Private bus mafia
-
ఆర్టీసీ ఆదాయం అదుర్స్
- రోజుకు అదనంగా రూ. కోటి ఆదాయం - ‘అరుణాచల్’ఉదంతంతో పెరిగిన ప్రయాణికుల తాకిడి - ప్రైవేట్ ‘స్టేజీ క్యారియర్ల’నూ నియంత్రిస్తే నష్టాలు మాయం సాక్షి, హైదరాబాద్: ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. పాఠశాలలు మొదలైనా, వానలు కురుస్తున్నా ఆదాయంపై ఏమాత్రం ప్రభావం పడలేదు. ఏటా జూన్ చివరి నాటికి ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి ఆదాయం తగ్గుతుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆర్టీసీకి నిత్యం అదనంగా దాదాపు రూ.కోటి మేర ఆదాయం సమకూరుతున్నట్టు సమాచారం. ప్రైవేటు బస్సు మాఫియాపై అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఏర్పడ్డ కుదుపు ప్రభావమిది. అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై ఆ రాష్ట్ర రవాణా శాఖ విరుచుకుపడి రిజిస్ట్రేషన్లు రద్దు చేయటం, ఇక్కడి రవాణా శాఖ వాటిని సీజ్ చేస్తుండటంతో అనేక బస్సులు రోడ్డెక్కటం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీవైపు మళ్లడంతో ఆదాయం పెరిగింది. ప్రత్యేక ప్రణాళిక కరువు.. బస్సులను తిప్పేందుకు ప్రైవేటు బస్సు మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే.. ఆర్టీసీ మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. గతంలో 70 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ తాజాగా పెరుగుతోంది. ప్రయాణికుల తాకి డికి అనుగుణంగా కొత్త బస్సులు సమకూ ర్చుకుని ‘ప్రైవేటు’కు అడ్డుకట్ట వేయాల్సి ఉండగా.. జప్తు మొదలైన తర్వాత ఒక్క బస్సు నూ ఆర్టీసీ సమకూర్చుకోలేదు. ఇక.. స్థానికంగా టూరిస్టు పర్మిట్ తీసుకుని స్టేజ్ క్యారియర్లుగా తిరుగుతున్న బస్సులపైనా రవాణా శాఖ ఇప్పటి వరకు దృష్టి సారించ లేదు. మరోవైపు వాటిని నియంత్రిస్తే ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన భారం పైన పడుతుందని ప్రభుత్వమూ ఆ దిశగా చర్యలపై రవాణా శాఖను పురమాయించటం లేదు. వెరసి ఆర్టీసీ బలోపేతమయ్యే మంచి అవకాశం చేజారిపోతోంది. బస్సులు కిటకిట.. మే నెలలో వేసవి సెలవులుండటం వల్ల ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.12 కోట్లు మించుతుంది. అలాగే శుభకార్యాలూ ఉండటంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే పాఠశాలలు ప్రారంభమవడం, వానలు మొదలవడంతో జూన్ మూడోవారం నాటికి ఆదాయం తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు జూలై వచ్చినా ఆదాయం నిత్యం సగటున రూ.12.5 కోట్ల నుంచి రూ.13 కోట్ల మేర నమోదవుతోంది. దీంతో ఆర్టీసీ ఉత్సాహంగా బస్సులు తిప్పుతోంది. -
ప్రజల జీవితాలతో ఆటలా?
హైదరాబాద్: ప్రైవేటు బస్సుల మాఫియా ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చట్టానికి విరుద్ధంగా ఈ బస్సులు తిరుగుతున్నాయని, ఇష్టానుసారంగా పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బస్సుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రవేటు బస్సులు ఎలా లాభాల్లో ఉంటాయి.. ఆర్టీసీ బస్సులు ఎలా నష్టాలు.. వస్తాయని ప్రశ్నించారు. అక్రమ పద్ధతిలో బస్సులు నడిపితే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలంగాణ నుంచి కూడా ఏపీకి అన్నే బస్సులు నడపాలని, లేకుంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ విషయం గురించి తాము స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. -
దివాకర్ ట్రావెల్స్‌పై ప్రజా పోరాటం!
‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట వేదిక ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కనీస ప్రమాణాలు లేకుండా, జాగ్ర త్తలు చేపట్టకుండా బస్సులను తిప్పుతున్న దివాకర్ ట్రావెల్స్ వంటి ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు, వాటికి అండగా నిలుస్తున్న ఏపీ సర్కారు తీరును ఎండగట్టేం దుకు ప్రజా పోరాటం మొదలవుతోంది. మూడున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివారులో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలువలో పడిపోయి 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు, వాటికి అండగా నిలుస్తున్న ప్రభుత్వాలపై పోరాటం కోసం కొందరు బాధితులు, మరికొందరు కలసి ‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంతో అమాయకులను బలితీసుకుంటున్న ట్రావెల్స్‌ను మూసివేయించడమే లక్ష్యంగా నిర్ణయించినట్టు ఈ వేదిక అధ్య క్షురాలు రేఖ పేర్కొంటున్నారు. పాలెం ఘటన బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కృషి చేసిన సుధాకర్ ఈ వేదికకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. -
ప్రైవేట్ బస్సు మాఫియాతో మా ప్రాణానికి ముప్పు!
‘పాలెం’ బాధితుల జేఏసీ హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రైవేట్ బస్సు మాఫియాతో తమకు ప్రాణహాని ఉందని పాలెం బాధిత కుటుంబాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి.సుధాకర్ అనుమానం వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్‌లో బస్సు ప్రమాద బాధితులతో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన తరువాత తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఈ విషయాన్ని డీజీపీకి దృష్టికి తీసుకురాగా, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారని తెలిపారు. బస్సు దుర్ఘటన జరిగి వందరోజులైన సందర్భంగా పాలెం వద్ద స్మారక స్థూపం నిర్మించనున్నట్లు చెప్పారు.