free training
-
Rambabu Muppidi: జ్యూట్ బ్యాగులపైన భారతీయ కళ
కళాకారులు మనదైన ఆత్మను కళ ద్వారా జీవం పోస్తారు. ఆ కళను నలుగురికి పరిచయం చేయడమే కాకుండా దానిని ఉపాధి వనరుగా మార్చి మరికొంత మందికి చేయూతగా నిలుస్తున్నారు డాక్టర్ ముప్పిడి రాంబాబు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉంటున్న ఈ కళాకారుడు ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరేళ్లుగా మహిళలకు, యువతకు జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళలకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా భారతీయ కళను జ్యూట్ బ్యాగుల మీదకు ఏ విధంగా తీసుకువస్తున్నారో తెలియజేశారు.‘‘జ్యూట్ బ్యాగుల తయారీ సాధారణమే కదా అనుకుంటారు. కానీ, ఇండియన్ ఆర్ట్ మోటిఫ్స్ కలంకారీ, చేర్యాల, వర్లీ, గోండు, పటచిత్ర, మధుబని... డిజైన్స్‌ను ఉపయోగిస్తూ, స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా జ్యూట్ మీదకు తీసుకువస్తున్నాం. దీని ద్వారా జ్యూట్కి కొత్త కళ వస్తుంది. అలాగే, మొన్నటి ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని రైతు పొలం పనులకు వెళ్లే డిజైన్ని తీసుకువచ్చాను. ఈ కళ ద్వారా పర్యావరణ హితం, మనదైన ఆత్మను పరిచయం చేస్తున్నాం.ఉపాధికి మార్గంకరీంనగర్, ఏలూరు, జంగారెడ్డి గూడెం, పార్వతీ పురం, బొబ్బలి.. మొదలైన ప్రాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వచ్చాను. నేషనల్ జ్యూట్ బోర్డ్ వాళ్లునన్ను సర్టిఫైడ్ డిజైనర్‌గా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ స్కిల్ క్రాఫ్ట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రస్తుతం మన్యం జిల్లా పార్వతీపురంలో 24 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పటికే బ్యాగుల తయారీ నేర్చుకున్నవారు, సొంతంగా ఉపాధి మార్గాలను పొందుతున్నారు. ఈ స్కిల్ ప్రోగ్రామ్‌లో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నవారు ఉన్నారు. బ్యాగులే కాకుండా పాదరక్షలు, లెదర్ బ్యాగులు, వైర్లతో చెయిర్లు, ఇతర యాక్సెసరీస్ తయారుచేస్తుంటాను. వీటితో కంప్యూటర్ ఆధారిత త్రీడీ సాఫ్ట్వేర్ డిజైన్లు కూడా ΄్లాన్ చేస్తుంటాను.కళాకారులను కలిసి...మా ఊరు పశ్చిమగోదావరి దగ్గరిలోని జంగారెడ్డి గూడెం. సినిమా నటుల బ్యానర్లను సృజనాత్మకంగా తయారు చేసి, అందించిన కుటుంబం మాది. నాకున్న పెయింటింగ్ ఆసక్తిని మా అన్నయ్య శ్రీనిసవాసరావు గుర్తించాడు. దీంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన పూర్తి దృష్టి పెట్టాను. ముంబయ్ నిప్ట్ నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ చేశాను. స్కూల్ చదువు నుంచి డాక్టరేట్ చేసేవరకు మా అన్నయ్యప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్‌డిఐలో ఉద్యోగం చేస్తున్నాను. సాంకేతికంగానూ భారతీయ కళను క్రాఫ్ట్ తయారీలో ఎలా మేళవించవచ్చో పరిశోధన, ్రపాక్టీస్ చేస్తుంటాను. రాబోయే తరాల కోసం క్రాఫ్ట్స్‌ని డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హస్తకళాకారులను నేరుగా కలుసుకొని చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నాను. నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో మన కళ, కళాకారుల ప్రత్యేకతను తెలియ జేయడం అదృష్టంగా భావిస్తాను. ఏటి కొ΄్పాక కొయ్యబొమ్మల కళాకారులతో కలిసి, బొమ్మల తయారీ నేర్చుకున్నాను. నేను తయారు చేసిన కొయ్య బొమ్మలకు డిజైన్లకు, పేపర్ బాస్కెట్ డిజైన్స్‌కి పేటెంట్ హక్కులు ΄పొందాను. కళను భవిష్యత్తు తరాలు గుర్తించేలా మరింత సృజనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని.. దీని ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాను’ అని చె΄్పారు రాంబాబు. ఈ కళాకారుడు తన పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
టెక్కీలకు గుడ్‌న్యూస్: ఏఐలో ఉచిత సర్టిఫికేషన్.. డేటా సైన్స్ కోర్సు కూడా..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంపై కృత్రిమ మేథలో (ఏఐ) సర్టిఫికేషన్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఏఐ, జెనరేటివ్ ఏఐలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇందులో కోర్సులు ఉంటాయి. అలాగే, పైథాన్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జీబ్రా సహా డేటా సైన్స్‌కి సంబంధించిన వివిధ అంశాలతో సిటిజెన్స్ డేటా సైన్స్ కోర్సు కూడా ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సరి్టఫికెట్ లభిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ–ఫస్ట్ స్పెషలిస్టులు, డేటా స్ట్రాటెజిస్టులు ఈ బోధనాంశాలను రూపొందించారు. -
కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ దారితప్పింది. గ్రూప్–3, గ్రూప్–4 కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు లోపభూయిష్టంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్–3, గ్రూప్–4 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేటు శిక్షణ సంస్థలను ఎంపిక చేసి తరగతుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.5500 చొప్పున ఫీజు నిర్దేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50 శిక్షణ తరగతులకు ప్రైవేటు సెంటర్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించింది. మూడు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ శిక్షణ తరగతులు పలుచోట్ల నామమాత్రంగా సాగగా... కొన్నిచోట్ల అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎంపిక ప్రక్రియలో నిబంధనలు గాలికి... రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల తెరిచిన సెంటర్లకు ఏడు సంస్థలను బీసీ స్టడీ సర్కిల్ ఎంపిక చేసింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 సెంటర్ల బాధ్యతలు అప్పగించగా... మిగతా 30 సెంటర్ల నిర్వహణను మిగిలిన ఆరు సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సంస్థను ఎంపిక చేసేటప్పుడు ఆ సంస్థ నేపథ్యం, అనుభవం, సామర్ధ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా అభ్యర్థుల పెంపు... ఒక్కో బీసీ స్టడీ సెంటర్లో గ్రూప్–3, గ్రూప్–4 శిక్షణ తరగతుల కోసం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. మొత్తంగా 5వేల మందికి శిక్షణ ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెప్టెంబర్ 15 నాటికి తరగతులు ప్రారంభించి డిసెంబర్ 15కల్లా ముగించేలా కార్యాచరణ రూపొందించింది. కానీ చాలా కేంద్రాల్లో నిర్దేశించిన అభ్యర్థుల సంఖ్య కంటే సగం, అంతకంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నమోదయ్యారు. దీంతో గిట్టుబాటు కాదనుకున్న ప్రైవేటు సంస్థలు అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల సంఖ్య పెంపునకు అవకాశం కోరగా... తరగతులు ప్రారంభమైన నెలరోజుల తర్వాత అవకాశం కల్పిస్తూ బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ స్టడీ సెంటర్లుగా ఎంపిక చేసిన భవనాలన్నీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలే కావడంతో... ఏకంగా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులను సైతం చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల కాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రయోజనకరం కాకున్నా అవకాశం కల్పించడం వివాదాలకు తావిస్తోంది. సెంటర్ల నిర్వహణపై ఫిర్యాదుల వెల్లువ... బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై పలుచోట్ల అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడ్డగోలు నిర్వహణతో విలువైన సమయాన్ని వృథా చేశారంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు ఏకంగా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇరవై రోజుల్లో మూసేశారు... బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అంటే మరో ఆలోచన లేకుండా అడ్మిషన్ తీసుకున్నాను. కానీ కేవలం ఇరవై రోజుల్లో స్టడీ సెంటర్‌ను మూసేశారు. 25 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదు. మరోవైపు గ్రూప్–4 నోటిఫికేషన్ రాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వస్తుందని సమాచారం. ఇంతటి కీలక సమయంలో సెంటర్ మూసివేయడంతో మరో చోట కోచింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వకపోవడంతో ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు. వెంటనే స్టడీ సెంటర్‌ను తెరిచి శిక్షణ తరగతులు నిర్వహించాలి. – ప్రసాద్, వికారాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థి నిరుద్యోగుల జీవితాలతో ఆటలా... ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనడంతో ఎంతో నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు బీసీ స్టడీ సెంటర్లలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ప్రైవేటు సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడం... పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకుండా మధ్యలోనే చేతులెత్తేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. – ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలు నిబంధనల ప్రకారమే శిక్షణ సంస్థలకు బాధ్యతలు అప్పగించాం. స్టడీ సెంటర్ నిర్వహణ, వసతులన్నీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టగా... ఫ్యాకల్టీ, మాక్ టెస్టులు మాత్రం ప్రైవేటు కేంద్రానికి అప్పగించాం. తక్కువ కాల వ్యవధి శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి వారికి వేతనాలు ఇవ్వడం పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – అలోక్ కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్ -
గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
‘ఒక్క బాల్‌తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు. ‘ఫుట్‌బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్‌లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్‌బాల్ వల్ల గ్రౌండ్లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు... రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో చబియావాస్, హిసియావాస్లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు. కొంతకాలం తరువాత... నిషా ఊళ్లోని ఫుట్‌బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు. మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు... ‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ. ఇంత మార్పు ఎలా వచ్చింది? నీరజ మాటల్లో చెప్పాలంటే... ‘ఫుట్‌బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’ ఫుట్‌బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది. ‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్‌వేర్‌లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న. ‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్‌బాల్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్‌బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి. -
Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం
ఆ కేఫ్ వేడివేడి చాయ్‌లకు మాత్రమే ఫేమస్ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్ హ్యాంగవుట్ కేఫ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది... ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ కేవలం రుచుల కేఫ్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్ ఎటాక్ సర్వైవర్స్ ఈ కేఫ్‌ను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ బ్యూటీ చైన్ సెలూన్ ‘నెచురల్స్’తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్. ఒకప్పుడు ఆమెకు మేకప్ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్. 28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్ ఉన్న నెయిల్ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. ‘యాసిడ్ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్ బాధితురాలైన నేను మేకప్ వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని. ఘాజిపూర్కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్–ఆర్టిస్ట్ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆమె రంగుల కల నల్లగా మసక బారింది. ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్ చిత్రపటం తప్ప మరేది కనిపించేది కాదు. దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే! ‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్‌తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్–ఆర్టిస్ట్‌గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి. శ్రేయాస్ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది. -
త్వరలోనే పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు రాచ కొండ పోలీస్ కమిషనరేట్ తరుఫున ప్రీ రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణను ప్రారంభించ నున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించాలన్నారు. గురువారం ఆయన అంబర్‌పేటలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో డాగ్స్ కెన్నెల్, మెటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసుల పాత్ర కీలకమైనదని, వారి సంక్షేమమే తొలి ప్రాధాన్యమన్నారు. పీఎస్ఓ డ్యూటీలు, బందోబస్త్, వీఐపీ సెక్యూరిటీ తదితర అంతర్గత భద్రతలో వీరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధతతతో ఉంటూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏఆర్ విభాగంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు చేరడం అభినందనీయమన్నారు. వివిధ విభాగాల్లో మహిళా సిబ్బంది తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు తగిన సహకారాన్ని అందిస్తామని, త్వరలోనే మహిళా పెట్రోలింగ్ బృందాలను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు. అనంతరం 15 రోజులుగా కొనసాగతున్న వార్షిక డీ–మొబిలైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు, డీసీపీ క్రైమ్స్ యాదగిరి, డీసీపీలు సన్‌ప్రీత్ సింగ్, రక్షిత కే మూర్తి, సలీమా, అడిషనల్ డీసీపీలు ఎం శ్రీనివాస్, షమీర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి
నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. చెల్లిని తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది డుజోమ్. అక్కాచెల్లెళ్లు టీనేజ్ లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్నా తల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియెట్ అవగానే రాజధాని ఇటానగర్ వెళ్లిపోయింది. అదే ఆమె జీవితానికి మలుపయింది. ఇప్పుడామె ‘పికిల్ క్వీన్’! పచ్చళ్ల సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారి లోకి రానివ్వరు. కానీ డుజోమ్.. నిరుపేద గృహిణుల స్వయం సమృద్ధి కోసం వారికి పచ్చళ్ల మేకింగ్‌లో, మార్కెటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. యదే డుజోమ్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అమ్మమ్మ చనిపోవడంతో డుజోమ్, ఆమె చెల్లెలు మళ్లీ తండ్రి చెంతకే వారు చేరవలసి వచ్చింది. తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో! ఇంకో ‘అమ్మ’ కూడా ఉంది. తనను, చెల్లిని ఆమె ఎంత హింసపెట్టిందో డుజోమ్ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డుజోమ్ ఇప్పుడు పచ్చళ్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ‘అరుణాచల్ పికిల్ హౌస్’ అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో పెద్ద పేరు. అయితే పికిల్ హౌస్ ప్రారంభం రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపే రాలేదు! ‘పికిల్ క్వీన్’గా ప్రసిద్ధి చెందిన డుజోమ్ తన వ్యాపారం గురించి మాత్రమే చూసుకోవడం లేదు. ఆర్థికంగా అసహాయులైన గృహిణులనూ చూసుకుంటోంది. వారిని చేరదీసి పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇస్తోంది. పచ్చళ్ల మార్కెటింగ్ గురించి టిప్స్ ఇస్తోంది. అలా ఇటానగర్‌లోని ఎందరో గృహిణులను గ్రూపులుగా చేసి, ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తోంది. అసలు ఇదంతా ఆమెకు ఎలా చేతనైనట్లు?! ‘‘జీవితంలో కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ నిరాశ చెందకూడదు’’ అంటుంది డుజోమ్. డుజోమ్కు ఇప్పుడు 29 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ‘అరుణాచల్ పికిల్ హౌస్’ను ప్రారంభించింది. ఈ నాలుగు నెలల్లో పికిల్ క్వీన్ అయింది! ∙∙ పినతల్లి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ పన్నెండేళ్లలో నెలకింతని డబ్బును దాచిపెట్టగలిగింది డుజోమ్. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. లేబుల్ మేకింగ్ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపుర్ వెళ్లిప్పుడు అక్కడ కొంతమంది మహిళల నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్‌ప్రదేశ్ తిరిగొచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతులలో శాస్త్రీయంగా శిక్షణ పొందింది. ఆ క్రమంలో పికిల్ హౌస్ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఆమెకు చేదోడుగా ఉన్నారు. వారంతా గృహిణులు. లేమిలో, కుటుంబ సమస్యల కుంగుబాటులో ఉన్నవారు. వారిని పెట్టుబడి లేని భాగస్వాములుగా చేర్చుకుంది. అమ్మకాల వల్ల వస్తున్న లాభాలను వారికి పంచుతోంది. వ్యాపారాన్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ఉంది. డుజోమ్ తనకు తానుగా వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లను రుచికరంగా తయారు చేయడంలో నిపుణురాలు. ప్రత్యేకించి ఆమె పెట్టే.. చేపలు, పోర్క్, చికెన్, అల్లం, వంకాయ, కాప్సికమ్, బంగాళదుంప, పనస, ముల్లంగి నిల్వ పచ్చళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే డిమాండ్ కూడా. చెల్లెలు కూడా ఇప్పుడు ఆమెతోనే ఉంటోంది. ఇటానగర్ ఆమె అమ్మ తరఫు వారు ఉండే పట్టణం. అందుకనే డుజోమ్ అక్కడ స్థిరపడింది. -
ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
సాక్షి, ఖమ్మం: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్మీ, పారా మిలిటరీ(సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్)ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదివిన యువకులు 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 167 సెం.మీ. ఎత్తు, 77 సెం.మీ. చాతి ఉన్న యువకులకు కైరోస్ కాంపోజిట్ సర్వీసెస్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా హైదరాబాద్‌లో 45 రోజుల పాటు హాస్టల్ వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన ఉండి ఆసక్తి గల వారు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఈ నెల 24వ తేదీ లోపు బీసీ స్టడీసర్కిల్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం 08742–227427, 9573859598 నంబర్లను సంప్రదించాలన్నారు. -
మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా
సేంద్రియ రైతులతో నేరుగా సంబంధాలు కలిగిన ఏకలవ్య ఫౌండేషన్, గ్రామభారతి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ కలిసి గో ఆధారిత రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో మార్చి 1, 2, 3 తేదీల్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాను నిర్వహిస్తుండటం విశేషం. హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్లో జరగనున్న ఈ మేళాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్.ఐ.పి.హెచ్.ఎం, సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్. సంస్థలు కూడా ఈ మేళాలో పాలుపంచుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేంద్రియ రైతులు, దుకాణదారులు తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మకానికి పెడతారు. సేంద్రియ ఆహారోత్పత్తులతోపాటు 200 రకాల ఔషధ మొక్కలు, హెర్బల్ ఉత్పత్తులు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయని గో ఆధారిత రైతు మిత్ర సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. మార్చి 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం ప్రారంభమవుతుంది. మ. 3 గం. కు కోత అనంతరం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై సి.ఎఫ్.టి.ఆర్.ఐ. నిపుణులతో సదస్సు, సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటాయి. 2న సా. 3 గం.కు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు, జాతీయ పోషకాహార సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఆహార సదస్సు ఉంటుంది. 3న సా. 3 గం.కు జరిగే పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 4 గం.కు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ప్రసంగం, చర్చాగోష్టి ఉంటాయి. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు ఉచితంగా టేబుల్ స్పేస్ పొందే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534. 3న బసంపల్లిలో గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో మార్చి 3(ప్రతి నెలా మొదటి ఆదివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా తమపేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 100 (భోజనం సహా). వివరాలకు.. 94407 46074, 96636 67934 3న కొర్నెపాడులో బొప్పాయి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయవిధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై మార్చి 3(ఆదివారం)న సీనియర్ రైతులు శరత్‌బాబు (ప్రకాశం జిల్లా), శివనాగమల్లేశ్వరరావు (గుంటూరుజిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న డ్రయ్యర్‌తో మామిడి ఆమ్‌చుర్, తాండ్ర తయారీపై ఉచిత శిక్షణ మామిడి కాయలతో ఒరుగులు (స్లైసెస్), మామిడి కాయల పొడి (ఆమ్చూర్), మామిడి తాండ్రలను తక్కువ ఖర్చుతో త్వరగా ఎండబెట్టే డ్రయ్యర్ సాంకేతికత–నిర్వహణపై మార్చి 1 (శుక్రవారం)న ఉ. 10 గం.ల నుంచి గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకుడు ఎల్. శ్రీనివాసరావు తెలిపారు. ఒక హెచ్.పి. విద్యుత్తు లేదా వంట చెరకుతో ఈ డ్రయ్యర్ నడుస్తుంది. వివరాలకు.. 99123 47711. -
‘యువతకు రైల్వే పోస్టుల ఉచిత శిక్షణ ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: భారతీ య రైల్వేలో వివిధ పోస్టుల కోసం త్వరలో రాత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఎంపీ వినోద్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశా రు. దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో త్వరలో రెండున్నర లక్షల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలి సిందే. త్వరలోనే రైల్వేలో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. బిహార్, తమిళనాడుల్లో ఉచిత కోచింగ్ ఇస్తుండటంతో అక్కడి నిరుద్యోగులకు ఎక్కువగా రైల్వే లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర యువతకు వంద రోజుల పాటు ఉచి తంగా కోచింగ్ ఇవ్వాలని సీఎంతో పాటు గురుకుల పాఠశాలల సమితి కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎంపీ వినోద్ లేఖలు రాశారు. హైదరాబాద్, కాజీపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లతో పాటు అన్ని పాత జిల్లా కేంద్రాల్లో రైల్వే పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేం దుకు ఏర్పాట్లు చేయాలని వినోద్ సూచించారు. -
నీట్, జేఈఈలకు ఉచిత శిక్షణ ఇస్తాం
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ, నెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 2019, మే నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న 2,697 స్టడీ సెంటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శిక్షణ కేంద్రాలుగా మారుస్తుందని వెల్లడించారు. ఈ స్టడీ సెంటర్లు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కేంద్రాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోవు. చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో వెనుకంజ వేస్తున్న విద్యార్థుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్టీఏ తొలుత జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు 2019, జనవరిలో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ లో విద్యార్థులు మాక్ టెస్టుల కోసం సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ కావొచ్చని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం కేంద్రం ఎన్టీఏను స్థాపించిన సంగతి తెలిసిందే. -
‘డెంటల్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ’
సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గలవారు ఈ నెల 25లోగా మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. శిక్షణలో చేరాలంటే అభ్యర్థుల వయసు 21–45 ఏళ్లలోపు ఉండి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, హైదరాబాద్ జిల్లా వాసి అయి ఉండాలని వెల్లడించింది. వివరాలకు 040–23319313ను సంప్రదించాలని సూచించింది. -
ఫిల్మ్ మేకింగ్‌లో ఉచిత శిక్షణ
విజయనగరం పూల్‌బాగ్ : కాపు, బలిజ. తెల గ, ఒంటరి కులాల నిరుద్యోగులకు ఫినిషింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఇన్మల్టీ మీడియా, ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ వారు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వీ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ శిక్షణా శిబిరాన్ని కాపు కార్పొరేషన్, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. అభ్యర్థులకు భోజన వసతి కల్పి స్తామని పేర్కొన్నారు. స్త్రీలు, పురుషులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వసతులను ఉపయోగించుకోని వారికి నెలకు రూ.5వేలు స్టయిఫండ్ ఇస్తాని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, పాలిటెక్నిక్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. శిక్షణలో ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు జీతంతో ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగలవారు ఈనెల 20న ఉదయం 10 గంటలకు విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాయానికి హాజరుకావాలని సూచించారుర. మరిన్ని వివరాలకు 7674826174, 733117 2074, 7331172075, 73331172076 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జనగామ అర్బన్ : పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూపు–4 పోటీ పరీక్షల కోసం అర్హులైన వారికి 60 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ, పోలీస్‌శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారధి’ సంస్థ కరీంనగర్ సహకారంతో సుమారు 400 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సదరు సంస్థ భరిస్తుందని తెలిపారు. శిక్షణార్థులకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థల ప్రతినిధులు తరగతులు బోధిస్తారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్‌న్లలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని తమ పేర్లను నమోదు చేసుకుని, వెంటనే అర్హత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా వీఆర్వో, గ్రూపు–4 పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని చాకలి అయిలమ్మ జిల్లా సమాఖ్యలో ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి కోరారు. ఈనెల 24న యశ్వాంతాపూర్ గ్రామ శివారులోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం కానిస్టేబుల్స్ అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్వో, గ్రూపు–4 అభ్యర్థులకు అర్హత పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణ అని అనుకోవద్దని, ప్రమాణాలు పాటించి నిష్ణాతులైన వారిచే బోధించనున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే పీహెచ్సీ (వికలాంగ) అభ్యర్థులకు వసతి కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో మాలతి, ఏసీపీ బాపురెడ్డి, డీఆర్డీఓ కార్యాలయ అధికారి రాజేంద్రప్రసాద్, ఈజీఎస్ ప్రతినిధులు, ఆయా మండలాల పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
గజ్వేల్/గజ్వేల్‌రూరల్: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని దొంతుల ప్రసాద్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్‌లో శిక్షణ పొందుతున్న 750 మంది అభ్యర్థుల్లో 400 మందికి పైగా ఉద్యోగం సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. రోజుకు 18 గంటల పాటు కష్టపడి చదివి సివిల్స్ స్టేట్ ర్యాంకు సాధించానని గుర్తుచేశారు. జిల్లాలో 1906 మంది శిక్షణ పొందుతుండగా వారిలో 1200 మంది ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నామన్నారు. ముంపు గ్రామాల విద్యార్థులకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హామీ మేరకు ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా ఈ శిక్షణకు ఎంపిక చేశామన్నారు. శిక్షణ పొందే వారికి అన్ని వసతులతో పాటు భోజనం అందిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు అభ్యసించిన వారికి హైదరాబాద్‌లో మరో 45 రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు. అనంతరం పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. 21 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయన్నారు. ఇక్కడ 70 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 750 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, 15 రోజులకోసారి అధికారులచే మోటివేషన్ తరగతులు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి మాట్లాడుతూ.. ముందు గ్రామాల విద్యార్థులు ఉద్యోగాలు పొంది రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు మాట్లాడుతూ.. శిక్షణ పొందే అభ్యర్థులకు బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లలోని వసతి గృహాల్లో వసతి ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఇన్చార్జి ఏసీపీ మహేందర్, శిక్షకులు భాగ్యకిరణ్, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్‌చైర్మన్ దుంబాల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఏనాడైనా రైతుల గురించి ఆలోచించారా? గజ్వేల్: ‘రైతుబంధు’ పథకంపై కాంగ్రెస్ నేతల విమర్శలు సిగ్గుచేటని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ములుగులోని అటవీశాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసమే ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులున్నారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కరీంనగర్ సిటీ: ఇండియన్ ఆర్మీలో ఉపాధి కోసం మేలో వరంగల్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువమంది ఎంపికయ్యేందుకు నిరుద్యోగ యువతకు వారధి, ఎన్సీసీ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. రన్నింగ్ అంబేద్కర్ స్టేడియంలో, క్యూటీ ఎస్సారార్ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రతి కళాశాలలో ర్యాలీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైనవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 8వతరగతి నుంచి ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, ఎల్ఎల్బీ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం చేసినవారు వివిధ విభాగాల్లో ఆర్మీలో చేరొచ్చని అన్నారు. వారధి సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఉమాశంకర్ పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణకు మంచి స్పందన
వికారాబాద్ అర్బన్: పోలీసు ఉద్యోగాల కోసం ఇచ్చే ఉచిత శిక్షణకు మంచి స్పందన వస్తోందని వికారాబాద్ డీఎస్పీ శిరీష తెలిపారు. సోమవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన అభ్యర్థుల ఎంపికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సహకారంతో ఎస్పీ అన్నపూర్ణ ఆదేశంతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం అన్ని ఠాణాల్లో శిక్షణ తీసుకునే అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తాము ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన అభ్యర్థుల నుంచి వస్తోందని చెప్పారు. సోమవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో 295మంది యువకులు, 51మంది యువతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 7వ తేదీ వరకు అవకాశం ఉండటంతో దరఖా స్తు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులకు అప్పటికప్పుడు ఎత్తు, సర్టిఫికెట్లను పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎంపికైన అభ్యర్థులు 8న తమ తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు. బషీరాబాద్(తాండూరు): కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడానికి నిరుద్యోగ యువకులు బారులు తీరారు. సోమవారం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో యువకులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు బషీరాబాద్ మండలంలో 30 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి మొదటగా పోలీసులు శరీర కొలతలు తీసుకున్నారు. అర్హులైన యువకుల పేర్లను ఎస్పీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది రాంచందర్, శ్రీనివాస్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిగి పీఎస్‌లో 110 దరఖాస్తులు పరిగి: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పరిగి పోలీస్ స్టేషన్లో మొదటిరోజు సోమవారం 110 మంది యువకులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ముందస్తుగా ఛాతీ, ఎత్తు కొలతలు పరిశీలించిన తర్వాతే దరఖాస్తులు తీసుకున్నారు. ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ రోజంతా కొనసాగింది. శిక్షణ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తెలిపారు. శిక్షణ ఇచ్చిన తర్వాత శారీరక కొలతలు సరిపోకపోతో అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండటంతో పాటు సమయం వృథా అవుతుందని, అందుకే ముందస్తుగానే కొలతలు పరిశీలించి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
కశింకోట (అనకాపల్లి): ఏపీ బాలయోగి గురుకుల కళాశాలల్లో ఇంటర్మీ డియట్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఆసక్తి గల వారికి పబ్లిక్ పరీక్షల అనంతరం ఎంసెట్, నీట్, బిట్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆర్.డి.వి.చంద్రశేఖర్ వెల్ల ్లడించారు. తాళ్లపాలెం ఏపీ బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో బుధవారం సాయంత్రం మాట్లాడారు. పరీక్షల అనంతరం స్వల్ప కాలికంగా 40 రోజులపాటు ఆయా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నామని, ఇందుకు జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజును భరిస్తుందన్నారు. గురుకులంలో చదివిన విద్యార్థులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందడానికి కేరీర్ గైడెన్స్ ఇస్తున్నామన్నారు. జిల్లాలోని 11 బాల బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి వర్చువల్ తరగతులను కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8,9,10 తరగతులకు వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తాళ్లపాలెంతోపాటు రెండు గురుకులాల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో మూడు గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి భవనాలు సమకూర్చి వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముగిసిన రోబోటిక్ శిక్షణ కశింకోట మండలంలోని ఏపీ బాలయోగి గురుకులంలో మూడు రోజులపాటు జిల్లాలోని విద్యార్థులకు నిర్వహించిన రోబోటిక్ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు చంద్రశేఖరరావు ప్రతిభా ధ్రువపత్రాలను అందజేశారు. -
ప్రకృతి సేద్యం – విత్తనోత్పత్తిపై రైతులకు నెల రోజుల ఉచిత శిక్షణ
ప్రకృతి వ్యవసాయం, విత్తనోత్పత్తిపై రైతులకు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు నిర్ణయించింది. 240 గంటల పాటు (నెలకు పైగా) శిక్షణ ఉంటుంది. వసతి, భోజనం ఉచితం. శిక్షణకు రానుపోను ప్రయాణ ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. శిక్షణ ఆంగ్లంలో ఉంటుంది. ఇతర వివరాలకు.. 080– 28432965 నంబరులో లేదా training.ssiast@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. -
15న అడవినెక్కలంలో ప్రకృతి సేద్యంపై ఉచిత శిక్షణ
సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ (నోఫా) ప్రతి నెలా మూడో శనివారం రైతులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. సంస్థ కోశాధికారి సీహెచ్ రామకృష్ణప్రసాద్ ఈ నెల15న కృష్ణాజిల్లా అడవినెక్కలంలోని చుక్కపల్లి ఐటీఐ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు 98496 24311 నంబరులో సంప్రదించవచ్చు. 16న పండ్ల తోటలు, పాలీహౌస్‌లలో కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ -
‘కౌశల్య వికాస్యోజన’ కింద వివిధ కోర్సుల్లో శిక్షణ
ఎస్కేయూ : ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకం కింద వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్కేయూ సమీపంలోని ఆది ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం.ఆంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణతోపాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తివివరాలకు ఫోన్ : 08554–255433, 78423 26156, 91604 25798లో సంప్రదించాలన్నారు. రంగం కోర్సుల వివరాలు అర్హత ఐటీ/ఐటీఈఎస్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పది ఉత్తీర్ణత జూనియర్ సాప్ట్వేర్ డెవలపర్ బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, బీటెక్, ఎంసీఏ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ టెక్నీషీయన్ కంప్యూటింగ్ అండ్ ఇంటర్ ఫెరిఫరల్స్ ఫీల్డ్ టెక్నీషియన్ – నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ డిప్లమో సీసీటీవీ ఇన్సలేషన్ టెక్నీషియన్ ఐటీఐ డీటీహెచ్ సెట్ఆఫ్ బాక్స్ ఇన్స్టలార్ అండ్ సర్వీస్ టెక్నీషియన్ పది ఉత్తీర్ణత రిటైల్ సేల్స్ అసోసియేట్ పది ఉత్తీర్ణత బ్యాంకింగ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్– అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్ బీకాం బిజినెస్ కరస్పాండెంట్ పది ఉత్తీర్ణత -
నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ రంగాలో్ల ఉపాధి కల్పన పై ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు స్టీప్ కేరీర్ బిల్డర్స్ సంస్థ నిర్వాహకుడు కనకప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్యయోజన పథకం కింద ఈ శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. రిటైల్ రంగంలో ట్రైనీ అసోసియేట్స్‌గా, టెలికాంరంగంలో కాల్‌సెంటర్ రిలేషన్ షిప్ కోర్సుల పై . మూడు నెలల పాటు శిక్షణ, ఉచిత భోజన వసతి కలిస్తామన్నారు. కోర్సుకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ కోర్సు ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు. 18–30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని నంద్యాల రోడ్డు సమీపంలో గురుశంకర్ కాంప్లెక్స్‌లో ఉన్న తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 9908974815 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. -
ఎస్సీ ఎస్టీలకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ
అనంతపురం రూరల్: ఏపీ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ విన్సెంట్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైట్ మోటర్ వెహికల్‌కు 19సంవత్సరాలు నిండి 8వ తరగతి పాసై ఉండాలి. హెవి మోటర్ వెహికల్‌కు 10వ తరగతి పాసై ఉండి.. 20 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు డ్రైవింగ్ శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులుWWW.jobsmela.apssdc.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. -
పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు విశాఖపట్నం: ఏపీ రాష్ట్ర కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన కాపు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. పేరున్న శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు విద్యోన్నతి పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.8 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇవీ అర్హతలు.. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో నివాసమున్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభ్యర్థులు మాత్రమే అర్హులు. తూర్పు కాపు, గాజుల కాపు కులాలకు చెందినవారు అనర్హులు. అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు అర్హులే. ప్రభుత్వం నుంచి ఏ ఇతర పథకంలోనూ లబ్ధిదారు కాదని నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. దరఖాస్తులు ఇలా.. www.kapucorp.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 76619 96966, 73311 74448 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. అప్లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలివీ.. సంబంధిత అధికారి ఇచ్చిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుదారుని ఆధార్ కార్డు. వయస్సు ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేదా పంచాయతీ / మున్సిపాలిటీ / కార్పొరేషన్ నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం. విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు అభ్యర్థి పేరిట ఉన్న ఏదైన జాతీయ బ్యాంకు పాస్‌బుక్ ఖాతా వివరాలు. పాస్‌పోర్టు సైజు ఫొటో ఆర్థిక సహాయం ఇలా.. ఎంపికైన అభ్యర్థి శిక్షణ సంస్థకు చెల్లించాల్సిన ఫీజు మొత్తం కార్పొరేషనే భరిస్తుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థికి పుస్తకాలు, స్టేషనరీ, వసతి, భోజన సౌకర్యం నిమిత్తం రూ.8 వేలు ఇస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత అభ్యర్థి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. అయితే అభ్యర్థి 90 శాతం హాజరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీనికోసం ఆయా శిక్షణ సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తారు. ఎంపిక ఇలా.. ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. ఎస్సై పోస్టులకు 800 మందికి, కానిస్టేబుల్ పోస్టులకు 2,500 మందికి కాపు కార్పొరేషన్ ప్యానల్లోని శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. కార్పొరేషన్ ప్యానల్లో ఉన్న శిక్షణ సంస్థల జాబితా నుంచి అభ్యర్థి తనకు నచ్చిన సంస్థను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను కార్పొరేషన్ ముందుగా పరిశీ లిస్తుంది.