minority youth
-
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
పాలమూరు విద్యార్థులు ముందుండాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు నిలుస్తూ ఉద్యోగా ల సాధనలో కూడా ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షన తీసుకుంటున్న అభ్యర్థులకు బుధవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ వెనుకబడిన పేద విద్యార్థులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీకి పెద్దసంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నందున ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో పాటు కొరమోని వెంకటయ్య, సుదీప్‌రెడ్డి, మహేష్‌కుమార్, శివశంకర్, రవీందర్, రమాదేవి పాల్గొన్నారు. మైనార్టీ యువత ఉద్యోగాల్లో రాణించాలి స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యాన న్యూటౌన్‌లోని ప్రగతి కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరపున మొదటిసారి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాదాపు 190 మంది విద్యార్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. సూపరింటెండెంట్ బక్క శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఇసాక్, మక్సూద్ హుస్సేన్, తఖీ హుస్సేన్, అబ్రార్, వెంకటయ్య, శివశంకర్ పాల్గొన్నారు. నూతన పంచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నూతన గ్రామపంచాచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. నూతన గ్రామపంచాయితీల ద్వారా ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకాధికారుల హయాంలోఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో కూడళ్ల అభివృద్ధి పనులు, మినీ ట్యాంక్‌బండ్ వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు. -
'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు
వరంగల్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు సోమవారం వరంగల్ జిల్లా జనగామ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ యువజన నాయకులు ఎండి ఎజాజ్, అన్వర్, సలీం, ఎక్బాల్, షకీల్, ఇమ్రాన్, జాఫర్, సమ్మద్, హబీబ్‌లు మాట్లాడుతూ... మతసామరస్యాన్ని చాటిచెప్పే మనదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. అల్లా, మహ్మద్ ప్రవక్త, మహ్మద్ అనే పేర్లపై డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రచురించారని, ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు ఆరోపించారు. ఈ కేసులో పేర్లు నమోదు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.