
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: కోల్‌కతాలో తల్లితనానికి మచ్చ తెచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి రూ.4 లక్షల కోసం తన 21 రోజుల శిశువును అమ్మేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పసిపాపను శిశు సంరక్షణ గృహానికి తరలించారు.
కోల్‌కతాలోని నోనడంగ్ ప్రాంతంలోని రైలు కాలనీలో రుపాలీ మండల్ నివసిస్తోంది. తనకు ఇటీవలే ఓ శిశువు జన్మించింది. తన శిశువును కనీసం నెలయినా గడవక ముందే డబ్బుల కోసం ఓ మహిళకు అమ్మేసింది. ఈ విషయాన్ని రూపాలీ పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలు రూపా దాస్, స్వప్న సర్ధార్‌ను అరెస్టు చేశారు.
మిడ్నాపూర్‌కు చెందిన కళ్యాణి గుహాకు పెళ్లై 15 ఏళ్లు గడిచినా పిల్లలు లేరు. దీంతో రూపా దాస్, స్వప్న సర్ధార్‌ల సహకారంతో శిశువును కొనాలని పతకం పన్నింది. ఈ వ్యవహారంలో కళ్యాణి గుహాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి శిశువును స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ గృహానికి తరలించారు.
ఇదీ చదవండి: Delhi Payroll Cheating: కంపెనీ హెచ్ఆర్ నిర్వాకం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..!
Comments
Please login to add a commentAdd a comment