Lakh
-
మన వెయ్యి రూపాయలు.. అక్కడ లక్షపైమాటే!
మనం డాలర్‌తో భారత రూపాయిని పోల్చి చూసినప్పుడు మన కరెన్సీ విలువ చాలా తక్కువనిపిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో భారత కరెన్సీకి అత్యధిక విలువ ఉంది. ఆ దేశానికి మనం మన వెయ్యి రూపాయలు తీసుకెళ్తే, అది అక్కడ లక్షలకు సమానమవుతుంది. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇదే వాస్తవం. వియత్నాం.. సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి, ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వియత్నాంలో ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్. అంటే ఆ దేశానికి మనం వెయ్యి రూపాయలు తీసుకువెళితే, అది అక్కడ 2,91,000 వియత్నామీస్ డాంగ్ అవుతుంది. వియత్నాం వెళ్లడానికి ఏదోఒక ప్రత్యేక సీజన్ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఏ సీజన్లోనైనా వియత్నాంను సందర్శించవచ్చు. అయితే చాలా మంది పర్యాటకులు డిసెంబర్-జనవరి మధ్య ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో అక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. వియత్నాంలొని హాలాంగ్ బే ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని ‘బే ఆఫ్ డిస్కవరింగ్ డ్రాగన్స్’ అని కూడా అంటారు. 1994లో యునెస్కో ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది. వియత్నాం రాజధాని హనోయి కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఈ నగరానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. వియత్నాం ఉత్తర భాగంలో ఉన్న హువా గియాంగ్ కూడా పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందింది. ఇది కూడా చదవండి: యమునలో కరసేవకులకు పిండ ప్రధానం -
ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై!
దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్ వెండర్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్‌లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్‌ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్ భాయ్ అనే ఈ స్ట్రీట్ వెండర్ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్, మిక్స్ వెజ్ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఫిట్నెస్ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్కు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్ మొదలైనవాటితో టాపింగ్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్ ధర 1,320. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి? 450g butter, 31 whole eggs, 50g cheese, 100g seekh kebab and 200g paneer. Approximately 3,575 mg of cholesterol in total. Nahi chahiye bhai tere 1 lakh. 👍🏻 pic.twitter.com/wfhayx7UGn — Chirag Barjatya (@chiragbarjatyaa) October 10, 2023 -
భారత్‌లో స్టార్టప్ కంపెనీల సరికొత్త రికార్డ్! ఏకంగా..
భారత్‌లో పారిశ్రామిక చైతన్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు స్థాపించి తమకు చేతనైనంత మందికి ఉపాధి కల్పించాలన్న స్పృహ యువతలో బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలను అవలంభిస్తోంది. ఫలితంగా దీంతో దేశంలో స్టార్టప్ కంపెనీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 450 ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) భారతదేశంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా దేశంలో బిజినెస్ ప్రారంభించడం, నిర్వహించాడాన్ని సులభతరం చేసినట్లు వివరించారు. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
ఒక్క రూపాయి 20 లక్షల మంది రైతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు. రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్‌గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అమానవీయం: రూ.4 లక్షల కోసం శిశువును కన్న తల్లే..
కోల్‌కతా: కోల్‌కతాలో తల్లితనానికి మచ్చ తెచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి రూ.4 లక్షల కోసం తన 21 రోజుల శిశువును అమ్మేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పసిపాపను శిశు సంరక్షణ గృహానికి తరలించారు. కోల్‌కతాలోని నోనడంగ్ ప్రాంతంలోని రైలు కాలనీలో రుపాలీ మండల్ నివసిస్తోంది. తనకు ఇటీవలే ఓ శిశువు జన్మించింది. తన శిశువును కనీసం నెలయినా గడవక ముందే డబ్బుల కోసం ఓ మహిళకు అమ్మేసింది. ఈ విషయాన్ని రూపాలీ పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలు రూపా దాస్, స్వప్న సర్ధార్‌ను అరెస్టు చేశారు. మిడ్నాపూర్‌కు చెందిన కళ్యాణి గుహాకు పెళ్లై 15 ఏళ్లు గడిచినా పిల్లలు లేరు. దీంతో రూపా దాస్, స్వప్న సర్ధార్‌ల సహకారంతో శిశువును కొనాలని పతకం పన్నింది. ఈ వ్యవహారంలో కళ్యాణి గుహాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి శిశువును స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ గృహానికి తరలించారు. ఇదీ చదవండి: Delhi Payroll Cheating: కంపెనీ హెచ్ఆర్ నిర్వాకం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..! -
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
పీఎం ముద్రా లోన్ కింద లక్ష రూపాయల రుణమా? నిజమా?
సాక్షి, ముంబై: సోషల్‌మీడియా వచ్చిన తరువాత అబద్దాలు, తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్ విస్తరణ బాగా పెరిగింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ నిజానిజాలను ఫ్యాక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా ముద్రా లోన్ స్కీం కింద లక్ష రూపాయల రుణం వస్తోందంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గురించిన లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీని ప్రకారం లోన్ అగ్రిమెంట్ ఫీజులో రూ. 1,750కి బదులుగా రూ. 1,00,000 రుణం అందింస్తోంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చినదని, ఎన్ఆర్ఐ ఫండింగ్ స్కీమ్ కింద వడ్డీ రేటు 5 శాతం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు పాక్షిక చెల్లింపులకు ఎటువంటి రుసుము ఉండదంటూ ఒక నకిలీ లేఖ వైరల్ అయింది. An approval letter claims to grant a loan of ₹1,00,000 under the 𝐏𝐌 𝐌𝐮𝐝𝐫𝐚 𝐘𝐨𝐣𝐚𝐧𝐚 on payment of ₹1,750 as loan agreement charges #PIBFactCheck ◾️This letter is #Fake. ◾️@FinMinIndia has not issued this letter. Read more: 🔗https://t.co/cQ5DW69qkT pic.twitter.com/jKXEKbYupe — PIB Fact Check (@PIBFactCheck) January 30, 2023 అయితే ఈ లేఖను ఫ్యాక్ట్ చెక్ చేసి, పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి సాయాన్ని దేన్నీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను జారీ చేయ లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నకీలీదంటూ ట్వీట్ చేసింది. -
గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా
ఇంటి ముందర తలుపులకు ఎలాంటి కలర్లు ఉండాలో కొన్ని దేశాల్లో షరతులు ఉంటాయి. ఆయా దేశాల్లో ఏ కలర్ పడితే అది వేస్తే అక్కడ అధికారులు అంగీకరించారు. ఐతే ఒక మహిళ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి ముందర తలుపులకు తనకు నచ్చిన రంగు వేసింది. దీంతో సదరు కౌన్సిల్ అధికారులు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తూ సుమారు 19 లక్షలు జరిమానా విధించారు. ఈ వింత ఘటన స్కాట్లాండ్లో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న మిరాండా డిక్సన్ అనే మహిళ తన ఇంటి ముందర తలుపులకు పింక్(గులాబీ) కలర్ వేసింది. దీంతో ఆ సిటీ కౌన్సిల్ ప్లానర్లు ఈ కలర్‌పై అభ్యంతరరం వ్యక్తం చేస్తూ... తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. కానీ ఆ మహిళ మాత్రం తన ఇంటికి ఆ రంగు ఎంతో అందాన్ని ఇచ్చిందని, చూడముచ్చటగా ఉందని చెబుతోంది. ఆమెకు ఈ ఇల్లు 2019లో తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది. ఈ ఇంటిని రెండేళ్లపాటు మరమత్తులు చేయించింది. ఐతే చివర్లో ఫినిషింగ్ టచ్‌గా ఇంటి ముందు ఉండే తలుపులకు మాత్రం గూలాబి రంగు వేసింది. యూకేలోని బ్రిస్టల్, నాటింగ్‌హిల్, హారోగేట్ వంటి నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉంటే నా ఇంటి ముఖ ద్వారం మాత్రం ఇలా భిన్నంగా గులాబీ రంగులో ఉండటం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతోంది. అదీగాక చాలామంది తన ఇంటి ముందు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారని, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని అంటోంది. అంతేగాదు పలువురు తనకు మద్దతు తెలిపారని, ఈ రంగు చాలా బావుటుందంటూ సిటీ కౌన్సలర్లకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ కౌన్సలర్ ప్లానర్లు మాత్రం ససేమిరా అంటూ తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. అంతేగాదు ఒకవేళ తలుపులకు రంగు మార్చనట్లయితే సుమారు రూ. 19 లక్షల వరుకు జరిమాన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెగేసి చెప్పారు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
రూ.లక్షలోపు మోసాలపై పోలీసు కేసులొద్దు
బ్యాంకులకు సీవీసీ ఆదేశం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.లక్షలోపు మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కోరింది. బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటే తప్పిస్తే దానిపై పోలీసులను ఆశ్రయించనవసరం లేదని స్పష్టం చేసింది. రూ.10,000కు పైన రూ.లక్షలోపు విలువగల మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న నిబంధన ఇప్పటి వరకు అమల్లో ఉంది. అయితే, ఈ కేసులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఆర్బీఐతో సంప్రదించిన అనంతరం సీవీసీ తాజా నిర్ణయం తీసుకుంది. రూ.10,000కుపైన రూ.లక్షలోపు మోసాల్లో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటే మాత్రం వాటిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన ఆదేశాల్లో సీవీసీ పేర్కొంది. -
దీనస్థితిలో..
పొట్టకూటి కోసం వెళ్లి.. ఎడారి దేశంలో బందీగా మారిన యానాం మహిళ విజిటింగ్ వీసాతో దుబాయ్‌కు పంపి మోసగించిన ఏజెంట్ రూ.లక్ష చెల్లిస్తేనే దేశానికి పంపుతామంటున్న గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ప్రభుత్వ చేయూతకు ఎదురుచూపులు ఉపాధి కోసం ఎడాది దేశానికి వెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలుద్దామనుకున్న మహిళలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గల్ఫ్ దేశాలకు పంపే ఏజెంట్ వారిద్దరికీ విజిటింగ్ వీసాలు ఇచ్చి మోసగించడంతో దేశంకాని దేశంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. - యానాం గత ఏడాది ఏప్రిల్ 9న దరియాలతిప్పకు చెందిన చెక్కా గౌరి, అదే విధంగా ఏప్రిల్ 28న సంగాడి దీన అనే ఇద్దరు మత్స్యకార మహిళలను అదే ప్రాంతానికి చెందిన ఏజెంట్ వాతాడి సత్యనారాయణ అనే వ్యక్తి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20వేలు చొప్పున తీసుకుని ఉద్యోగవీసా అని చెప్పి విజిటింగ్ వీసా ద్వారా దుబాయ్‌కు పంపాడు. అయితే వీరు దుబాయ్‌లో దిగిన తరువాత అధికారులు తనిఖీచేయడంతో విజిటింగ్ వీసా అని తేలింది. నెలరోజులు మాత్రమే గడువు ఉంటుందని వారు చెప్పారు. అయితే వీరిని యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని అజ్మాన్ అనే ప్రాంతంలోని అల్వాసెట్ అనే లేబర్ రిక్రూట్మెంట్ కార్యాలయానికి పంపారు. వీరిని ఎవరైనా వచ్చి పనిలో చేర్చుకుంటారనే ఆశతో ఆ కార్యాలయంలోనే కొన్నిరోజులుగా ఉంటున్నారు. అయితే బాధిత మహిళలను సంబంధిత రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధికారులు ఒక గదిలో బంధించారు. వీరిని తిరిగి భారతదేశానికి పంపాలంటే రూ.1.50 లక్షలు కట్టాల్సి ఉంటుందని దుబాయ్‌కు చెందిన లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భాదిత మహిళల కుటుంబసభ్యులు ఏంచేయాలో తెలియక రూ.50వేలను పంపడంతో ఇటీవలి చెక్కా గౌరి 28రోజుల పాటు నరక యాతన అనుభవించి క్షేమంగా ఇంటికి చేరుకుంది. రూ.లక్ష.. 15 రోజుల్లో పంపాలి.. రెండో మహిళ దీనను పంపాలంటే రూ.లక్షను 15 రోజుల్లో పంపాలని, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు జైలులో పెడతారని అధికారులు చెబుతున్నారని ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారి ఏజెంట్ సత్యనారాయణ మాత్రం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికంతో ఉంటున్న తాము అంత సొమ్ము ఏవిధంగా సంపాదించాలో అర్థంకావడం లేదనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దుబాయ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి దీనను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు దుబాయ్‌కు విజిటింగ్ వీసాపై పంపిన ఏజెంట్ వాతాడి సత్యనారాయణపై బాధితుల కుటుంబసభ్యులు దరియాలతిప్ప పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కనకారావుకు ఫిర్యాదు చేశారు. ఆ దేశంలో నరకమే తాను వెళ్లిన దుబాయ్‌లోని రిక్రూట్మెంట్ ఏజెన్సీలో వందలాది మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లిన మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏదైనా అడగాలంటే భాషరాని పరిస్థితి. తినడానికి తిండిలేదు. ఒక్కోసారి నాపై దాడి చేసేవారు. నా కుటుంబ సభ్యులు డబ్బులు కట్టడమే కాకుండా విమాన టికెట్ కూడా పంపారు. అందుకే నేను రాగలిగాను. పాపం డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటి? వారు అక్కడే నరకం చూస్తున్నారు. చెక్కా గౌరి, దరియాలతిప్ప -
రూ.లక్షలు పలికిన లడ్డూలు
దేవరకొండ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు మండపాల వద్ద పూజలందుకున్న గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. దీంతో వివిధ మండపాల వద్ద బుధవారం ఉత్సవ కమిటీల నిర్వాహకులు లడ్డూల వేలం పాటలు నిర్వహించారు. పట్టణంలో కొండల్రావునగర్లో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద ఉన్న లడ్డూను పట్టణానికి చెందిన నేనావత్ కిషన్‌నాయక్ లక్షా 25వేల 116 రూపాయలకు వేలం పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా పట్టణంలోని పాత రామాలయం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పట్టణానికి చెందిన ఏలె యాదయ్య లక్షా 16వేల రూపాయలకు దక్కించుకున్నాడు. అలాగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద లడ్డూను పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పంగునూరి శేఖర్ లక్షా 2వేల 116 రూపాయలకు దక్కించుకున్నాడు. హనుమాన్‌నగర్‌లో లడ్డూను శ్రీనివాసాచారి రూ.55వేలకు దక్కించుకున్నాడు. -
లక్ష విలువైన సామగ్రి అందజేత
బంగారిగడ్డ(చండూరు): మండల పరిధిలోని బంగారిగడ్డ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఇడికూడ శ్రీనా«ద్, మేకల విజయ్ కుమార్‌లు లక్ష విలువ గల బెంచీలు, కంప్యూటర్, గ్రంథాలయ పుస్తకాలను ఆ పాఠశాల హెచ్ఎం పాలకూరి సత్తయ్య గౌడ్‌కు సోమవారం అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు బోయపల్లి జంగయ్య, ఎంపీటీసీ శోభ, మాజీ సర్పంచు బోయపల్లి భిక్షమయ్య, లయన్స్‌క్లబ్ జోన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఒకేరోజు లక్ష మెుక్కలు..
మిర్యాలగూడ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో మహా హరితహారం నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. పట్టణంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అన్ని కాలనీలలో ఉదయం 11 గంటల ఒకేసారి ఉద్యమంలా హరితహారం కార్యక్రమం నిర్వహించడానికి వారం రోజుల క్రితమే గుంతలు తీయడంతోపాటు మొక్కలు పంపిణీ చేశారు. అంతే కాకుండా మున్సిపాలిటీ నుంచి మెప్మా ఆధ్వర్యంలో ప్రచారం సైతం నిర్వహించారు. ఉదయం 10:30 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరు కానున్నారు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై వై జంక్షన్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహల వద్ద, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం వద్ద, తెలంగాణ అమరవీరు ల స్థూపం వద్ద మొక్క లు నాటనున్నారు. ఇండోర్ స్టేడియం ప్రారంభం స్థానిక ఎన్ఎస్పీ క్యాం పులో నిర్మాణం పూర్తయిన ఇండోర్ స్టేడియా న్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. స్టేడియం నిర్మాణానికి గాను సహకరించిన దాతలు అనిరెడ్డి వీరారెడ్డి, సమ్మిడి వీరారెడ్డిలను మంత్రి సన్మానిస్తారు. ఉదయం 11గంటలకు బహిరంగసభ హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం అనంతర స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో ఉదయం 11:30 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. బహిరంసభకు అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు. -
25 లక్షలమంది వికలాంగులకు శిక్షణ
న్యూ ఢిల్లీ: వచ్చే ఏడేళ్ళలో 25లక్షల మంది వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం సమైక్యతకు, సమానత్వానికి ఎంతో విలువనిస్తుందని, వసుధైక కుటుంబం అంటూ ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావించడం మనదేశ సిద్ధాంతమని ఆయన అన్నారు. అదే సిద్ధాంతం మన చుట్టుపక్కల వాతావరణానికి, జీవితాలకు అన్వయిస్తుందన్నారు. భారతదేశ జనాభాలో వికలాంగులు సింహభాగం ఉన్నారని, వారికి అర్థవంతమైన ఉపాధి మార్గాలను కల్పించడం అవసరమని మోదీ తెలిపారు. వచ్చే ఏడేళ్ళలో వైకల్యాలున్న 25 లక్షల మందికి ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్లు నైంత్ వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ డిజయబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్ (డీపీఐ) సందర్భంలో మోదీ ఓ సందేశాన్నిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ఈ అంశం మోదీ వ్యక్తిగత ఆసక్తిని కనబరచిందని సామాజిక న్యాయం, సాధికారత శాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలతోపాటు మొత్తం 70 దేశాలనుంచి 200 మందికి పైగా వైకల్యాలున్న వారు హాజరౌతున్నట్లు 150 దేశాల్లో సభ్యత్వం ఉన్న వికలాంగుల మానవ హక్కుల సంస్థ తెలిపింది. -
రూ.లక్ష తిరిగిచ్చారు
సిరిసిల్ల : బ్యాంకులో డ్రా చేసిన డబ్బులకంటే ఎక్కువగా వచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు మహిళలు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సాయి స్లమ్ సమాఖ్యలోని శ్రీసాయి మహిళా సంఘం సభ్యులు సోమవారం సిరిసిల్ల ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.4 లక్షలు రుణంగా తీసుకున్నారు. క్యాషియర్ లెక్క చూసుకోకుండా వీరికి రూ.5 లక్షలు చెల్లించారు. ఇంటికి చేరిన మహిళలు డ బ్బులు లెక్కించగా, ఒక లక్ష ఎక్కువగా ఉండడంతో నిజాయతీగా బ్యాంకుకు తిరిగి చెల్లించి శభాష్ అనిపించుకున్నారు. డబ్బులు తిరిగి ఇచ్చిన మహిళా సంఘం రిసోర్సు పర్సన్ గాజుల వీణ, బూర్ల రేవతిని బ్యాంకు అధికారులు శభాష్ అని అభినందించారు.