ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్‌ఏ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీసర్కిల్ సెంటర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సర్కిల్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్, స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. వివరాలకు ఏలూరు సెయింట్ ఆన్స్ కళాశాల సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట ఉన్న బీసీ స్టడీ సెంటర్‌లో గాని, 08812 232477 నంబర్‌లోగాని సంప్రదించాలని మల్లికార్జునరావు సూచించారు.
వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Published Wed, Jan 1 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement