'కడపపై శివరామకృష్ణన్ కమిటీ చిన్నచూపు'
కడప: కడపను శివరామకృష్ణన్ కమిటీ చిన్నచూపు చూసిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాయసీమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోద్యయోగ్యమైన ప్రాంతాన్నే నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను నిర్మూలించిన ఏకైక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు.
వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్ ప్రతి ఏటా చేస్తున్నదేనని, కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టు వెంటనే పంటల రుణమాఫీ చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.