cuddapah
-
కసి ఉంటే నాపై తీర్చుకోండి
తమ పార్టీ ప్రజా ప్రతినిధుల జోలికొస్తే ఊరుకోబోమని వైఎస్ వివేకా హెచ్చరిక కడప అగ్రికల్చర్: టీడీపీ నాయకులు తనతో కానీ, తన కుటుంబంతో కానీ రాజకీయంగా ఎదుర్కొని తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి సవాల్ చేశారు. అంత కసి ఉంటే తనపైన, తన కుటుంబంపైన తీర్చుకోవాలేగానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడటం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల కుటుంబాలను అంతమొందిస్తామని టీడీపీ నేతలు బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలకు దిగమని చెప్పినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బలహీనవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రభుత్వమే దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అని వివేకా అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని పంపించాలని కోరతామన్నారు. -
కడప వెళ్తున్న సపక్ తక్ర జట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్ (అండర్–19) సపక్‌తక్ర జట్లు రాష్ట్రపోటీల కోసం బుధవారం ఇక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్తున్నట్లు జిల్లా సపక్‌తక్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంగా ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్లను సోమవారం ఎంపికచేసిన విషయం తెలిసిందే. ఎంపికైన క్రీడాకారులంతా ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తమ లగేజితోపాటు వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్, పాస్‌ఫోటోలతో చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సపక్‌తక్ర సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని సూచించారు. -
ఉత్సాహంగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
– తరలివచ్చిన బాలబాలికలు – త్వరలో జిల్లాస్థాయి తుది ఎంపిక జాబితా వెల్లడి శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలు ఉత్సాహంగా.. ఉల్లాసభరితంగా సాగాయి. చిరుజల్లులు, ఆహ్లాదరకమైన వాతావరణంలో క్రీడాకారుల ఎంపికలు కోలాహలంగా సాగాయి. వైఎస్సాఆర్ కడప జిల్లాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాలకు గాను శాప్ సౌజన్యంతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి ఎంపికలను నిర్వహించారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 80 మంది వరకు బాలబాలికలు హాజరయ్యారు. ఎంపికలకు హాజరైన బాలబాలికల్లో తొలుత నిర్ధేశించిన వయో పరిమితి లోబడి ఉన్న క్రీడాకారులను మాత్రమే ఎంపికలకు అనుమతించారు. అర్హత కలిగిన బాలబాలికలకు వారి ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లైస్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, వెర్టికల్జంప్, మెడిసిన్ బాల్‌త్రో, షటిల్రన్, ఫ్లెక్సిబులిటీ టెస్ట్, 800 మీటర్ల పరుగును నిర్వహించారు. వారి గణాంకాలను, టైమింగ్‌లను అధికారులు నమోదు చేసుకున్నారు. కాగా ప్రభుత్వం అరకొన నిధులను కేటాయించినప్పటికీ ఎంపికలకు హాజరైన బాలబాలికలకు అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. శాప్ నిర్థేశానుసారం ఎంపిక ఇదిలా ఉండగా శాప్ నిర్థేశించిన టైమింగ్, ఫలితాలను సాధించిన క్రీడాకారులను మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చే స్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఎంపికలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, ఎంవీ రమణ, ఎమ్మెస్సీ శేఖర్, బీవీ రమణ, సుజాత, ఎం.ఆనంద్‌కిరణ్, మాధవరావు, రవి, డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి నిలిపివేత
విద్యుత్ కు డిమాండ్ తగ్గిపోవడంతో... వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో గురువారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో 1, 3, 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని అధికారులు తెలిపారు. 2, 4 యూనిట్లలో ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు. -
'కృపాకర్ ను హత్య చేసివుంటారు'
కడప: శాంతి సంఘం అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్ కుమారుడు కృపాకర్ ఐజాక్ కుటుంబ సభ్యుల మృతి కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్ జిల్లా పౌరహక్కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. జియోన్ పాఠశాలలో కృపాకర్, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని గురువారం సందర్శించారు. ఆర్థికపరమైన కారణాలే వీరి మృతికి కారణమైవుంటాయని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మనోహర్ రెడ్డి అన్నారు. కృపాకర్ ను కూడా హత్య చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. -
'కృపాకర్' కేసులో కీలక మలుపు
కడప: శాంతి సంఘం అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్ కుమారుడు కృపాకర్ ఐజాక్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతి కీలక మలుపు తిరిగింది. కృపాకర్ నిర్వహిస్తున్న జియోన్ పాఠశాలకు సంబంధించిన పత్రాలను కూడా స్కూల్ లోనే పాతిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా డాక్యుమెంట్లను వెలికితీయించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న రాజారత్నం ఐజాక్ ను సంఘటనా స్థలంలో పోలీసులు విచారించనున్నారు. -
అనుబంధమా... బలి కోరొద్దు!
పిల్లలను చంపి పెద్దలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలొ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పిల్లలు బలిపశులవుతున్న దారుణోదంతాలు అధికమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యావంతులు కూడా విచక్షణ కోల్పోయి ఇలాంటి ఘోరాలకు పాల్పడుతుండడం మరింత భయాందోళన కలిగిస్తోంది. కడప, హైదరాబాద్ లలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనలు వర్తమాన సమాజ విపరీత వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. జూన్ 26న ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహూ(36) తన భార్య శ్వేతతో పాటు కుమారుడు యష్(5)ను కిరాతకంగా చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని మైహోమ్ అపార్ట్మెంట్ లో అతడీ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కొడుకులను చంపి, పాతిపెట్టి తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కడపలో కృపాకర్ అనే వ్యక్తి భార్యాపిల్లలను తాను కూడా తనువు చాలించాడు. ఆర్థిక, వివాహేతర సంబంధాలు ఆలుమగల మధ్య వివాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. విద్యావంతుల విషయానికి వచ్చేసరికి వృతిపరమైన ఒత్తిడి, అహం, ఆధునిక జీవనవిధానం తదితర కారణాలు కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనన్న భావన కొరవడిన కుటుంబాలు కల్లోలాల బారిన పడుతున్నాయి. ఆధిపత్య ధోరణి ఆలుమగల మధ్య అగాధం పెంచుతోంది. మరోపక్క వృత్తిపరమైన ఒత్తిడి కూడా వైవాహిక సంబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతోంది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కలతలు ఏర్పడితే జీవితాలు తారుమారవుతున్నాయి. దాంపత్య గొడవలతో భార్యాభర్తలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. తీవ్రమనోవేదనకు లోనయి క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రక్తంపంచుకు పుట్టినవారిని, జీవితాన్ని పంచుకున్న వారిని కడతేర్చి.. తమ జీవితాన్ని అర్థాంతంగా ముగించేందుకు వెనుకాడని నిస్సృహలోనికి కూరుకుపోతున్నారు. ప్రతిసమస్యకు పరిష్కారం ఉంది. అయితే సమస్యను గుర్తించి, దానికి తగిన పరిష్కారం చేయనప్పుడే ఉపద్రవాలు ఎదురవుతున్నాయి. ఆలుమగల మధ్య అనుబంధం బలంగా ఉంటే సమస్యలు వాటికవే సమసిపోతాయి. -
కోటి మందిని స్థానికులు కాదంటారా?
కడప: కోటి మంది తెలంగాణ ప్రజలను స్థానికులు కాదనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, ప్రాణాలర్పించిన వారిని స్థానికేతరులు అనడం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని అంతకుముందు కిషోర్‌బాబు పిలుపునిచ్చారు. సర్వే ఫార్మాట్లో ‘ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే’ కాలమ్‌లోనూ ఇదే విషయాన్ని పొందుపరచాలని సూచించారు. ఇలా చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. రాజధాని కావడంతో హైదరాబాద్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎంతోమంది స్థిరపడ్డారని తెలిపారు. -
'ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'
కడప: రాష్టానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏ మేరకు ఖర్చు చేస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని ఎంపిక విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాయలసీమకు జరగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అంతకుముందు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ ఇప్పటివరకు నెరవేర్చలేదని తెలిపారు. -
'పరిశీలనలో ఏపీకి రెండు రాజధానులు'
కడప: అన్ని ప్రాంతాల అభివృద్ధిని పరిగణలోకి తీసుకుంటామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. రాయలసీమ సాగునీటి కోసం మరి కొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, రాజధాని ఎంపిక విషయంలో ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. రాజధానుల నిర్మాణం సాధారణంగా 30-100 సంవత్సరాల సమయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తొందరపాటు నిర్ణయం భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు జరగొచ్చని, అందుకే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇస్తామన్నారు. ఏపీకి రెండు రాజధానుల అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు. దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
కృష్ణమ్మను రప్పించండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, కడప : జిల్లా రైతులు ప్రతిసారి కరువు కొరల్లో చిక్కుకుపోతున్నారు.. మిగతా జిల్లాలకు ఎప్పుడో కరువు వస్తే.. ఇక్కడ మాత్రం పిలవని పేరంటంలా వచ్చి ఇబ్బంది పెడుతోంది. తుంగభద్ర నుంచి సాగునీరు సక్రమంగా రాక పులివెందుల, జమ్మలమడుగు రైతులు అల్లాడుతున్నారు... కృష్ణా జలాలైనా సంపూర్ణంగా వస్తే తప్ప.. కేసీ కాలువతోపాటు ఇతర ప్రాంతాల రైతులకు పంటలు పండించుకునే అవకాశం ఉండదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, గండికోట, జీఎన్ఎస్ఎస్ అధికారులతో వైఎస్ జగన్ శుక్రవారం విడివిడిగా సమీక్షించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో కలిసి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను గండికోటకు ఈసారైనా తీసుకురావాలని.. ఇంతలోపే ముంపు గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సిన పరిహారం మొత్తాన్ని ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలు గండికోటకు వస్తే అక్కడ నుంచి పైడిపాలెంకు తీసుకరావచ్చని.. అలాగే సీబీఆర్‌కు కూడా పంపింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పైడిపాలెం, సీబీఆర్, పీబీసీ, బైపాస్ కాలువలకు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ఉన్నప్పుడే 80శాతం పైగా పనులు పూర్తయితే.. ఇప్పటివరకు ఇంకా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. తుంగభద్ర నుంచి ఈసారైనా పులివెందులకు పూర్తి కోటా నీరు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. ఐఏబీ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ మేరకు డిమాండు చేస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పీబీసీకి 4.4 టీఎంసీతోపాటు, మైలవరానికి 1.300టీఎంసీల పూర్తికోటా నీటిని అందించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్లను ఇబ్బంది పెట్టొదు రేషన్ డీలర్లకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగ్గా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని.. అలా కాకుండా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేయడం తగదని వైఎస్ జగన్ సూచించారు. నిజంగానే డీలర్ అన్యాయంగా సొమ్ము చేసుకుంటుంటే చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ.. అనవసరంగా ఎలాగోలాగా ఇబ్బందులు పెట్టి తొలగించాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించండి : పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. గ్రామాల్లో సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమావేశాలలో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డి, పీబీసీ, పైడిపాలెం ప్రాజెక్టుల ఈఈలు రాజశేఖర్, చెంగయ్యకుమార్‌లతోపాటు పలువురు డీఈలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ రఘురామయ్య, ఏడు మండలాల తహశీల్దార్లు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శివరామయ్య, శ్రీనివాసులు, ఎల్.వి.ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవోలు మురళీమోహన్‌మూర్తి, సమత, జ్ఞానేంద్రరెడ్డి, మైథిలీ, బాలమునెయ్య, వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయండి నెలకొకమారు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను అధికారులు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఏ సమయానికి ఎక్కడ పింఛన్ ఇస్తున్నారో.. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా తెలపకపోవడంతో లబ్ధిదారుల పింఛనంతా ఆటో ఛార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల పేరుతో ఇబ్బందులు సృష్టించడం తగదని.. మాన్యువల్ పద్దతిలోనే లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేదన్నారు. -
'రాజధాని కోసం ప్రైవేట్ భూములు కొనొద్దు'
కడప: నూతన అంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల కొనుగోలు సరికాదని వైఎస్ఆర్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని సూచించారు. శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రుల ప్రత్యేక హోదా, ప్యాకేజీల గురించి ఒక్క అడుగు ముందుకు కదల్లేదని మైసూరారెడ్డి విమర్శించారు. -
'కడపపై శివరామకృష్ణన్ కమిటీ చిన్నచూపు'
కడప: కడపను శివరామకృష్ణన్ కమిటీ చిన్నచూపు చూసిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాయసీమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోద్యయోగ్యమైన ప్రాంతాన్నే నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను నిర్మూలించిన ఏకైక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్ ప్రతి ఏటా చేస్తున్నదేనని, కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టు వెంటనే పంటల రుణమాఫీ చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'విభజనకు రూట్ మ్యాప్ ఇచ్చింది కిరణే'
కడప: ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించినవారిలో వైఎస్ జగన్‌ను దేశంలో మూడోస్థానంలో నిలిపింది మీరేనని ప్రజలను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మీకెప్పుడూ తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. కడప కృష్ణ సర్కిల్లో జరిగిన రోడ్ షోలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. 70 లక్షల మంది ఓట్లను 15 మంది ఎమ్మెల్యేలను సోనియా వద్ద చిరంజీవి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇప్పుడు ఏం తాకట్టుపెట్టడానికి చిరంజీవి వస్తున్నాడని ప్రశ్నించారు. విభజనలో కేంద్రానికి రూట్ మ్యాప్ ఇచ్చింది కిరణే అని చెప్పారు. ఎన్జీవోల సమ్మెను నీరుగార్చింది కిరణ్నేనని చెప్పారు. జనతా వస్త్రాలను రద్దు చేసి ఆప్కోలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. నేతన్నల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు తానే కారణమంటున్నారు.. నమ్మేవారు ఉంటే హుస్సేన్ సాగర్ చార్మినార్ లను తానే కట్టించానంటారని ఎద్దేవా చేశారు.వైఎస్ఆర్ పథకాలను కూడా తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చంద్రబాబు పాలనలో ప్రజలు వలసలు వెళ్లారని గుర్తు చేశారు. ప్రజలు ఆకలికేకలతో అలమటిస్తుంటే సింగపూర్, మలేషియా టూర్లు తిరిగొచ్చారని చెప్పారు. 'మీ గుండెలోతుల్లోనే వైఎస్ఆర్ను చూసుకుంటున్నా. మమ్మల్ని మీ కుటుంబంలో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రాణం ఉన్నంతవరకు మీ ప్రేమ మర్చిపోము' అని విజయమ్మ అన్నారు. -
డ్రామాలాడిస్తున్న బాబు, కిరణ్: గడికోట
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మొదట్నుంచి శాసనసభలో సమైక్యతీర్మానం కోసం పట్టుబట్టిందని రాయచోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ ఇరుప్రాంతాల నాయకులతో డ్రామాలాడిస్తున్నారని ఆయన విమర్శించారు. బీఏసీ సమావేశాలకు హజరుకాని చంద్రబాబు, తెలంగాణ బిల్లును ముసాయిదాగా ప్రకటించిన సీఎం కిరణ్ మొదటి నుంచి సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉంటే ప్రయోజనం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్‌లకు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కడప అర్బన్, న్యూస్‌లైన్ ః సిండికేట్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (సిండ్ ఆర్సెటి) ఆధ్వర్యంలో ఎంబ్రాయడరీ- ప్యాబ్రిక్పెయింటింగ్, ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ -పంపుసెట్ నిర్వహణ, సెల్‌ఫోన్ మరమ్మతులు, మహిళా దుస్తుల తయారీ అనే అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు డైరక్టర్ రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఫెయిల్ లేదా పాస్అయిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. విద్యార్హతకు సంబంధించిన టీసీ, మార్కులిస్టు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు తెల్లరేషన్‌కార్డు జిరాక్స్‌తో డెరైక్టర్, సిండ్ ఆర్సెటీ, ఆర్టీసీ వర్క్ షాపు దగ్గర, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన కడప అనే చిరునామాకు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తులు పంపాలన్నారు. శిక్షణా కాలంలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 08562 200193, 9440905478 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
‘రక్తం’ పీలుస్తున్నారు!
సాక్షి, కడప: ‘మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిహారిక(7) అనే చిన్నారికి తీవ్ర జ్వరం సోకింది. చికిత్స కోసం వారి తల్లిదండ్రులు కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తంలో తెల్లకణాలు భారీగా తగ్గి 39వేలు మాత్రమే ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టు ఇచ్చారు. హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. అయితే కర్నూలుకు తీసుకెళ్లినా మంచి వైద్యం అందుతుందని ఓ వ్యక్తి సలహా ఇచ్చారు. దీంతో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయిస్తే రక్తకణాలు సాధారణ స్థితిలో ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఈ సమయంలో తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లి ఉంటారు.డెంగీ పేరుతో చికిత్స చేసి ఉంటే ఎంత నష్టపోయేవారు. డెంగీ పేరిట జిల్లాలో నిర్వహిస్తున్న పరీక్షలు రోగుల్ని కలవరపెడుతున్నాయి. ప్లేట్లెట్ల సంఖ్య క్షణక్షణానికీ వేల సంఖ్యలో మార్పు వస్తుండటంతో ఏ ల్యాబ్ రిపోర్ట్ సరియైనదో తెలీక రోగులు ఆందోళన పడుతున్నారు. ఇక పరీక్షల పేరుతో వేలకు వేల రూపాయలు ల్యాబ్‌ల్లో లాగుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందక తప్పని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు బాట పట్టాల్సి రావడం, అక్కడికి వెళితే తప్పుడు రిపోర్టులు...అధిక ఫీజులతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్లు ఎక్కడ?: జిల్లాలో చాలా ప్రైవేటు ఆస్పత్రులలో అక్కడే ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే చాలా వాటికి వైద్య, ఆరోగ్యశాఖ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ లేకుండానే ల్యాబ్‌లను నడుపుతున్నారు. నిపుణులైన టెక్నీషియన్లు లేరు. ఎంఎల్టీ చేసిన ఓ వ్యక్తి పేరుతో అనుమతి తెచ్చుకుని అరకొర పరీక్షలు చేయడం వచ్చిన ‘ల్యాబ్బాయ్స్’తో కూడా పరీక్షలు చేయిస్తున్నారు. దీంతోనే తప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. ఈ పరిస్థితి తరచూ ఎదురవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవడం లేదు. ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టడం, అనుమతులు లేనివాటిని సీజ్ చేయడం జరగడం లేదు. దీనికి కారణం ల్యాబ్ ఏర్పాటు సమయంలో అధికారులకు మామూళ్లు ఇచ్చుకోవడం, ఆపై ప్రతి నెలా పంపకాలు సాగుతుండటంతో వీటిపై చర్యలు కొరవడ్డాయి. అలాగే జిల్లాలోని కొంతమంది ప్రైవేటు వైద్యులు కూడా కాసులకు ఆశపడి ఎక్కువ కమీషన్ ఇచ్చే ల్యాబ్‌లకు రిపోర్టులు రాసిస్తున్నారు. దీంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది. పెద్ద ఆస్పత్రుల నుంచి పెద్ద కమీషన్లు: డెంగీ, విష జ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా...అధికారుల్లో అప్రమత్తత కొరవడింది. ప్రజల ప్రాణాల మీద కొచ్చినప్పుడు ఓ వైద్యశిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సర్కారు వైద్యంపై సామాన్యుడికి భరోసా కరువైంది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో జిల్లాలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాలు ముసురుకుంటున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు వైద్యులు జ్వరం, ఒళ్లునొప్పులనగానే డెంగీ లక్షణాలంటూ భయపెడుతున్నారు. ఇక్కడ పరీక్షల నిమిత్తం 600-1000రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అలాగే ఖర్చు ఎంతయినా ఫర్వాలేదనే వారిని రాజధాని ఆస్పత్రులకు తరలిస్తూ, వారి నుంచి దండిగా కమీషన్లు దండుకుంటున్నారని తెలుస్తోంది. పరీక్షలు ఇలా..! చికున్‌గున్యా, మలేరియా జ్వర లక్షణాలున్న వారికి ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. డెంగీ బారిన పడిన వారికి ఇవి మరింత తగ్గుతాయి. ప్లేట్లెట్ల సంఖ్య 20వేల కన్నా తక్కువగా ఉండి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలి. రక్తస్రావం లేకున్నా 10వేల కంటే ఎక్కువ పడిపోతున్నా ప్లేట్లెట్ల అవసరాన్ని గుర్తించాలి. ముఖ్యంగా రక్తంలో ప్లాస్మా తగ్గుతుందేమో పరీక్షించుకోవాలి. డెంగీ జ్వరాల్లో రక్తంలోని ప్లాస్మా బయటకు లీక్ అవుతుంది. ఇది ప్రమాదకరం. ప్లాస్మా లీకవడం వల్ల రక్తం చిక్కబడుతుంది..బీపీ కూడా తగ్గుతుంది. దీంతో పాటు రక్తకణాలు లక్షకన్నా తగ్గి ప్యాక్డ్సెల్వాల్యూమ్(పీసీవీ) ఉండాల్సిన దానికంటే 20శాతం పెరిగితే రక్తస్రావం లేకున్నా డెంగీగా భావించాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయల వరకూ వసూళ్లు: ప్రస్తుతం జిల్లాలో కొన్ని రక్తపరీక్ష కేంద్రాల్లో ర్యాపిడ్కిట్ సాయంతో డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ వైరాలజీ సంస్థ మార్గదర్శకాల ప్రకారం...ఎలీసా పరీక్షలో నిర్దారణ అయితేనే డెంగీగా పరిగణించాలి. ఇది కేవలం జిల్లాలో రిమ్స్‌తో పాటు మరో ప్రముఖ వైద్యశాలలో ఉంది. అయితే కొందరు ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు వైద్యులు కనుసన్నల్లో ప్రత్యేక కిట్ల ద్వారా నామమాత్రపు పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు 200 వసూలు చేయాల్సి వెయ్యి రూపాయల వరకూ గుంజుతున్నారు. రిమ్స్‌లో ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్ ఉంది. అయితే అక్కడ రక్తపరీక్షలకు వినియోగించే కెమికల్స్ అయిపోవడం, ల్యాబ్ సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, మిషన్లు చెడిపోతే సకాలంలో మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి. డెంగీ లక్షణాలు ఇలా: డెంగీ జ్వరం వల్ల తలనొప్పి, కంటి వెనుకనొప్పి, కండరాల నొప్పులతో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంటే ముక్కు, నోరు, చిగుళ్ల వెంట రక్తం రావడం, వాంతులు, మలం నల్లగా ఉండటం, నిద్రలేమి, శ్వాసలో ఇబ్బంది, పొత్తి కడుపునొప్పి, నాలుక తడారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. -
ఆర్టీసీ చార్జీల పెంపుతో జిల్లా ప్రజలపై రూ.54 కోట్ల భారం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులపై ఏడాదికి రూ.54కోట్లు భారం పడనుంది. పల్లె వెలుగు నుంచి హైటెక్ బస్సుల దాకా కిలో మీటర్‌కు 4పైసల నుంచి 12పైసల వరకు అదనంగా వడ్డించనున్నారు. ఈ వడ్డెన మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కడప ఆర్టీసీ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో రోజూ 870 బస్సులు తిరగనున్నాయి. ఈ బస్సులు నడపడం వలన ప్రతిరోజూ రూ. 60 నుంచి 70లక్షలు ఆదాయం వచ్చేది. ఈ చార్జీలు పెంచడం వలన దాదాపు రూ.70 నుంచి 85లక్షల వరకు ఆదాయం పెరగనుంది. దీంతో సరాసరి రోజుకు రూ.15లక్షల భారం ఆర్టీసీ ప్రయాణికులపై పడనుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.54కోట్లు భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటి సామాన్యుని పరిస్థితి దుర్భరంగా తయారైంది. సగటు ప్రయాణికుడు ఆర్టీసీని ఆశ్రయించి గమ్యానికి చేరుతున్నాడు. ఈ చార్జీలు పెరగడంతో సగటు ప్రయాణికునిపై మరింత భారం పడడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది. పల్లె వెలుగు కిలో మీటర్‌కు 55పైసల నుంచి 50పైసలకు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌కు కిలో మీటర్‌కు 72పైసల నుంచి 79పైసలకు పెంచారు. డీలక్స్ బస్సులకు 80పైసల నుంచి 89పైసలకు పెంచారు. సూపర్ లగ్జరీ బస్సులకు 94 పైసల నుంచి 1.05పైసలకు పెంచారు. ఇంద్ర బస్సులకు 1.20పైసల నుంచి రూ.1.32పైసలకు పెంచారు. -
ఏం గిట్టుబాటో..!
సాక్షి, కడప: రాయలసీమలో 2.88 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఏటా 46.24 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. గ త రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెట్టుబడి వ్యయం ఎకరానికి 5-6 వేల రూపాయల వరకూ పెరిగింది. ఖరీఫ్‌లో ఎకరానికి సగటున దిగుబడి 20 క్వింటాళ్లుగా వ్యవసాయాధికారులు లెక్కిస్తారు. ఈ మేరకు పెరిగిన మద్దతుతో ఎకరానికి 26, 200 రూపాయలు వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడి ఎకరాకు రూ.20 వేల వరకూ ఖర్చవుతోంది. ఈ లెక్కన ఎకరానికి సగటున 6 వేల రూపాయలు రైతులకు లాభం వస్తోంది. ఇదంతా పంటబాగా పండితేనే. నష్టమొచ్చినా, దిగుబడి తగ్గినా రైతుకు మిగిలేది నష్టమే. ప్చ్..ఏం లాభమొస్తాదో.. ప్రస్తుతం ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో వరిసాగుపై రైతులు ఆసక్తి చూపారు. గతేడాది వర్షాభావం వల్ల పంట లేకపోవడంతో ఈ ఏడాది వరికి మంచి ధర ఉంటుందని రైతులు ఆశగా ఉన్నారు. అయితే ప్రస్తుతం సీమలో కొత్త ధాన్యం పుట్టి(8బస్తాలు) 9,500 రూపాయలకు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దోమపోటు విపరీతంగా ఉండటంతో ఒకవేళ పంట బాగా పండితే ఎకరాకు 3 పుట్ల ధాన్యం వస్తోంది. ఈ లెక్కన 28,500 రూపాయలు రైతులకు అందుతోంది. పెట్టుబడి పోను రైతుకు రూ. 8 వేల వరకు మిగులుతోంది. అయితే చాలాచోట్ల పంట ఆశాజనకంగా లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న గిట్టుబాటుతో నష్టం వచ్చే అవకాశమే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులు బుట్టదాఖలు క్వింటాలు ధాన్యానికి 2,811 రూపాయలు చెల్లించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే 1345 రూపాయలు ఏ గ్రేడ్ ధర నిర్ణయించడం కంటితుడుపు చర్య. దీన్నిబట్టే రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతోంది. పైగా రాష్ట్రం నుంచి పదిమందికిపైగా కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం రెండోస్థానంలో ఉంది. అయినప్పటికీ మంత్రులు రైతుకు అండగా నిలిచి ‘మద్దతు’ ఇప్పించలేకపోయారు. -
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్-1,2, బ్యాంక్ పీఓ మొదలైన పరీక్షలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన అధ్యయన కేంద్రం సంచాలకులు వై.వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను బీసీ వెల్ఫేర్ వెబ్సైట్లో ఈనెల 8వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10వ తేది ఆయా జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిల్‌లలో స్క్రీనింగ్‌పరీక్ష నిర్వహించి అభ్యర్థులు పొందిన ర్యాంకు, ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 18వ తేది హైదరాబాద్, విశాఖపట్నం, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ కోచిం గ్ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 08562-242526, 98499 04501 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నిబంధనలకు అనుగుణంగా
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : టపాసులు విక్రయించే యజమానులు నిర్ణయించిన ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మల అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దీపావళి పండుగ సంద ర్భాన్ని పురస్కరించుకుని బహిరంగ ప్రదేశాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 29వ తేది సాయంత్రం 5 గంటల వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 205 టపాసుల విక్రయ కేంద్రాలకు దరఖాస్తులు వచ్చాయన్నారు. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు అధికారుల సహకారంతో టపాసుల విక్రయ కేంద్రాల స్థలాలు గుర్తించి లక్కీ డిప్ ద్వారా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. టపాసులు కాల్చేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సిటీ కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. టపాసుల విక్రయకేంద్రాలను ఎదురెదురుగా కేటాయించకూడదన్నారు. విక్రయ కేంద్రాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్కాని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేలా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంటూ విక్రయదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కేంద్రాల వద్ద విక్రయదారులు 200 లీటర్ల నీటిని నిల్వ ఉండే డ్రమ్ములను, మూడు బకెట్ల ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నవంబరు 1 నుంచి 3వ తేది వరకు విక్రయ కేంద్రాలలో టపాసులను విక్రయించుకోవచ్చన్నారు. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులను కాల్చేలా చూడాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, డీఆర్వో ఈశ్వరయ్య, కడప ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీలక్ష్మితోపాటు టపాసుల విక్రయ కేంద్రాల నిర్వాహకులు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నమ్మితే అంతే!
సాక్షి, కడప: అరుణ్‌ప్రసాద్ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ నిర్వహించిన లక్కీడ్రాలో రూ. 70వేలు తగిలిందని, ట్యాక్స్ రూపంలో రూ. 8వేలు డిపాజిట్ చేస్తే మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అందులో ఉంటుంది. లక్కీడ్రా...70వేల రూపాయలు...ఆశతో రూ. 8వేలు అరుణ్‌ప్రసాద్ ఓ ఖాతాలో జమ చేశాడు. నెలలు గడుస్తున్నాయి.. ఇప్పటి వరకూ రూ. 70వేలు ఊసేలేదు. ఇది ఇప్పటి వరకూ జరుగుతూ వస్తున్న సెల్ మోసాలు. తాజాగా వారం రోజుల కిందట లక్ష్మిరెడ్డి మోపూరి అనే ఎన్ఆర్ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. 2009-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి లక్ష్మిరెడ్డి ఖాతాలో రూ. 5లక్షలు జమ కావాల్సి ఉందని, రూ. 12,362 చెల్లిస్తే మొత్తం సొమ్మును బ్యాంక్‌ఖాతాలో జమ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ లెటర్ వచ్చింది. దీంతో లెటర్లో ఉన్న మెయిల్‌కు లక్ష్మిరెడ్డి రూ. 12,362 చెల్లించారు. అయితే ఇప్పటి వరకూ రూ. 5లక్షల ఊసే లేదు. తాజాగా జరుగుతున్న ఆన్లైన్ మోసాలకు ఇదొక ఉదాహరణ. ఆన్లైన్ మోసాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కీడ్రా తగిలిందని, ఫలానా అడ్రస్‌కు రావాలని చెప్పడం, అక్కడకు పోతే వారి కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ వివరాలపై గంటపాటు కౌన్సెలింగ్ ఇచ్చి బిజినెస్ చేసుకోవడం కడప, ప్రొద్దుటూరులో జరుగుతోంది. అలాగే లక్కీడ్రాలో డబ్బులు తగిలినట్లు మెసేజ్‌లు రావడం, బాధితులు మోసపోయిన సంఘటనలు ఇటీవల బోలెడు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, లక్కీడ్రాల గురించి అవగాహన లేనివాళ్లు మోసపోవడం సహజం. అయితే నిత్యం ఫారిన్ కరెన్సీ ట్రాన్స్ఫర్లు చేస్తూ, సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉండే ఎన్ఆర్ఐలే మోసపోతుంటే.., మోసం చేసేవాళ్లు పక్కాగా ఎలా నమ్మించి నట్టేట ముంచుతున్నారో ఇట్టే తెలుస్తుంది. ఆర్బీఐ పేరుతో దగా: ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. అలాంటి ఇలాంటి లెటరు కాదు. ఏకంగా ఆర్బీఐ లోగో ఉన్న లెటర్ ప్యాడ్. ఆర్బీఐ అడ్రస్. ఆర్బీఐ కోఆర్డినేటర్ పేరు, రిజిస్ట్రేషన్ కోడ్ చూస్తే నిజంగా ఆర్బీఐ నుంచి లెటర్ వచ్చిందని ఎవరైనా నమ్మాల్సిందే! డీసీఎం(డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్) సన్సద్బాద్ మార్గ్, న్యూఢిల్లీ అడ్రస్‌తో, ఆర్బీఐ ఫారిన్ఫండ్స్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ ఏంజిలినా డిసౌజా పేరుతో లెటరు వచ్చింది. దాని సారాంశం ఇలా ఉంది. ‘2009 నుంచి 2012 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆర్బీఐ ఖాతాదారుల జాబితా ఫైలును సమీక్షించారు.. లాటరీ, అన్‌పెయిడ్, అన్ డెలివరీ ఫండ్స్, పేమెంట్స్ ఫైలు(ఫైల్ నెంబర్:ఆర్బీఐ/ఐడీ1033/09)ను పరిశీలిచించారు.. అందులో మీకు రూ. 5లక్షలు ఆర్బీఐ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబధించి 2013 జనవరి 2న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెనెట్ట్యాక్స్ ఆర్థిక వ్యవహారాల కమిటీతో ముంబయి బ్రాంచ్‌లో సమావేశమయ్యారు.. ఇప్పటి వరకూ ఆర్బీఐ నుంచి చెల్లించాల్సిన దీర్ఘకాలిక పెండింగ్ మొత్తాలను వారివారి ఖాతాల్లోకి జమ చేయాలని రాజన్ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఆ మొత్తాలను సంబంధించిన ట్యాక్స్‌ను మాత్రం ఖాతాదారులే చెల్లించాలి.. ఈ ట్యాక్స్‌ను రెండువారాల్లోపు చెల్లించి డబ్బు అందిందా లేదా? అనేది ఆర్బీఐ అధికారులతో నిర్ధారించుకోవాలి. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ౌజ్ఛీ.2టఛజీఃౌఠౌౌ్టజు.ఛిౌఝను సంప్రదించాలి.. ఇలా చెల్లించకపోతే మీకు రావాల్సిన రూ. 5లక్షల చెల్లింపులు నిలిచిపోతాయి.. దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలి.. ఆర్బీఐకి ఎలాంటి సంబంధం ఉండదు.’’ అని ఉంది. ఈ మొత్తం లెటరు ఆర్బీఐ ఫారిన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ మేడమ్ ఏంజిలినా డిసౌజా పేరుతో వచ్చింది. ఇంత పక్కాగా లెటర్ వచ్చిన తర్వాత ఎవరైనా ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించాలనుకుంటారు. డబ్బు చెల్లించిన తర్వాత ఎలాంటి మొత్తం బాధితుల ఖాతాల్లో జమ కాదు. ఇలాంటి మోసాలు ఇటీవల అధికంగా జరుగుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ మెయిల్స్కువచ్చే మెసేజ్‌లు, లెటర్లతో అవి నిజమోకావో తెలుసుకోకుండా భారీగా డబ్బు వస్తుందనే ఆశతో చాలామంది కొద్దిమొత్తాన్ని చెల్లించి బలవుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి, మెసేజ్‌లు వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించి డబ్బులు చెల్లించాల్సిన ఖాతా నెంబర్లు, అడ్రస్‌లపై బాధితులు ఫిర్యాదు చేయాలి. అప్పుడే వాస్తవంగా డబ్బు వస్తుందా.. లేక మోసమా.. అనేది తేలుతుంది. -
అడ్డంగా మెక్కేశారు
సాక్షి ప్రతినిధి, కడప: పసిపిల్లల పౌష్టికాహారాన్ని అడ్డంగా బొక్కేశారు. పిల్లల నోటికాడి తిండి లాగేసుకున్న అధికారులకు ఆ పాపం వెంటాడుతోంది. ఉన్నతాధికారుల విచారణలో వాస్తవాలు వెలుగు చూడటంతో చిక్కులు తప్పడం లేదు. దీంతో ప్రొద్దుటూరు ఐసీడీఎస్ రూరల్ సీడీపీఓకు ఉచ్చు బిగుసుకుంది. క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారాన్ని సమైక్య ఉద్యమం ముసుగులో నొక్కేందుకు యత్నించారు. రవాణాదారులనుంచి ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ వరకు వారి వారి స్థాయిలో దండుకున్నారు. పౌష్టికాహారాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించాల్సిందిగా సీడీపీఓ ఆదేశాలు జారీ చేశారు. అ మేరకు అంగన్వాడీలు రికార్డులు తయారుచేశారు. ఈవైనాన్ని ముందుగా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో సూపర్వైజర్ సుశీలను సస్పెండ్ చేశారు. అనంతరం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈనేపధ్యంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి విచారణ చేపట్టారు. ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ మేరీఎలిజెబెత్కుమారి పరిధిలో రూ.10.7లక్షలు విలువ చేసే 1050 బస్తాల పౌష్టికాహారం పక్కదారి పట్టినట్లు నిర్ధారణకు వచ్చారు. ఉద్యమం ముసుగులో.... సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం జిల్లాలో ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ పరిణామాన్ని అనువుగా మలుచుకుని ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు చెందిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించారు. ట్రాన్సుపోర్టు నిర్వాహకుడు, ఇరువురు సూపర్వైజర్లు, ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ ఇందులో కీలకపాత్ర వహించారు. పౌష్టికాహారంపై ప్రశ్నించిన అంగన్వాడీ వర్కర్లకు సరఫరా చేసినట్లు రికార్డులు రూపొందించాలని రూరల్ సీడీపీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్లు రికార్డులు తయారుచేశారు. ఈవిషయాన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. విచారణకు ఆదేశాలు రావడంతో ఎంటీఎఫ్ పౌష్టికాహారం స్థానంలో తవుడు కలిపిన పిండి సరఫరా చేసినట్లు రూఢీ అయింది. ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ పరిధిలో 1050 బస్తాల పౌష్టికాహారాన్ని బొక్కేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీని విలువ రూ.10.70లక్షలుగా ఉన్నతాధికారులు అంచనా వేశారు.