
సీఎంను విమర్శిస్తే జీరోలవుతారు: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును విమర్శిస్తే హీరోలవుతామని విపక్ష నేతలు భావిస్తున్నారని,కానీ ప్రజలు వారిని జీరోలుగా చేస్తారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జైపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటున్న జైపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు చేసుకోలేక పోయారని నిలదీశారు.
జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని విమర్శలు చేయడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనన్నారు. విపక్ష నేతలు ప్రభుత్వ పథకాలపై విషయం కక్కుతున్నారని, ప్రభుత్వ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు.