బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణకు నేడు ఎంట్రన్స్ | civils training entrance today | Sakshi
Sakshi News home page

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణకు నేడు ఎంట్రన్స్

Published Sun, Nov 16 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

civils training entrance today

సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రాల (బీసీ స్టడీసర్కిళ్ల) ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ కోసం  ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే ఈ ప్రవేశపరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్)ను నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ (60 సీట్లు), కరీంనగర్ (40 సీట్లు), వరంగల్ (40 సీట్లు)  బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉచితంగా శిక్షణనిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 2,600 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ ఆలోక్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement