
డ్రగ్స్ రాకెట్‌లో ఉన్న నేతలెవరో చెప్పండి
టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యా లయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పేకాట క్లబ్బులు మూయించింది, మియాపూర్ భూకుంభకోణాన్ని బయట పెట్టింది తమ ప్రభుత్వమేనని తెలిపారు. పేకాటక్లబ్బులను, గుడంబా తయారీని ప్రోత్సహిం చింది, నడిపించింది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఎవరెన్నీ ట్వీట్లు పెట్టినా తమను ఎవరూ ఏం చేయలేరన్నారు.