'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు | minority youth case files on nanaku prematho movie in janagama court | Sakshi
Sakshi News home page

'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు

Published Tue, Jan 12 2016 7:00 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు - Sakshi

'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు

వరంగల్ : జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు సోమవారం వరంగల్ జిల్లా జనగామ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్‌టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మైనార్టీ యువజన నాయకులు ఎండి ఎజాజ్, అన్వర్, సలీం, ఎక్బాల్, షకీల్, ఇమ్రాన్, జాఫర్, సమ్మద్, హబీబ్‌లు మాట్లాడుతూ... మతసామరస్యాన్ని చాటిచెప్పే మనదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. అల్లా, మహ్మద్ ప్రవక్త, మహ్మద్ అనే పేర్లపై డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రచురించారని, ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు ఆరోపించారు. ఈ కేసులో పేర్లు నమోదు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement