Nanaku prematho
-
అభిమానుల ముందుకు నాన్నకు ప్రేమతో మూవీ
-
'నాన్నకు ప్రేమతో’పై కోర్టులో కేసు
వరంగల్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు సోమవారం వరంగల్ జిల్లా జనగామ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ యువజన నాయకులు ఎండి ఎజాజ్, అన్వర్, సలీం, ఎక్బాల్, షకీల్, ఇమ్రాన్, జాఫర్, సమ్మద్, హబీబ్‌లు మాట్లాడుతూ... మతసామరస్యాన్ని చాటిచెప్పే మనదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. అల్లా, మహ్మద్ ప్రవక్త, మహ్మద్ అనే పేర్లపై డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రచురించారని, ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు ఆరోపించారు. ఈ కేసులో పేర్లు నమోదు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
పంజాబీ పిల్ల... తెలుగు డబ్బింగ్
రకుల్ ప్రీత్‌సింగ్... ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలోని నవ యువ కథానాయికల్లో మొదటి వరుసలో ఉన్న గ్లామర్ గర్ల్. తెలుగు తెరకు వచ్చిన గడచిన ఆరేళ్ళలో తొమ్మిది సినిమాల్లో నటించిన హ్యాపెనింగ్ హీరోయిన్. ఈ పంజాబీ అమ్మాయి బయట చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగు నటీనటులే తెలుగు సరిగ్గా మాట్లాడలేక పోతున్న ఈ రోజుల్లో ఆమె తెలుగు మాట్లాడడం వింటే ముచ్చటేస్తుంది. విషయం ఏమిటంటే, రకుల్ ఇప్పుడు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చిన్న ఎన్టీయార్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కథానాయిక అయిన రకుల్ అలా వాచికాభినయం కూడా ప్రదర్శించనున్నారు. ‘‘ ‘నువ్వు డబ్బింగ్ చెప్పగలవు’ అంటూ దర్శకుడు సుకుమార్ నన్ను ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు. గత వారం ఈ సినిమాలో కొన్ని సీన్లకు టెస్ట్ డబ్బింగ్ చెప్పాను. అందరూ నా గొంతు బాగుందన్నారు’’ అని రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, బయట ఎంత బాగా మాట్లాడినా, డబ్బింగ్ చెప్పడం వేరు కాబట్టి, కొంత టెన్షన్ ఫీలవుతున్నట్లు ఆమే ఒప్పుకుంటున్నారు. తెర మీది సన్నివేశంలోని భావోద్వేగాలకు తగ్గట్లుగా మాట్లాడుతూ, ఉచ్చారణ సరిగ్గా ఉండేలా చూసుకోవడం కష్టమని ఒప్పుకుంటూనే అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ రకుల్ తీసుకుంటున్నారట. గమ్మత్తేమిటంటే, రకుల్ ఇంతవరకూ ఎవరి దగ్గరా పద్ధతి ప్రకారం తెలుగు నేర్చుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తనతో కేవలం తెలుగులోనే మాట్లాడ మని మొదట్లోనే చెప్పేశారు. వాళ్ళు మాట్లాడుతున్నది వింటూ, వాళ్ళతో మాట్లాడుతూనే భాష నేర్చేసుకు న్నారు. ‘‘ఆ కష్టం ఇప్పుడు ఫలించింది’’ అని ఈ మిస్ ఇండియా పోటీ ఫైనలిస్ట్ చెప్పుకొచ్చారు. నటిగా ఇంతదాన్ని చేసిన తెలుగు ప్రేక్షకులకూ, పరిశ్రమకూ ఇలా తెలుగులో మాట్లాడుతూ ఋణం తీర్చుకుంటు న్నట్లు రకుల్ భావిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’లో లండన్‌లో ఎన్నారైగా కనిపించనున్న రకుల్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తయారవుతున్న సినిమాలో అల్లు అర్జున్ పక్కన ‘అచ్చమైన తెలుగమ్మాయి’ పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి, వేషం... వేషానికి తగ్గ మాటతో తెలుగు నేలతో తన బంధాన్ని ఈ పంజాబీ పిల్ల గట్టిపరుచుకుంటున్నట్లున్నారు. ఆల్ ది బెస్ట్ రకుల్.