రూ.లక్షలు పలికిన లడ్డూలు
రూ.లక్షలు పలికిన లడ్డూలు
Published Wed, Sep 14 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
దేవరకొండ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు మండపాల వద్ద పూజలందుకున్న గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. దీంతో వివిధ మండపాల వద్ద బుధవారం ఉత్సవ కమిటీల నిర్వాహకులు లడ్డూల వేలం పాటలు నిర్వహించారు. పట్టణంలో కొండల్‌రావునగర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద ఉన్న లడ్డూను పట్టణానికి చెందిన నేనావత్ కిషన్‌నాయక్ లక్షా 25వేల 116 రూపాయలకు వేలం పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా పట్టణంలోని పాత రామాలయం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పట్టణానికి చెందిన ఏలె యాదయ్య లక్షా 16వేల రూపాయలకు దక్కించుకున్నాడు. అలాగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద లడ్డూను పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పంగునూరి శేఖర్ లక్షా 2వేల 116 రూపాయలకు దక్కించుకున్నాడు. హనుమాన్‌నగర్‌లో లడ్డూను శ్రీనివాసాచారి రూ.55వేలకు దక్కించుకున్నాడు.
Advertisement