొదు పు మంత్రం నేర్పడంతోపాటు వారి అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యల గురిం చి కూడా అవగాహన కల్పించాలని కోరా రు. మహిళల్లో అక్షర జ్ఞానాన్ని పెంచేం దుకు కృషిచేయాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వచ్చే 5నెలల్లో సంపూర్ణ పారిశుధ్యం సాధించాలని ఇందు కోసం 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రొత్సహకాలు ఇస్తోందన్నారు. స్త్రీనిధి నుంచి అడ్వాన్సులను ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో మహిళలు చైతన్యం కావాలని ఆ దిశగా వీఓఏలు కృషిచేయాలని అన్నారు. గ్రామాలు స్వయం సంవృద్ధి చెందాలన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేసి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత వీఓఏలపై ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తుందని, కొంత ఆలస్యం అవుతుందేమోకాని పరిష్కారం మాత్రం పక్కా అని చెప్పారు. ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అందుకోసం ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. అడిగిన ప్రతిఒక్కరికి పని కల్పించేందుకు సీఎం కేసీఆర్పని చేస్తున్నారని ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ కోట్లకిషోర్ అన్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, డీపీఓ నాగమల్లిక, వీఓఏ సంఘం నాయకులు సత్యనారాయణగౌడ్, నర్సిములు, గోపాల్, శ్రీనివాస్, రాఘవేందర్‌గౌడ్, రాంచంద్రయ్య, కృష్ణ, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజల ప్రాణాలను ప్రైవేటు ట్రావెల్స్ బలితీసుకుంటున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్‌కు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. లారీలకు సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని కోరినా ఏపీ ప్రభుత్వంలో స్పందనలేదన్నారు. 15 రోజుల్లో దీనిపై చర్యలు తీసుకోకపోతే బస్సులు, లారీలను కోదాడ వద్ద ఆపేస్తామని హెచ్చరించారు. అక్రమ పర్మిషన్లతో బస్సులను నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన పది మంది ప్రాణాలకు విలువ ఎవరు కడతారని ప్రశ్నించారు. ‘ప్రైవేటు ట్రావెల్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. ఏపీలో ఏమైనా చేసుకోండి కానీ తెలంగాణలో మాత్రం ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు ఆస్కారం లేదు. రాజకీయ ప్రమేయం లేకుండా దోషులను కఠినంగా శిక్షించాలి. రాజకీయ నేతలే వీటికి యజమానులు కావడం వల్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై పార్టీలు కూడా సమీక్షించుకోవాలి’ అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీలకే వందలాది బస్సులున్నాయని, ఏం చేసినా చెల్లుతుందనే ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ అక్రమాలను ఇరు ప్రభుత్వాలు అరికట్టాలని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రజలు ప్రయాణించాలని సూచించారు. -
ప్రతిపక్షాలవి అనవసర విమర్శలు
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో నిధులు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం పట్ల మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా విపక్షాలు విమర్శించడం శోచనీయమని, చిల్లరమల్లర రాజకీయాలు మానుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో చేపల పెంపకం కోస్తా ప్రాంతానికే పరిమితమైందని, గత పాలకులు తెలంగాణ మత్స్యకారుల పొట్టగొట్టారని విమర్శించారు. చేపల పెంపకానికి తెలంగాణలో అన్ని రకాల వనరులున్నప్పటికీ అన్ని రంగాల వల్లే మత్స్య పరిశ్రమ రంగం సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు చేపలపై చర్చ జరగలేదని, కుల వృత్తులపై చర్చ జరగడం ఇదే తొలిసారని, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చేపల పెంపకానికి నూరు శాతం సబ్సిడీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
-
ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీయే కార్యాలయానికి వచ్చిన ఆయనను గేటువద్దే అడ్డుకుని అరెస్టుచేసి, స్టేషన్‌కు తరలించారు. అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీయే కార్యాలయానికి వస్తే.. తనను అరెస్టు చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆర్టీయే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్టు చేశారు. పలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ ఆరోపించారు. స్టేజి క్యారియర్ల పేరుతో ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై తేల్చుకోడానికి ఆయన మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి ఆర్టీయే కార్యాలయానికి వచ్చారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి రాగా, ఆయనను పోలీసులు గేటు బయటే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం జరుగుతోందని శ్రీనివాసగౌడ్ అన్నారు. తాము ఎవరికీ భయపడి బతికేవాళ్లం కాదని, ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకుందని, అందుకే అన్ని ఆధారాలతో వచ్చామని అన్నారు. ఆయనే తప్పు చేసి, తమ మీద ఆరోపణలు చేస్తున్నాని మండిపడ్డారు. పాలెం బస్సు దుర్ఘటనలో కూడా ఆయనదే నేరమని ఆరోపించారు. బస్సు తనది కాదని చెప్పడానికి పాత తేదీతో అమ్మినట్లు కూడా పత్రం ఉందని, డిసెంబర్ నెలలో స్టాంప్ పేపర్ కొని, అక్టోబర్‌లో సంతకం చేసినట్లు చూపించారని తెలిపారు. అలాగే తక్కువ సీట్లకు పర్మిట్ తీసుకుని ఎక్కువ సీట్లతో నడిపిస్తున్నారని చెప్పారు. తాము తప్పు చేస్తే తమ బస్సులు సీజ్ చేయాలని అన్నారు. తనమీద ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా శ్రీనివాస గౌడ్ అన్నారు. తాము దివాకర్ ట్రావెల్స్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదని, పలు ట్రావెల్స్ గురించి మాట్లాడితే ఈయనొక్కరే స్పందించారని అన్నారు. రాజకీయ నాయకులు.. గూండాల్లా వ్యవహరించకూడదని చెప్పారు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో 20-30 మంది ఉన్నారని, వాళ్లలో ఎవరు తప్పు చేసినా శిక్షించాలని కోరారు. -
‘రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించండి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ బృందం గురువారం వినతి పత్రం సమర్పిం చింది. అనంతరం సచివాలయం మీడియా పాయింట్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు 67 రకాల విధులు నిర్వహిస్తున్నా సంక్షేమ పథ కాల అమలులో స్వార్థ రాజకీయాలకు, అసాంఘిక శక్తుల దాడులకు బలైపోతూ ఆర్థికంగా, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా పని చేస్తున్న వీఆర్వోలకు పదోన్నతి, ప్రభుత్వ ఖర్చుతో ద్విచక్ర వాహనాలు మంజూరు చేయాలని కోరారు. కొత్త జిల్లా కలెక్టర్‌కు కార్యాలయాలను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కాందారి బిక్షపతి, ఉపాధ్యక్షుడు ఎస్కే మౌలానా, కోశాధికారి రమేశ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్ఏల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి వీఆర్ఏల డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) సమైక్యంగా ఉండి ముందుకు సాగితే సమస్యలను పరి ష్కరించుకోవచ్చని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారమిక్కడ రవీంద్రభారతిలో జరి గిన వీఆర్ఏ సంక్షేమ సంఘం ఆవిర్భావసభలో ఆయన మాట్లాడారు. 010 పద్దు కింద ప్రతి నెలా క్రమబద్ధంగా వేతనాలివ్వాలని, కనీస వేతనం రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలనే వీఆర్ఏల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీఆర్ఏలు ప్రభుత్వానికి గ్రామస్థాయి లో కళ్లు, చెవులు లాంటివారన్నారు. వీఆర్ఏలను గత పాల కులు పార్ట్‌టైమ్ పనివారిగానే పరిగణించారన్నారు. వీఆర్ఏలకు పేస్కేలు, ప్రతి నెలా జీతాలివ్వాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. వీఆర్ఏ చరిత్రపై పుస్తకాలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డా. కాచం సత్యనారాయణ గుప్త, వీఆర్ఏ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.సాయన్న, రాష్ట్ర కార్యదర్శి ఎ.రాజేష్, రాష్ట్ర గౌరవ కార్యదర్శి ఎన్ గోవింద్, ఎస్ఎం ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ
ఖమ్మం సహకారనగర్ : జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నేతలతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గౌరవాధ్యక్షుడు షేక్ ఖాజామియా పాల్గొన్నారు. నేడు టీఎస్పీఎస్సీ సభ్యుడి పర్యటన ఖమ్మం సహకారనగర్: టీఎస్పీఎస్సీ సభ్యుడు బి.మన్మథరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ వెంకట రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 11, 13వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించనున్నారు. సమావేశానికి గ్రూప్-2 పరీక్షలకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, సం బంధిత శాఖాధికారులు హాజరుకావాలని కోరారు. కబడ్డీ పోటీల్లో ఖమ్మం జట్టు ముందంజ కరీంనగర్ స్పోర్ట్స: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్లో సీబీఎస్ఈ స్కూల్ క్లస్టర్ కబడ్డీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 బాలురు, 5 బాలికల జట్లు పాల్గొంటున్నాయి. 200 మంది క్రీడాకారులు 50 మంది అధికారులు హాజరయ్యారు. కాగా, తొలిరోజు బాలుర విభాగంలో చైతన్య సెంట్రల్స్కూల్ (మహబూబ్‌నగర్)పై హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ (ఖమ్మం) 52-28 తేడాతో విజయం సాధించింది. డిజిటల్ ఇండియా పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ ఖమ్మం జెడ్పీసెంటర్: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన నేషనల్ ఈ గవర్నస్ డివిజన్ డిజిటల్ ఇండియా ప్రతిభా పోటీల్లో జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోటీల్లో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీకళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఈ-హాస్పిటల్ నాటికకు ప్రథమబహుమతి లభించింది. పోటీల్లో ఉత్తమ ప్రదర్శనచేసి బహుమతి పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరభద్ర య్య బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వయకర్త జగదీశ్వరరావు, ప్రోగ్రామ్ అధికారులు చంద్రశేఖర్, సర్వేశ్వర్రావును అభినందించారు. -
సీఎంను విమర్శిస్తే జీరోలవుతారు: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును విమర్శిస్తే హీరోలవుతామని విపక్ష నేతలు భావిస్తున్నారని,కానీ ప్రజలు వారిని జీరోలుగా చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జైపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటున్న జైపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు చేసుకోలేక పోయారని నిలదీశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని విమర్శలు చేయడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనన్నారు. విపక్ష నేతలు ప్రభుత్వ పథకాలపై విషయం కక్కుతున్నారని, ప్రభుత్వ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. -
మట్టి వినాయకులను పూజిద్దాం
–ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడదామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రామకృష్ణసేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయం వద్ద మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు నీటి కాలుష్యం అవుతుందన్నారు. దీంతో మనిషి మనుగడమే ప్రమాదమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, సురేష్, ప్రభాకర్, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
– జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ – జిల్లాలోనే మొదటి ఇండోర్ సబ్‌స్టేషన్ మహబూబ్‌నగర్ అర్బన్ : సబ్స్టేషన్లలో ఆపరేటర్ల నియామకానికి డబ్బులు తీసుకోవద్దని, అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. స్థానిక జెడ్పీ ఆవరణలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ ఇండోర్ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో లక్షలాది రూపాయలు తీసుకొని విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించేవారని, తమ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికిందని అన్నారు. రూ.4.5 కోట్లతో నిర్మించిన ఇండోర్ సబ్‌స్టేషన్ జిల్లాలోనే మొదటిదని, దీనివల్ల స్థలంతోపాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు కూడా తక్కువ అవసరం అవుతాయన్నారు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఓవర్‌లోడ్ వల్ల లోవోల్టేజీ సమస్య వచ్చేదని, ఈ సబ్‌స్టేషన్ వల్ల సరఫరా మెరుగు పడుతుందన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అయిందని, డిసెంబర్ నాటికి 14గంటలు ఇస్తామన్నారు. విద్యుత్ ఎస్ఈ కె.రాముడు మాట్లాడుతూ ఇండోర్ సబ్‌స్టేషన్‌లో తెలంగాణ చౌరస్తా, రైల్వేస్టేషన్, స్టేడియం, కలెక్టరేట్ ఏరియాల్లో నాలుగు ఫీడర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు విద్యుత్ భవన్ వెనుక, వీరన్నపేట, బండమీదిపల్లిలో సబ్స్టేషన్ల ఏర్పాటునకు కషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కొరమోని వెంకటయ్య, బురుజు సుధాకర్‌రెడ్డి, డీఈ నవీన్‌కుమార్, సివిల్ ఈఈ నిర్దోష్రెడ్డి, టౌన్ ఏడీఈ యశోద, పట్టణ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ ఉద్యోగులను బాబు తీసుకెళ్లాలి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ - ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడం పట్ల హర్షం - ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను చంద్రబాబు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆంధ్రలో పనిచేస్తున్న 883 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రంలోకి తీసుకుంటామని ప్రకటించినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. సచివాలయంలో మంగళవారం తెలంగాణ ఉద్యోగులు ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ 883 మంది ఉద్యోగులను రప్పించేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించారన్నారు. కమల్‌నాథన్ కమిటీ సాగతీత ధోరణిలో ఉందన్నారు. ఖాళీలను భర్తీ చేయనీయకుండా ఏపీ సీఎం చంద్రబాబుతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తమ ఉద్యోగులను అమరావతికి రమ్మంటోన్న ఆంధ్రా ప్రభుత్వం... వస్తామని చెబుతోన్న పోలీసులు, ఉపాధ్యాయులు తదితరులను పట్టించుకోవడం లేదన్నారు. వారిని ఏపీ సీఎం రానీయడంలేదన్నారు. ఏపీ సచివాలయ తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు శ్రీనివాస్‌గౌడ్ సంఘీభావం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. మంగళవారం భోజన విరామ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ నిరసన ప్రకటిస్తున్న టీ ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. తమను తెలంగాణకు తీసుకునే విషయంలో ఇరు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల నేతలు వీర వెంకటేశ్వరరావు, జగన్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ ప్రభుత్వంతో మీ ముందే మాట్లాడతానంటూ సీఎస్ వద్దకు ఉద్యోగులందర్నీ తీసుకువెళ్లారు. ఆ సమయంలో సీఎస్ లేకపోవడంతో రేపు కలుస్తామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సచివాలయ సంఘం అధ్యక్షుడు నర్సింగ్, ప్రధాన కార్యదర్శి జాకబ్ తదితరులు పాల్గొన్నారు. -
కమలనాథన్ .. అదో తికమక కమిటీ!
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ.. కమాల్(తికమక) కమిటీ మాదిరిగా తయారైందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం టీజీవోల సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కమలనాథన్ కమిటీ విభజన తీరును ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల స్థానికత వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలా వచ్చిన ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి రాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. సమావేశం లో టీజీవోల సంఘం ప్రతినిధులు మమత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విభజనలో పోలీసులకు న్యాయం చేయాలి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ప్రకారం తెలంగాణ, ఏపీలకు ఉద్యోగులను పంపిణీ చేసినట్టుగానే 14ఎఫ్ మినహాయింపు కింద నియామకాలు పొందిన హైదరాబాద్ పోలీసులను కూడా పంపిణీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విభజన కమిటీని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ విభజనలో పోలీసు ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 3(6) కింద నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరువేల మందిని స్థానికత ఆధారంగా వారివారి స్వస్థలాలకు పంపించాలని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. -
ఎక్కడి వారు అక్కడే పని చేయాలి
పంజగుట్ట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ధేశపూర్వకంగా ఉద్యోగులమధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసి తెలంగాణలో రిలీవ్‌చేసిన విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోకపోతే తగిన విధంగా బుద్దిచెబుతామని హెచ్చరించారు. సోమవారం విద్యుత్‌సౌధాలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలనే డిమాండ్‌తో, ఆంధ్రా మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు, ఆంధ్రా సీఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, కారం రవీందర్, హమీద్, మామిడి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి లోబడి స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేసి ఆంధ్రాప్రాంత ఉద్యోగులను రిలీవ్చేస్తే వారిని ఉద్యోగంలోకి తీసుకోరని, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి శాడిజం ప్రదర్శిస్తున్నారన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూకుట్రలతో ఇంకా హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన జరగడం లేదన్నారు. వెంటనే ఉద్యోగ విభజన చేయకపోతే కేంద్రం, ఆంధ్రా ప్రభుత్వాలు తమ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేఏసీ చైర్మన్ శివాజీ మాట్లాడుతూ ..ఆంధ్రాలో పనిచేస్తున్న 170 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 110 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని నేటి నుండి నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నారని వారికి ఏదైనా జరిగితే ఆంధ్రాప్రభుత్వానిదే బాధ్యతన్నారు. తమ డిమాండ్ల సాధనకు 27 వరకు నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామని, 28 నుండి 30 వరకు భోజన విరామ సమయంలో విద్యుత్‌సౌధాలో మౌన ప్రదర్శన, మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అయినా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వ్యవసాయానికి 9గంటల కరెంట్
► భవిష్యత్‌లో నిరంతర సరఫరా ► మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి ► హేమసముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తాం ► రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి హన్వాడ : రైతులకు భవిష్యత్‌లో 24గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నా రు. గురువారం స్థానిక సబ్‌స్టేషన్‌లో మంత్రు లు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతులకు 9గంటల విద్యు త్ విధానాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రాంతం 30ఏళ్లపాటు అంధకారంగా ఏర్పడుతుందని ఎద్దేవా చేశారన్నారు. గత ఏడుగురు ముఖ్యమంత్రులు చేయలేని నిరంతర విద్యుత్‌ను మన సీఎం కేసీఆర్ కేవలం మూడు నెలల్లోనే చేసి చూపారన్నారు. ఆంధ్ర పాలనలోని 2005-12 మధ్యకాలంలో జిల్లాలో కరెంటు కాటుకు 1630మంది చనిపోయినట్లు జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ రైతుల కోసం 9గంటల నిరంతర విద్యుత్‌ను అమలు చేశారన్నారు. 9గంటల విద్యుత్ సరఫరా కోసం రూ. 182కోట్లతో జిల్లాలోని అన్ని సబ్స్టేషన్ల స్థాయిని పెంచడం జరిగిందన్నారు. ఇందుకోసం 12వేల స్తంభాలు, 108పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. హేమసముద్రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం పాలమూరు ఎత్తిపోతల కింద హన్వాడ మండలంలోని హేమసముద్రం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కొందరు తమ స్వార్థం కోసం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు సృష్టించారన్నారు. అయినా ప్రాజెక్టును నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. స్థానికులు అడగక ముందే ఇక్కడి రైతుల సమస్యలను గుర్తించి హేమసముద్రం ప్రాజెక్టు నిర్మాణానికి విశ్వప్రయత్నాలు చేశానన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా హేమసముద్రం ప్రాజెక్టును కట్టితీరుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ రాముడు, ఏడీ శ్రీనివాస్, ఎంపీపీ విజయలక్ష్మీ, వైస్ ఎంపీపీ దస్తయ్య, సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీలు రాధ, ఆంజనేయులు, మహబూబ్‌నగర్ ఏఈ రాజ్‌ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
గతపాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు
మహబూబ్‌నగర్ రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని పార్లమెంటరీ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మం డల పరిధిలోని దివిటిపల్లి గ్రామంలో బడి పిల్లలకు సన్నబియ్యం భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శినితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో చిన్న చిన్న లోటుపాట్లను సవరించి ప్రజలు పారదర్శకమైన సేవలందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నదన్నారు. రైతు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 60వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దివిటిపల్లి గ్రామంలో మౌలిక సదుపాయా కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డుల ద్వారా లబ్దిదారులకు 6 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నదన్నారు. అంగన్వాడీల్లో గర్బిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వపరంగా లబ్దిపొందేందుకు లబ్దిదారులు దరఖాస్తులు చేసుకుంటే పరిశీ లించి అర్హులకు అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పం పాలని అధికారులకు సూచించారు. అ నంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంతురెడ్డి, తహిసీల్దార్ అమరేందర్, ఎంఈఓ వెంకట్రాముడు, సర్పంచ్ పాం డురంగారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు పాలమూరు భారీ ర్యాలీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండోచైర్మన్ వెంకటయ్య, ఆనంద్‌గౌడ్, ఇంతియాజ్, చందర్పాటిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ న్యూటౌన్, బస్టాండ్, వన్‌టౌన్,గడియారం చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. -
విడిపోయినా కొట్లాటలు తప్పవు
హైదరాబాద్: తాత్కాలికంగానైనా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తే ఒప్పుకునేదిలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం ఇలానే ఉంటే విడిపోయాక కూడా కొట్లాటలు తప్పవన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో శ్రీనివాస్ గౌడ్, టీఎన్డీవో నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపకాల్లో అవకతవకలను అరికట్టాలని వారు మహంతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఎవరి కార్యాలయాల్లో వారే పనిచేయాలని డిమాండ్ చేశారు. విభజన మొదలయ్యాక ఇచ్చిన జీవోలు, భూ కేటాయింపులు, ఉద్యోగుల ప్రమోషన్లను తిరగతోడతామని చెప్పారు. విభజన ముంగిట్లో తెలుగు అకాడమీకి 80 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను ప్రింటింగ్‌కు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్ రూంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఐఏఎస్‌లు ఒక ప్రాంతానికి కొమ్ముకాయకుండా అఖిల భారత ఉద్యోగులమని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.