డ్రామాలాడిస్తున్న బాబు, కిరణ్: గడికోట
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మొదట్నుంచి శాసనసభలో సమైక్యతీర్మానం కోసం పట్టుబట్టిందని రాయచోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ ఇరుప్రాంతాల నాయకులతో డ్రామాలాడిస్తున్నారని ఆయన విమర్శించారు.
బీఏసీ సమావేశాలకు హజరుకాని చంద్రబాబు, తెలంగాణ బిల్లును ముసాయిదాగా ప్రకటించిన సీఎం కిరణ్ మొదటి నుంచి సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉంటే ప్రయోజనం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్‌లకు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదని శ్రీకాంత్రెడ్డి అన్నారు.