employee division
-
వివిధ విభాగాల కార్యదర్శులతో సీఎస్ జవహార్‌రెడ్డి సమీక్ష
-
AP: కొత్త జిల్లాల్లో పదోన్నతులు, ఖాళీలపై సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలపై సీఎస్ కేఎస్. జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేక ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా త్వరితగతిన ఖాళీలు భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కాగా, గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాక్‌లో కలెక్టర్ల మీటింగ్ హాల్లో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్, ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 పోస్టుల ఖాళీల భర్తీ, ఈ-ఆఫీసు ద్వారా ఈ-రిసీప్ట్స్, ఈ-డిస్పాచ్ ఆపరేషనలైజేషన్, ఏసీబీ, విజిలెన్స్ కేసుల పరిష్కారం, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సిక్యూలపై సత్వరం సమాచారం అందించడం, ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర అజెండా అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించాలి. లేనిపక్షంలో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు ద్వారా ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి. సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2 స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానం కింద ఈ-రిసీప్ట్స్, ఈ-డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్ననేపథ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివిధ శాఖలు అందించాల్సిన సమాధానాలను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ, విజిలెన్స్ కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. అదే విధంగా ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్న కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలుచేయడం కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. దీనిపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో ఒక వర్క్ షాపు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్ధికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలపై కూడా కార్యదర్శులతో సమీక్షించారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది. 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీజ్ చేసిన 1,157 మంది ఉద్యోగుల్లో హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లడానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మంది ఉద్యోగులను పోస్టులతో సంబంధం లేకుండా చేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు, ఉద్యోగుల విభజనకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఇరు విద్యుత్ సంస్థలతో సమావేశమైన ఆయన ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మిగిలిన ఉద్యోగులను తీసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలు జస్టిస్ డీఎం ధర్మాధికారికి నివేదించాయి. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రికి కూడా గుర్తు చేశాయి. దాంతో 613 మంది ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థలు చేర్చుకుంటే 1,157 మంది ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల వివాదం దాదాపు సమసినట్లే. ఇదిలా ఉండగా 613 మందిలో 202 మందిని మాత్రమే చేర్చుకోగలమని, ఆ మేరకు తమకు మంజూరైన పోస్టులున్నాయని ఏపీ వాదించింది. అయితే మిగతా వారిని చేర్చుకోలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. అయితే ఏపీలో పనిచేస్తున్న 229 మందిని స్వచ్ఛందంగా తెలంగాణ ఇప్పటికే చేర్చుకున్నందున 613 మందిని నిరభ్యంతరంగా చేర్చుకోవాలని జస్టిస్ ధర్మాధికారి స్పష్టం చేశారు. ఆదేశాలతో తెలంగాణకు రావడానికి ఆప్షన్లు సమర్పించిన 265 మంది విషయంలో రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పరస్పరం చర్చించుకుని, కేసు టూ కేస్ పరిశీలించి...నిర్ణయం తీసుకోవాలని, తుది కేటాయింపులు తన అనుమతితో జరగాలని నిర్దేశించారు. తదుపరి సమావేశం నవంబరు 2, 3 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి విజయవాడలో జరుగనుంది. ఇదే సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల విభజనకు శాశ్వత పరిష్కారం కలగనుంది. -
శరవేగంగా పునర్విభజన!
♦ కామారెడ్డి జిల్లా కేంద్రంపై కలెక్టర్ సమీక్ష ♦ ఉద్యోగుల విభజనపై అధికారులతో భేటీ ♦ జిల్లా కార్యాలయాలకు జేసీ బృందం స్థల పరిశీలన ♦ మండలాలు, డివిజన్లపై వచ్చిన స్పష్టత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. పునర్విభజన కోసం సీఎం కేసీఆర్ రెండు రోజుల సమావేశంలో కలెక్టర్లకు సూచించిన ఫార్మాట్ ప్రకారం కార్యాచరణ సాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కావాల్సిన అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, విభజనలపై కలెక్టర్ డాక్టర్ యోగితారాణా శుక్రవారం రెండు దఫాలుగా సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులతో ఆయా శాఖలలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలపై చర్చించినట్లు తెలిసింది. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు తోడు కొత్తగా అవసరమయ్యే వారి జాబితాను తయారు చేసే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నం కావాలని సూచించారు. సాయంత్రం సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, డీఎల్పీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ పునర్విభజనపై అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడే మండలాలు, రెవెన్యూ డివిజన్లపై సూచనలు చేసినట్లు సమాచారం. కాగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డిలతో ఏర్పడే కామారెడ్డి జిల్లా కోసం ఉద్యోగులు, సిబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై సమీక్షించారు. కొత్తగా 10 మండలాలు ఖాయం జిల్లాలో మొన్న కొత్తగా ఏర్పడిన ఆర్మూరు రెవెన్యూ డివిజన్‌తోపాటు నాలుగు ఉండగా, శరవేగంగా పునర్విభజన! నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరులకు తోడు బాన్సువాడ డివిజన్ కొత్తగా ఏర్పడనుంది. అలాగే 36 మండలాలకు తోడు కొత్తగా మరో 10 మండలాలను కలిపి 46 చేయనున్నారు. ఇప్పుడున్న మండలాలకు తోడు నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, ఆలూరు, రెంజర్ల, బాన్సువాడ రూరల్, రుద్రూరు, బీబీపేట, దేవునిపల్లి, మరో మండలం ఏర్పడనుంది. ఈ ప్రతిపాదనలకు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా మండలాలు, డివిజన్ల ఏర్పాటు దాదాపుగా ఖరారు కాగా, ఉద్యోగుల విభజన, కేటాయింపు, కామారెడ్డి జిల్లాలో కొత్త కార్యాలయాల ఏర్పాటుపైనా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి దృష్టి సారించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్‌లోనే పునర్విభజన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న చర్చ కూడా ఉంది. కామారెడ్డిలో జేసీ రవిందర్ రెడ్డి పర్యటన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కామారెడ్డిలో కలెక్టరేట్ భవన సముదాయం, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం జేసీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం కామారెడ్డిలో భవనాలు, స్థల పరిశీలన చేసింది. దసరా నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగుతుందన్న సీఎం ప్రకటన నేపథ్యంలో అధికారయంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే జేసీ రవీందర్‌రెడ్డి, అర్కిటెక్చర్ ఉషారెడ్డి, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చైతన్యకుమా ర్, ల్యాండ్ సర్వే రికార్డ్స్ అధికారులు శుక్రవారం కామారెడ్డిలో పర్యటిం చారు. తాత్కాలికంగా జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలించారు. కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి గాను అడ్లూర్ శివారులోని ప్రభుత్వ భూమిని కూడా అధికారులు పరిశీలించారు. నూతన మండల కేంద్రంగా ‘ రెంజర్ల’ ...! బాల్కొండ/మోర్తాడ్ : మండలాల పునర్విభజనలో భాగంగా రెంజర్ల మండలం తెరపైకి వచ్చింది. బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లోని గ్రామాలను కలిపి రెంజర్ల మండలంగా ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రెండు మండలాల్లోని 15 గ్రామాలతో కొత్తగా రెంజర్ల మండలం ఏర్పాటు ప్రతిపాదనలపై ఆమోదం, అభ్యంతరాలు ఉంటే తీర్మానాలు చేసి పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు సూచించారు. చబాల్కొండ మండలంలోని చాకీర్యాల్, మెండోరా, కోడిచర్ల, సావెల్, వెల్కటూర్, వెంచిర్యాల్, రెంజర్ల, నాగంపేట్, కొత్తపల్లి , మోర్తాడ్ మండలంలోని ఏర్గట్ల, తాళ్ల రాంపూర్, దోంచంద, గుమ్మిర్యాల్, బట్టాపూర్, తడ్పాకల్ గ్రామాలను కలుపుతు రెంజర్ల మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవే గ్రామాలతో 1985 గెజిట్ ప్రకారం ఏర్గట్ల మండలం ఏర్పాటు కావాల్సి ఉండగా అప్పట్లో ఏర్గట్లకు బదులు కమ్మర్పల్లి మండలంగా ఏర్పడటంతో ఏర్గట్ల మండలం రద్దు అయ్యింది. అయితే ఇప్పుడు మండల కేంద్రానికి మండలంలోని గ్రామాలు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రభుత్వం సూచించడంతో ఏర్గట్లకు బదులు రెంజర్ల మండల కేంద్రంగా ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అంతే కాకుండ జాతీయ రహదారి 44 ను జాతీయ రహదారి 63 ను కలుపుటకు డబుల్ రోడ్డు సౌకర్యం ఉంది. అయితే మండలాల పునర్విభజన కొంత దుమారంరేపుతోంది. అధికారులు మాత్రం అభ్యంతరాలను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి తుదినివేదిక పంపించే అవకాశం ఉంది. తీర్మానం పంపాలన్నారు రెంజర్ల మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ బాల్కొండలోని తొమ్మిది గ్రామాలు, మోర్తాడ్‌లోని ఆరు గ్రామాల తీర్మానాలు చేసి ఈనెల 15 లోపు పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. - శ్రీనివాస్, ఎంపీడీఓ, బాల్కొండ -
కమలనాథన్ .. అదో తికమక కమిటీ!
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ.. కమాల్(తికమక) కమిటీ మాదిరిగా తయారైందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం టీజీవోల సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కమలనాథన్ కమిటీ విభజన తీరును ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల స్థానికత వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలా వచ్చిన ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి రాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. సమావేశం లో టీజీవోల సంఘం ప్రతినిధులు మమత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో స్థానికేతరుల సంగతేంటి?
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : ‘మన తెలంగాణ.. మన సింగరేణి..’ అని నినదిస్తూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కార్మికులు ఇక న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాల్లో వాటా కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో ఉల్లంఘించి అక్రమంగా సింగరేణి లో తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులను తిప్పి పంపిస్తారన్న చర్చ జరుగుతోంది. జూన్ 2 అపాయింటెడ్ డే దగ్గర పడుతున్నా సింగరేణిలో ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. విభజన మార్గదర్శకా లు ప్రభుత్వం ఇచ్చిందా?ఇవ్వాలేదా?యాజమాన్యం ప్రకటించడం లేదు. అసలు కంపెనీలో ఉద్యోగుల వి భజన ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు వ్య క్తం అవుతున్నాయి. సంస్థలో స్థానికేతరులు 1,500 మంది అధికారులు, సుమారు 4వేలకుపైగా ఉద్యోగు లు పని చేస్తున్నారని జేఏసీ పేర్కొంటుంది. రాష్ట్రంలో వాడివేడిగా ఉద్యోగ విభజన జరుగుతుంటే సింగరేణి లో మాత్రం ఉలుకు పలుకు లేదు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖ ల్లో ఉన్న స్థానికేతరుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర కేడ ర్ ఉద్యోగాల్లో పంపకాలు జరిగాయి. సెక్రెటరేట్ మొ దలుకుని పలు శాఖల్లో విభజన వేగం పుంజుకుంది. జిల్లాలవారీగా కూడా స్థానికేతురుల రిపోర్టు ప్రభు త్వం తెప్పించుకుంటుంది. కానీ, సింగరేణిలో మా త్రం విభజన వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణే. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఉండేది. ఇప్పడు ఆర్టీసీలో కూడా ఉద్యోగ విభజన జరుగుతుండటంతో సింగరేణే అతిపెద్ద సంస్థగా అవతరించింది. తెలంగాణ అధికారుల ఎదురుచూపు సింగరేణిలో 2,600 మంది అధికారులు పని చేస్తున్నా రు. ఇందులో సుమారు 1,500 మంది స్థానికేతరులే. కీ పోస్టుల్లో ఉన్నది వారే. అసిస్టెంట్ సూపరింటెండెంట్లుగా కూడా ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతాని కి చెందిన వారే ఉన్నారు. అక్కడక్కడ బీహార్, బెంగా ల్ వారు కూడా ఉన్నారు. విభజన జరుగుతున్నందు న స్థానికేతరులను వెనక్కి పంపిస్తే తమకైన పదోన్నతులు వస్తాయని తెలంగాణ ప్రాంత అధికారులు ఎ దురుచూస్తున్నారు. సివిల్,పర్చేస్, ఫైనాన్స్ వంటి వి భాగాల్లో వారే ఎక్కువగా ఉన్నారు. ఏజెంటు కార్యాల యాలు, జీఎం కార్యాలయాల్లో, కొత్తగూడెం కార్పొరే ట్ కార్యాలయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో ఉల్లంఘించి ఎక్కువ మంది పని చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అక్రమంగా తిష్టవేసిన వారందరిని తిప్పి పంపించి ఆ పోస్టుల్లో అర్హులైన తెలంగాణ వారి తో భర్తీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నాక మన ఉద్యోగాలు మనకు దక్కకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ పోస్టులో.. ఇదిలా ఉంటే సింగరేణిలో ఉన్న కొందరు స్థానికేతరులైన అధికారులు తెలంగాణపై వివక్ష చూపుతున్నారనడానికి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంటే నిదర్శనం. 60 ఏళ్లు పోరాడింది మన ప్రాంత ఉద్యోగాలు మనకే ద క్కాలని, ఒక పక్క విభజన జరుగుతుంతే మరో పక్క కంపెనీలోని ఉద్యోగాలు స్థానికేతరులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ధన్బాద్లో ఈ నెల 20న క్యాంపస్ సెలక్షన్స్ పేరుతో ఈ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. మొత్తం 20 పోస్టులు ఇందులో ఉన్నాయి. ఆ ప్రాంతానికి చెందిన వారికి ప్రయోజనం చేకూర్చడం కోసమే సింగరేణిలో పని చేసే ఆ రాష్ట్ర అధికారులు కొందరు దీని వెనుక మంత్రాంగం నడిపారని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఎంతో మంది కార్మికులు పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాల్లో నేడు కొలువులు చేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ ఆ పోస్టులను ఇక్కడి వారిని కాదని ఎవరికో కట్టబెట్టడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సింగరేణి సీఅండ్ఎండీతో మాట్లాడి ఈ పోస్టుల భర్తీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ దృష్టి సారించాలి.. సింగరేణిలో విభజన పర్వంపై ప్రభుత్వంలో కూర్చోబోయే టీఆర్ఎస్ పార్టీ నేతలు దృష్టిసారించాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సింగరేణిలో ఉద్యోగ విభజనపై ఈ ప్రాంత టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలని కోరుతున్నారు. దీనిపై గుర్తింపు సంఘంబాధ్యత ఉందని పేర్కొంటున్నారు.