సింగరేణిలో స్థానికేతరుల సంగతేంటి? | what about non-local employees in singareni? | Sakshi
Sakshi News home page

సింగరేణిలో స్థానికేతరుల సంగతేంటి?

Published Fri, May 23 2014 2:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

what about non-local employees in singareni?

శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : ‘మన తెలంగాణ.. మన సింగరేణి..’ అని నినదిస్తూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కార్మికులు ఇక న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాల్లో వాటా కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో ఉల్లంఘించి అక్రమంగా సింగరేణి లో తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులను తిప్పి పంపిస్తారన్న చర్చ జరుగుతోంది. జూన్ 2 అపాయింటెడ్ డే దగ్గర పడుతున్నా సింగరేణిలో ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. విభజన మార్గదర్శకా లు ప్రభుత్వం ఇచ్చిందా?ఇవ్వాలేదా?యాజమాన్యం ప్రకటించడం లేదు. అసలు కంపెనీలో ఉద్యోగుల వి భజన ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు వ్య క్తం అవుతున్నాయి. సంస్థలో స్థానికేతరులు 1,500 మంది అధికారులు, సుమారు 4వేలకుపైగా ఉద్యోగు లు పని చేస్తున్నారని జేఏసీ పేర్కొంటుంది.

 రాష్ట్రంలో వాడివేడిగా ఉద్యోగ విభజన జరుగుతుంటే సింగరేణి లో మాత్రం ఉలుకు పలుకు లేదు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖ ల్లో ఉన్న స్థానికేతరుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర కేడ ర్ ఉద్యోగాల్లో పంపకాలు జరిగాయి. సెక్రెటరేట్ మొ దలుకుని పలు శాఖల్లో విభజన వేగం పుంజుకుంది. జిల్లాలవారీగా కూడా స్థానికేతురుల రిపోర్టు ప్రభు త్వం తెప్పించుకుంటుంది. కానీ, సింగరేణిలో మా త్రం విభజన వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణే. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఉండేది. ఇప్పడు ఆర్టీసీలో కూడా ఉద్యోగ విభజన జరుగుతుండటంతో సింగరేణే అతిపెద్ద సంస్థగా అవతరించింది.

 తెలంగాణ అధికారుల ఎదురుచూపు
 సింగరేణిలో 2,600 మంది అధికారులు పని చేస్తున్నా రు. ఇందులో సుమారు 1,500 మంది స్థానికేతరులే. కీ పోస్టుల్లో ఉన్నది వారే. అసిస్టెంట్ సూపరింటెండెంట్‌లుగా కూడా ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతాని కి చెందిన వారే ఉన్నారు. అక్కడక్కడ బీహార్, బెంగా ల్ వారు కూడా ఉన్నారు. విభజన జరుగుతున్నందు న స్థానికేతరులను వెనక్కి పంపిస్తే తమకైన పదోన్నతులు వస్తాయని తెలంగాణ ప్రాంత అధికారులు ఎ దురుచూస్తున్నారు. సివిల్,పర్చేస్, ఫైనాన్స్ వంటి వి భాగాల్లో వారే ఎక్కువగా ఉన్నారు. ఏజెంటు కార్యాల యాలు, జీఎం కార్యాలయాల్లో, కొత్తగూడెం కార్పొరే ట్ కార్యాలయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో ఉల్లంఘించి ఎక్కువ మంది పని చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అక్రమంగా తిష్టవేసిన వారందరిని తిప్పి పంపించి ఆ పోస్టుల్లో అర్హులైన తెలంగాణ వారి తో భర్తీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  తెలంగాణ సాధించుకున్నాక మన ఉద్యోగాలు మనకు దక్కకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

 ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్స్ పోస్టులో..
 ఇదిలా ఉంటే సింగరేణిలో ఉన్న కొందరు స్థానికేతరులైన అధికారులు తెలంగాణపై వివక్ష చూపుతున్నారనడానికి ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంటే నిదర్శనం. 60 ఏళ్లు పోరాడింది మన ప్రాంత ఉద్యోగాలు మనకే ద క్కాలని, ఒక పక్క విభజన జరుగుతుంతే మరో పక్క కంపెనీలోని ఉద్యోగాలు స్థానికేతరులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ధన్‌బాద్‌లో ఈ నెల 20న క్యాంపస్ సెలక్షన్స్ పేరుతో ఈ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

 మొత్తం 20 పోస్టులు ఇందులో ఉన్నాయి. ఆ ప్రాంతానికి చెందిన వారికి ప్రయోజనం చేకూర్చడం కోసమే సింగరేణిలో పని చేసే ఆ రాష్ట్ర అధికారులు కొందరు దీని వెనుక మంత్రాంగం నడిపారని విమర్శలు వస్తున్నాయి.  ఇక్కడ ఎంతో మంది కార్మికులు పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాల్లో నేడు కొలువులు చేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ ఆ పోస్టులను ఇక్కడి వారిని కాదని ఎవరికో కట్టబెట్టడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సింగరేణి సీఅండ్‌ఎండీతో మాట్లాడి ఈ పోస్టుల భర్తీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

 టీఆర్‌ఎస్ దృష్టి సారించాలి..
 సింగరేణిలో విభజన పర్వంపై ప్రభుత్వంలో కూర్చోబోయే టీఆర్‌ఎస్ పార్టీ నేతలు దృష్టిసారించాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సింగరేణిలో ఉద్యోగ విభజనపై ఈ ప్రాంత టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలని కోరుతున్నారు. దీనిపై గుర్తింపు సంఘంబాధ్యత ఉందని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement