ఈ ఆమ్లెట్‌ తింటే లక్ష.. కండీషన్స్‌ అప్లై! | Delhi vendor will give you Rs 1 lakh if you finish this 31 egg omelette | Sakshi
Sakshi News home page

ఈ ఆమ్లెట్‌ తింటే లక్ష.. కండీషన్స్‌ అప్లై!

Published Thu, Oct 12 2023 12:16 PM | Last Updated on Thu, Oct 12 2023 12:25 PM

Omelette Vendor will Give you a Reward of Rs 1 Lakh - Sakshi

దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్‌ వెండర్‌ ఆమ్లెట్‌ ఛాలెంజ్‌ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్‌లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు.

తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్‌ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్‌ భాయ్‌ అనే ఈ స్ట్రీట్‌ వెండర్‌ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్‌, మిక్స్‌ వెజ్‌ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్‌ తయారు చేస్తున్నాడు. 

ఫిట్‌నెస్‌ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్‌కు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్‌ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్‌ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్‌ మొదలైనవాటితో టాపింగ్‌ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్‌ ధర 1,320. 

వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్‌ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. 
ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement