ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ.. కమాల్(తికమక) కమిటీ మాదిరిగా తయారైందని తెలంగాణ ..
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ.. కమాల్(తికమక) కమిటీ మాదిరిగా తయారైందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం టీజీవోల సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కమలనాథన్ కమిటీ విభజన తీరును ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల స్థానికత వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలా వచ్చిన ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి రాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. సమావేశం లో టీజీవోల సంఘం ప్రతినిధులు మమత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.