ఒకేరోజు లక్ష మెుక్కలు..
Published Thu, Jul 28 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
మిర్యాలగూడ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో మహా హరితహారం నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. పట్టణంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అన్ని కాలనీలలో ఉదయం 11 గంటల ఒకేసారి ఉద్యమంలా హరితహారం కార్యక్రమం నిర్వహించడానికి వారం రోజుల క్రితమే గుంతలు తీయడంతోపాటు మొక్కలు పంపిణీ చేశారు. అంతే కాకుండా మున్సిపాలిటీ నుంచి మెప్మా ఆధ్వర్యంలో ప్రచారం సైతం నిర్వహించారు. ఉదయం 10:30 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరు కానున్నారు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై వై జంక్షన్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహల వద్ద, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం వద్ద, తెలంగాణ అమరవీరు ల స్థూపం వద్ద మొక్క లు నాటనున్నారు.
ఇండోర్ స్టేడియం ప్రారంభం
స్థానిక ఎన్‌ఎస్‌పీ క్యాం పులో నిర్మాణం పూర్తయిన ఇండోర్ స్టేడియా న్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. స్టేడియం నిర్మాణానికి గాను సహకరించిన దాతలు అనిరెడ్డి వీరారెడ్డి, సమ్మిడి వీరారెడ్డిలను మంత్రి సన్మానిస్తారు.
ఉదయం 11గంటలకు బహిరంగసభ
హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం అనంతర స్థానిక ఎన్‌ఎస్‌పీ క్యాంపులో ఉదయం 11:30 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. బహిరంసభకు అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు.
Advertisement