సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ | Free training for civil services exams | Sakshi
Sakshi News home page

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ

Published Tue, Nov 5 2013 3:54 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Free training for civil services exams

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్‌సీ గ్రూప్-1,2, బ్యాంక్ పీఓ మొదలైన పరీక్షలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన అధ్యయన కేంద్రం సంచాలకులు వై.వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను బీసీ వెల్ఫేర్ వెబ్‌సైట్‌లో ఈనెల 8వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10వ తేది ఆయా జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిల్‌లలో స్క్రీనింగ్‌పరీక్ష నిర్వహించి అభ్యర్థులు పొందిన ర్యాంకు, ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 18వ తేది హైదరాబాద్, విశాఖపట్నం, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ కోచిం గ్ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 08562-242526, 98499 04501 నంబర్లలో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement