
సీఎం దృష్టికి వీఆర్‌ఏల డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) సమైక్యంగా ఉండి ముందుకు సాగితే సమస్యలను పరి ష్కరించుకోవచ్చని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారమిక్కడ రవీంద్రభారతిలో జరి గిన వీఆర్‌ఏ సంక్షేమ సంఘం ఆవిర్భావసభలో ఆయన మాట్లాడారు. 010 పద్దు కింద ప్రతి నెలా క్రమబద్ధంగా వేతనాలివ్వాలని, కనీస వేతనం రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలనే వీఆర్‌ఏల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీఆర్‌ఏలు ప్రభుత్వానికి గ్రామస్థాయి లో కళ్లు, చెవులు లాంటివారన్నారు.
వీఆర్‌ఏలను గత పాల కులు పార్ట్‌టైమ్ పనివారిగానే పరిగణించారన్నారు. వీఆర్‌ఏలకు పేస్కేలు, ప్రతి నెలా జీతాలివ్వాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. వీఆర్‌ఏ చరిత్రపై పుస్తకాలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డా. కాచం సత్యనారాయణ గుప్త, వీఆర్‌ఏ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.సాయన్న, రాష్ట్ర కార్యదర్శి ఎ.రాజేష్, రాష్ట్ర గౌరవ కార్యదర్శి ఎన్ గోవింద్, ఎస్‌ఎం ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.