సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది.
సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment