ప్రజల జీవితాలతో ఆటలా? | Mla Srinivas Goud fires on private bus Mafia | Sakshi
Sakshi News home page

ప్రజల జీవితాలతో ఆటలా?

Published Tue, Jun 13 2017 7:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

ప్రజల జీవితాలతో ఆటలా?

ప్రజల జీవితాలతో ఆటలా?

హైదరాబాద్‌: ప్రైవేటు బస్సుల మాఫియా ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. చట్టానికి విరుద్ధంగా ఈ బస్సులు తిరుగుతున్నాయని, ఇష్టానుసారంగా పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బస్సుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రవేటు బస్సులు ఎలా లాభాల్లో ఉంటాయి.. ఆర్టీసీ బస్సులు ఎలా నష్టాలు.. వస్తాయని ప్రశ్నించారు.

అక్రమ పద్ధతిలో బస్సులు నడిపితే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలంగాణ నుంచి కూడా ఏపీకి అన్నే బస్సులు నడపాలని, లేకుంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ విషయం గురించి తాము స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement