sivarama krishnan committee
-
Amaravati: రాజధాని అను ఒక ‘రియల్’ ఎజెండా
పునర్వ్యవస్థీకరణ అనంతరం, కొత్తగా ఏర్పడ బోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. కమిటీ సభ్యులలో అందరూ సంబంధిత రంగంలో నిపుణులే. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివి : విజిటిఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి కనుక నీటి వనరులు, రవాణా, రక్షణ, చారిత్రక అంశాల ఆధారంగా రాజధాని నిర్మాణ ప్రదేశం ఎంపిక చేయాలి. విశాఖపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు. నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండవలసిన అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇంత స్పష్టంగా శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను అందించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదికను బుట్టదాఖలు చేసి, తన ‘రాజకీయ గురువు’ సూచించిన ‘అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అందులో భాగంగా 2014 జూలై 14న ‘నారాయణ కమిటీ’ని నియమించారు. ఆ కమిటీలో సభ్యులను చంద్రబాబు ప్రభుత్వమే నియమించింది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్ చౌదరి, మండవ ప్రభాకర్ చౌదరి, మరో ఐదుగురు సభ్యులతో ఆ కమిటీ ఏర్పడింది. అనంతరం రాజధాని ఏర్పాటుపై లీకులు మొదలయ్యాయి. నారాయణ కమిటీ రిపోర్టు పేరుతో దొనకొండ, నూజివీడు, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రాంతం ఉండవచ్చని ప్రచారాలు మొదలు పెట్టారు. అది నమ్మి కొందరు దొనకొండ, నూజివీడుల్లో వేల ఎకరాల భూములు కొని మోసపోయారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు, ఆయన సామాజిక వర్గ నేతలు మాత్రం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రాంతంలో భూములు కొన్నారు. మొదట నాగార్జున యూనివర్సిటీ దగ్గర, విజయవాడ–గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని రావచ్చని చంద్రబాబు తనకు చెప్పారని నక్కా ఆనంద్‌బాబు ఏబీఎన్ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. తర్వాత స్వయంగా చంద్రబాబే నర్మగర్భంగా గుంటూరు–విజయవాడ మధ్య రాజధాని వస్తుందని 2014 సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. 2014 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ 2014 సెప్టెంబర్‌లోనే కొంతమంది చంద్రబాబు అనుయాయులు 29 గ్రామాల పరిసరాల్లోని భూములు కొని అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు! ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్‌కు ముందే జరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి నిర్మాణం పేరుతో 34,000 ఎకరాల భూ సేకరణకు పూనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని శాసన సభ, శాసన మండలి, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను 200 ఎకరాల్లోనే ఉంచడం గమనించాల్సిన విషయం. ఏపీసీఆర్డీఏ యాక్ట్ ఫామ్ 9.14 బీ ప్రకారం ల్యాండ్ పూలింగ్‌లో ఒక్కో ఎకరానికి 250 సెంట్లు అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చే విధంగా రైతులతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్డీఏ ప్రాంతంలో ఎకరం రూ.15 లక్షలు ఉండేది. అయితే ‘హ్యాపీనెస్ట్’ పేరుతో జరిగిన విక్రయాల్లో ఎకరానికి రూ.10 కోట్ల రేటుకు సీఆర్డీఏ అమ్మింది. అంటే ల్యాండ్ పూలింగ్‌లో భూమి ఇచ్చిన ప్రతి రైతు ఎకరానికి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లేగా! ఇందులో త్యాగం ఎక్కడుంది? 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దండరాయని పాలెంలో రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు హాజరు కాలేకపోవటానికి కారణాలు చూపుతూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15నే చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న విధానం, కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా ఇస్తూ సీఆర్డీఏ 42 శాతం తీసుకోవటంలో ఉన్న స్కామ్‌ను తెలియ జేస్తూ.. చంద్రబాబు తన వర్గాన్ని బినామీలుగా పెట్టుకుంటూ భూదోపిడీకి పాల్పడుతున్నందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని నిర్మొహమాటంగా తెలియజేశారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) గుంటూరు–విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చింది. నవ నగరాల నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అమరావతిలో చంద్రబాబు 5 ఏళ్లలో కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు (ఇందులో సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది). అంటే ప్రతి సంవత్సరం పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే రాజధాని నిర్మాణానికి మరో 100 ఏళ్లు పడుతుంది. అయితే రాజధానిని ఆర్నెల్లలో పూర్తి చేయాలని 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూ యజమానులకు చెందిన పునర్నిర్మిత ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనీ; అమరావతి రాజధాని నగరంలో నివాసానికి అనువుగా ఉండేలా అప్రోచ్ రోడ్లు, తాగునీరు, ప్రతి ప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజీ మొదలైనవి ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది! (క్లిక్ చేయండి: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు) - పొనకా జనార్దన రెడ్డి మహా ప్రశాసకులు, ఏపీ ప్రభుత్వం -
బాబు తప్పులను సరిచేస్తున్నాం
సాక్షి, తిరుపతి/ తిరుపతి రూరల్: ‘చంద్రబాబు రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆయన మాయలో పడొద్దు. పాలనా వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) కమిటీ సలహాలను నీతి ఆయోగ్ కూడా తీసుకుంది. అమరావతి ఎక్కడికీ పోదు. అమరావతిని విద్యా కేంద్రంగా మార్చాలని బీసీజీ నివేదిక ఇచ్చింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవినీతి, స్వార్థ రాజకీయాలతో చంద్రబాబు చరిత్రహీనుడుగా నిలిచిపోయారు. అన్ని ప్రాంతాల అభివృద్దిని విస్మరించారు. ఆయన చేసిన తప్పులను మేం సరి చేస్తున్నాం’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం రాత్రి తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుపతి, చిత్తూరు ఎంపీలు బల్లి దుర్గాప్రసాద్‌రావు, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ... మరి రూ. 52 వేల కోట్లకు టెండర్లెందుకు? ‘రాజధానిపై శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికపై సైతం చంద్రబాబు మభ్యపుచ్చే యత్నం చేస్తున్నారు. అంతర్జాలంలో కమిటీ నివేదిక అందుబాటులో ఉంది. మూడు పంటలు పండే పొలాలున్న అమరావతిలో భవనాలు వద్దని, పాలనా వికేంద్రీకరణ ఉండాలని కమిటీ సూచించింది. చంద్రబాబు తొలుత ఏ నగర జనాభా ఎంతో తెలుసుకోవాలి. అమరావతిలో 29 గ్రామాల జనాభా అంతా కలిపితే లక్ష లోపే ఉంటుంది. అక్కడ భవనాలు కట్టేందుకు 130 అడుగుల వరకు పునాది తీయాలి. అమరావతి ప్రాంతం బంగారు పంటలు పండే స్థలం. రాజధాని కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశానని, ఇంకా రూ.3 వేల కోట్లు వెచ్చిస్తే చాలని చంద్రబాబు అంటున్నారు. మరి రూ.52 వేల కోట్ల పనులకు గతంలో ఎందుకు టెండర్లు పిలిచారు? రోడ్లు వేసేందుకు రూ.19,767 కోట్లు, లే అవుట్ల అభివృద్దికి రూ.17,910 కోట్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం రూ.11,752 కోట్లతో టెండర్లు పిలిచారు. కేవలం రూ.5,431 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో కూడా రూ.1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. గత ప్రభుత్వం పిలిచిన టెండర్ల ప్రకారం ఇంకా రూ.47 వేల కోట్లు కేవలం రాజధాని నిర్మాణానికే కావాలి’ బొత్స అన్నారు. బీసీజీ ప్రముఖ సంస్థ మాజీ మంత్రి నారాయణ ఏ రంగంలో నిపుణుడని ఆయన సారథ్యంలో గతంలో కమిటీని నియమించారు? తాజాగా నివేదిక ఇచ్చిన బీసీజీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న సంస్థ. గత ప్రభుత్వం కూడా బీసీజీ సిఫారసులు, సలహాలు తీసుకుంది. వాళ్లకు అనుకూలంగా ఇస్తే మంచివాళ్లా? లేదంటే అవినీతిపరులా? చెప్పేవి నీతులు.. చేసేది అవినీతి చంద్రబాబు చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ అవినీతి పనులు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్సీపీకి అధికారాన్ని ఇచ్చారు. ఒక్క నగరాన్ని నిర్మించేందుకు రూ.3 లక్షల కోట్లు వెచ్చించగలమా? పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయవద్దా? కడప ఉక్కు పరిశ్రమను నిర్మించుకోవద్దా?’ అని బొత్స ప్రశ్నించారు. పవన్‌పై బొత్స మండిపాటు పవన్ కల్యాణ్ రోజూ ఘీంకారాలు చేస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కాన్వాయ్ వెళ్తుంటే ఏ అధికారం ఉందని ఆపుతారు? రెండుచోట్ల ఓటమి పాలైన ఆయన ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం’ అని బొత్స పేర్కొన్నారు. -
పదవి పోయిందనే చంద్రబాబు విమర్శలు
సాక్షి, అమరావతి: సమన్యాయం, అధికార వికేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. పదవి పోయిందన్న ఉక్రోషంతో చంద్రబాబు స్థాయి మరచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విరుచుకుపడుతున్నారని దుయ్యబట్టారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై సభలో చర్చ జరుగుతుంటే అడ్డుకుని బయటకు పోయిన చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని తుగ్లక్ పాలనగా విమర్శించడం ఆయన సంస్కార హీనతకు నిదర్శనమన్నారు. తుగ్లక్ నిర్ణయాలు ఎవరివో ప్రజలకు బాగా తెలుసన్నారు. అందరి సలహాలతోనే ముందుకు.. రాజధానిపై ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలో ఇచ్చే నివేదికను ప్రజల ముందుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాకే ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయట పెట్టలేదని, కనీసం చట్టసభలో కూడా చర్చించలేదన్నారు. మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్ చెప్పారన్నారు. చాలా రాష్ట్రాల్లో సచివాలయం, హైకోర్టు వేర్వేరు చోట్ల ఉన్నాయని గుర్తు చేశారు. రాజధానిలో రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయన్నారు. 22 బిల్లులకు ఆమోదం ఈనెల 9 నుంచి 17వరకు జరిగిన శాసనసభలో 22 కీలక బిల్లుల్ని ఆమోదించినట్టు మంత్రి వివరించారు. దేశం మొత్తానికి మార్గదర్శకంగా నిలిచిన దిశ చట్టాన్ని తీసుకు వచ్చినందుకు ప్రపంచమంతా కొనియాడుతుంటే సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్షం వాకౌట్ చేసి మహిళల పట్ల తమ వైఖరిని చాటుకుందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ 200 రోజుల్లోనే చట్టం చేయడం విశేషమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల పేద పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దేలా ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టాలని సీఎం భావిస్తే దాన్ని కూడా ప్రతిపక్షం తప్పుబట్టిందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య దుయ్యబట్టారు. -
బహుళ రాజధానులే బహుబాగు
దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయి. దేశ ఈశాన్య భాగంలో ఉన్న ప్రిటోరియాను పరిపాలన రాజధానిగా, నైరుతి భాగాన ఉన్న కేప్‌టౌన్‌ను శాసన రాజధానిగా, దేశానికి మధ్య భాగంలో ఉన్న బ్లోమ్ఫౌంటేన్ను న్యాయ రాజధానిగా చేశారు. పరిపాలనా రాజధాని ప్రిటోరియాలో దేశ అధ్యక్షుడు, మంత్రి మండలితోసహా ప్రభుత్వ విభాగాల కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. శాసన రాజధాని కేప్‌టౌన్‌లో ఆ దేశ పార్లమెంట్ ఉంది. న్యాయ రాజధానిగా ఉన్న బ్లోమ్ఫౌంటేన్లో సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: బహుళ రాజధానుల వ్యవస్థ.. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో మంగళవారం చేసిన ప్రకటనతో ఈ అంశం జాతీయ స్థాయిలో ప్రధానంగా తెరపైకి వచ్చింది. ‘దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయి. మనమూ మారాలి. వికేంద్రీకరణ ఉత్తమం’ అని ఆయన స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో ‘రాజధాని అంటే ఒకటే ఉండాలా.. ఒకటికి మించి ఉండాలా’ అన్న విషయంపై మేధావులు, నిపుణుల నుంచి సామాన్యుల వరకు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అధికార వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ.. ప్రాంతీయ అసమానతలను పారదోలుతూ.. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థ మూల స్తంభంగా నిలుస్తోందని ప్రపంచ వ్యాప్తంగా పలు దృష్టాంతాలు స్పష్టీకరిస్తున్నాయి. ఉమ్మడి రాజధానిలో మొత్తం అధికార వ్యవస్థలను, అభివృద్ధిని హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడంతో రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులనూ ప్రస్తావిస్తున్నారు. విజయవంతంగా బహుళ రాజధానుల విధానం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి సాధించిన యూరోపియన్ దేశం నెదర్లాండ్స్‌లో కూడా రెండు రాజధానులు ఉన్నాయి. దేశానికి ఉత్తరాన ఉన్న ఆమ్స్టర్డామ్ నగరం శాసన రాజధానిగా ఉంది. ఆ నగరంలోనే పార్లమెంట్ ఉంది. దేశానికి దక్షిణాన ఉన్న ‘ద హేగ్’ నగరం పరిపాలనా రాజధానిగా ఉంది. అందులో ప్రభుత్వ అధికార యంత్రాంగం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. – ఆగ్నేయాసియా దేశం మలేషియాలో రెండు రాజధానులు ఉన్నాయి. కౌలాలంపూర్, పుత్రజయ నగరాల్లో రాజధాని ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1957 నుంచి 2001 వరకు కౌలాలంపూర్ రాజధానిగా ఉండేది. కాగా పెరుగుతున్న అవసరాలు తీర్చడంతోపాటు, ప్రాంతీయ సమాన అభివృద్ధి కోసం 2001లో అప్పటి దేశ అధ్యక్షుడు మహతీర్ మహ్మద్ పుత్రజయ నగరాన్ని నిర్మించి రెండో రాజధానిగా చేశారు. కౌలాలంపూర్.. పార్లమెంట్‌తో పాటు దేశానికి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. పుత్రజయ నగరాన్ని పరిపాలన, న్యాయ వ్యవస్థలకు రాజధానిగా చేశారు. – చిలీ, శ్రీలంక, యమన్, టాంజానియా, బెనిన్, బొలీవియా, బరుండీ, జెక్ రిపబ్లిక్, హండూరస్, ఇస్వటినీ, మాంటెనెగ్రో, పశ్చిమ సహారా, కోట్ డివోర్ దేశాల్లో రెండేసి రాజధానులు ఉన్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో రెండేసి ప్రధాన కేంద్రాలు మన దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ద్వి రాజధాని వ్యవస్థ కొనసాగుతోంది. శాసన, పరిపాలనా రాజధానిగా ఓ నగరం, హైకోర్టు కేంద్రంగా న్యాయ రాజధానిగా మరో నగరంలో ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రజల సౌలభ్యం కోసం హైకోర్టు బెంచ్‌లను మరో నగరంలో ఏర్పాటు చేశారు. ఏపీలో అధికార వికేంద్రీకరణే మేలు రాష్ట్రంలో అధికార వ్యవస్థను వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజధాని ప్రాంతం ఎంపికపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో వివిధ రంగాల నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ అధికార వ్యవస్థలను నవ్యాంధ్రప్రదేశ్‌లో ఒకే చోట ఏర్పాటు చేయకుండా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాలని ఆ కమిటీ స్పష్టంగా సూచించింది. కానీ ఆ కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని అధికార వ్యవస్థలను ఒకేచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసే దిశగా యోచిస్తోంది. ‘ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా సరిపోతుంది. అటు కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడం పట్ల రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక రాగానే బాగా పరిశీలించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆయన మాటలకు జనామోదం లభిస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల్లో కొన్ని... – ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. – రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి. – అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. – విజయవాడ– గుంటూరు, విశాఖపట్టణం కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి– నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. – శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. – విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములు నాశనమై ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది. – ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ప్రభుత్వ అధికార వ్యవస్థలను విస్తరించాలి. కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న భూముల వివరాలు అడిగినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇవ్వకపోవడం దురదృష్టకరం. – విజయవాడ– గుంటూరు నగరాల మధ్య ప్రాంతాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి (చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు. – విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పోలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. – సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. – విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జల మట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప క్షేత్రం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా అక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. – అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. -
రాజధానికి ముంపు గండం!
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘కుంభవృష్టి కురిస్తే? ఎగువ నుంచి భారీ వరద కృష్ణా నదికి వస్తే? స్థానికంగా కుంభవృష్టి కురిసినా, ఎగువ నుంచి భారీగా వరద వచ్చినా రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదు. రెండూ ఒకేసారి వస్తే రాజధాని ప్రాంతం మొత్తం కృష్ణా నదిలా మారడం ఖాయం’’ అని నిపుణులు చెబుతున్నారు. గత వారం కృష్ణానదికి గరిష్టంగా 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. రాజధాని ప్రాంతంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంకాస్త వరద పెరిగి ఉంటే.. అమరావతి పరిస్థితి ఏమిటి? స్థానికంగా వర్షాలు కురిసి కొండవీటి వాగు కూడా ఉప్పొంగి ఉంటే? తదుపరి పరిణామాలను ఊహించుకోలేం. రాజధాని ప్రాంతంలో ఫ్లడ్ లైన్స్ ఏపీ నూతన రాజధాని అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. వరద వస్తే మునిగిపోయే అవకాశం ఉన్న చోట రాజధాని నగరాన్ని ఏర్పాటు మంచిది కాదని ఈ కమిటీ హెచ్చరించింది. వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకూడదని తన నివేదికలో వెల్లడించింది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలు వరద భారీగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా పేర్కొంది. ఈ ప్రాంతాలను ‘రెడ్‌జోన్’గా గుర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన రాజధాని అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉంటుందని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ 82వ పేజీలో స్పష్టం పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో లో, మీడియం, హై ఫ్లడ్ లైన్స్ ఉన్నాయని తెలిపింది. 2018 ఏప్రిల్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలోనూ రాజధానికి వరద ముప్పు ఉందని 176వ పేజీలో ప్రస్తావించారు. 2018 ఏప్రిల్‌లో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలో ఈ ప్రాంతానికి వరద ముంపు ఉన్నదని చెబుతున్న భాగం నిపుణుల అంచనా ప్రకారం రాజధానికి పొంచి ఉన్న ప్రమాదం - కృష్ణా నది ఉప్పొంగడం వల్ల రాజధానికి వరద ముప్పు ఏర్పడుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన తర్వాత వచ్చే వరద ప్రవాహం అమరావతికి నష్టం కలిగించేదే. ఇటీవల శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వరదను నియంత్రించడంతో 10.6 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే ప్రకాశం బ్యారేజీకి వచి్చంది. దానికే అమరావతి ప్రాంతంలోని పొలాల్లో 5 అడుగుల నీళ్లు చేరాయి. అంతకంటే ఎక్కువ వరద వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. - భారీ ప్రవాహాలకు అవకాశం ఉన్న పలు ఉపనదులు, వాగులు, వంకలు నాగార్జున సాగర్ దిగువన చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. పైనుంచి వరద వచ్చినప్పుడు, సాగర్ దిగువన కూడా వర్షాలు కురిస్తే కృష్ణా నది ఉగ్రరూపం దాలుస్తుంది. అది రాజధానికి అత్యంత నష్టదాయకం. - స్థానిక వర్షాల వల్ల కొండవీటి వాగుకు మెరుపు వరద(ఫ్లాష్ ఫ్లడ్) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రాజధానికి ముప్పు పొంచి ఉంది. సాధారణ సమయాల్లో కొండవీటి వాగులో 4–5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ వస్తే నీటి ప్రవాహం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. - అటు కృష్ణా నది, ఇటు కొండవీటి వాగులో ఒకేసారి వరద ఉంటే రాజధానికి ముప్పు రెట్టింపవుతుంది. కొండవీటి వాగు నుంచి 4–5 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా మళ్లించినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. -
'చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ!'
-
చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీని నియమించారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం కలెక్టర్లతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. కేవలం అరగంటలోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని చంద్రబాబు చెప్పారు. నవంబర్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష ఎందుకు చేపడుతున్నానో వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో పంపించారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా 1999లో ప్రజలు తమను మళ్లీ గెలిపించారన్నారు. దీంతో ఇక మీదట కూడా అలా జరుగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం మనకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని, ఇంకా సెంటిమెంట్‌ను రాజేసే ధోరణే వారిలో కనిపిస్తుందని అన్నారు. జాన్ 2న సెలబ్రేషన్స్‌కు బదులు నవనిర్మాణ దీక్ష చేయనున్నట్లు చెప్పారు. నిన్న మొన్నటి వరకు రాజధాని ఎంపిక విషయంలో కూడా శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే కమిటీ వేశారంటున్నారు. -
రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చెంత?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని జోన్ నిర్మాణానికి భారీగానే సొమ్ము అవసరం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. అందులో వేటివేటికి ఎంతెంత కావాలో కమిటీ చెప్పింది. తాగునీరు, మౌలిక వసతులు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 1536 కోట్లు కావాలని తెలిపింది. రాజ్‌భవన్ కోసం 56 కోట్లు, సచివాలయం కోసం 68 కోట్లు, 8 రైల్వే జోన్ల నిర్మాణానికి 7,035 కోట్లు, అతిధి గృహాల నిర్మాణానికి 559 కోట్లు, డైరెక్టరేట్ల నిర్మాణానికి 6,658 కోట్లు అవసరమని సూచించింది. రాజధాని, ఇతర భవనాల ఏర్పాటుకు 27,092 కోట్లు అవసరమని పేర్కొంది. విమానాశ్రయాల అభివృద్ధికి 10,200 కోట్లు, హైకోర్టు సహా న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలకు 1271 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొంది. భూసేకరణ ఆలస్యమయ్యే కొద్ది రాజధాని నిర్మాణం ఆలస్యమౌతుందని కమిటీ పేర్కొంది. ఆర్థికలోటుతో అల్లాడుతున్న ఏపీకి ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం సముచితమని కమిటీ అభిప్రాయపడింది. త్వరలోనే ఎన్డీసీను సంప్రదించి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కల్పించాలని సూచించింది. అయితే తమవి కేవలం అభిప్రాయాలు, సూచనలేనని...రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. -
వేర్వేరు చోట్లే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం
ఏపీ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. రాజధానికి కావలసిన ప్రదేశం, అభివృద్ధి వికేంద్రీకరణ, శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఏర్పాటులతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ సూచనలిచ్చింది. రాజధాని కోసం వ్యవసాయ భూములు వినియోగించద్దని తన నివేదికలో పేర్కొంది. పర్యటనల ద్వారా సేకరించిన సమాచారాన్ని 187 పేజీల నివేదికలో పొందుపరచి కేంద్ర హోంశాఖకు అందజేసింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల లాంటి కీలక నిర్మాణాల ఏర్పాటు... వేరే వేరే చోట్ల జరగాలని సూచించింది. శాసనసభ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టు ఉండాలనేం లేదని ఈ సందర్భంగా గుర్తుచేసింది. పాలనపరంగా కీలకమైన సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయ ఏర్పాటుకు 20 ఎకరాలు అవసరమని శివరామకృష్ణన్ తెలిపింది. అసెంబ్లీ ఏర్పాటుకు 80 నుంచి 100 ఎకరాలు కావాల్సి ఉంటుందని పేర్కొంది. గవర్నర్ నివాసగృహం రాజ్‌భవన్ కోసం 15 ఎకరాలు కావాలని చెప్పింది. హైకోర్టు ఏర్పాటుకు విశాఖపట్నం నగరాన్ని పరిశీలించవచ్చని నివేదికలో సూచించింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాయలసీమ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. హైకోర్టు, దాని సంబంధిత వ్యవస్థ నిర్మాణానికి దాదాపు 100 నుంచి 140 ఎకరాలు అవసరమని చెప్పింది. -
రాజధాని అక్కడొద్దు.. బాబుకు కమిటీ షాక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ గట్టి షాకే ఇచ్చింది. ఇన్నాళ్ల పాటు విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిధి సముదాయమైన వీజీటీఎం ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని బాబు సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే మంత్రులతో ప్రకటనలు చేయించింది కూడా. అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రతిపాదనను తన నివేదికలో పూర్తిగా వ్యతిరేకించింది. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరమని సూచించింది. వీజీటీఎం పరిధిలో ప్రస్తుతమున్నది 1458 ఎకరాలే అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న భూముల ధరల ప్రకారం భూసేకరణ కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని అని చెప్పింది. పైగా భూసేకరణకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని వివరించింది. ఆర్థిక, సమయభావ కారణాల వల్ల... వీజీటీఎం రాజధాని ఏర్పాటుకు అనువైంది కాదని కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. -
పలువురి నేతల సంతృప్తి.. మరికొందరికి మింగుడు
-
టీడీపీలో ‘రాజధాని’ కలకలం
-
టీడీపీలో ‘రాజధాని’ కలకలం
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ప్రకంపనలు * పలువురి నేతల సంతృప్తి.. మరికొందరికి మింగుడుపడని వైనం * నివేదికలోని అంశాలపై మంత్రుల భిన్నాభిప్రాయాలు * తలోరకంగా మాట్లాడొద్దంటూ మంత్రులకు బాబు హుకుం * మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చిద్దామన్న సీఎం * కమిటీ నివేదికపై స్పందన కోరిన మీడియాపై చంద్రబాబు అసహనం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణాన్ని వికేంద్రీకరించటమే శరణ్యమని.. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన ప్రాథమిక నివేదికలో తేల్చిచెప్పటం రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నివేదికలోని అంశాలు కొందరికి సంతృప్తి కలిగించగా మరికొందరికి ఏమాత్రం రుచించలేదు. కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెరవెనుక రియల్ ఎస్టేట్ వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్న పలువురు టీడీపీ నేతలకు కమిటీ సూచనలు మింగుడుపడలేదు. దాంతో వారు హడావుడిగా ఢిల్లీ నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. కొత్త రాజధాని నిర్మాణంలో కేంద్ర సాయం ఎంతో అవసరమైన పరిస్థితుల్లో ఆ కమిటీ సిఫారసులు కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పలువురు నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఇదిలా ఉంటే.. నివేదికపై రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ లాబీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. అవన్నీ ఎప్పటికప్పుడు టీవీ చానళ్లలో స్క్రోలింగ్‌ల రూపంలో రావడంతో అసెంబ్లీలో తన చాంబర్లో ఉన్న సీఎం చంద్రబాబు వారందరినీ హడావుడిగా పిలిచి సమావేశం నిర్వహించారు. రాజధానిపై ఇష్టానుసారం వారు మాట్లాడవద్దని హుకుం జారీచేశారు. అంతా అనుకున్నట్లే జరుగుతుంది..! రాజధానిపై అంతా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లే జరుగుతుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రులకు బాబు సూచించారు. ‘రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడితే కొత్త సమస్యలు వస్తాయి. అంతిమంగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రులు సమన్వయం లేకుండా మాట్లాడితే చిక్కులు కొనితెచ్చుకుంటామని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. సెప్టెంబర్ ఒకటిన జరిగే మంత్రివర్గంలో దీనిపై సమగ్రంగా చర్చిద్దామని సూచించారు. మీడియా ఇష్టానుసారం ప్రచారం చేస్తోంది: బాబు శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులపై అభిప్రాయం తెలిపాలని కోరిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు అసహనం వ్యక్తపరిచారు. గురువారం అసెంబ్లీ వాయిదాపడ్డ తర్వాత మీడియా ప్రతినిధులు ఆయన వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. బాబు అసహనంగా స్పందిస్తూ.. ‘‘రాజధానిపై మీడియా ఎవరిష్టానుసారం వారు ప్రచారం చేస్తున్నారు. రాజధాని ఎక్కడనే అంశంపై ఏదీ తేలకుండానే ఏవేవో ప్రాంతాలను ప్రచారంలో పెడుతూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, దొనకొండ, వినుకొండ అంటూ ఎవరికి తోచినట్లు వారు చెప్పేస్తున్నారు. ఇది సరికాదు. అలా వార్తలు ప్రచారం చేస్తూ దానిపై మళ్లీ నా అభిప్రాయం చెప్పమంటున్నారు. అసలు రాజధాని కమిటీ నివేదిక గురించి మాకెలాంటి సమాచారమూ లేదు. మాకు నివేదికా రాలేదు. అది వచ్చాక రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు మంత్రులు లాబీల్లో పలు అభిప్రాయాలు వెల్లడించారు. రాజధాని గుంటూరు - విజయవాడ మధ్యే ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని వద్దని కమిటీ చెప్పలేదని, ఇంకా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని మంత్రి నారాయణ తెలిపారు. పంట భూములను రాజధాని కోసం తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాజధాని ఎంపిక నిర్ణయం ప్రభుత్వానిదే.. కమిటీ సూచించిన మార్గాల్లో ఏది మంచో ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాజధాని అడవుల్లో ఉంటే ఏం బాగుంటుందని వ్యాఖ్యానించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అయినా ఎడారిలా ఉంటుంది. అదే న్యూయార్క్ నగరం రాజధాని కాకపోయినా నిత్యం హడావుడిగా ఉంటుందని యనమల చెప్పుకొచ్చారు. అది గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదిక!: హోంశాఖ వర్గాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై కె.సి.శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిందని, అందులోని అంశాలు ఇవీ అంటూ వస్తున్న వార్తలు సరికాదని, అది కేవలం గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికేనని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. శివరామకృష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే దీనిని శుక్రవారం లేదా సోమవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలనకు వెళుతుందని ఆ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి పరిశీలన తరువాతే ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుందని వివరించాయి. -
చంద్రబాబుకు కమిటీ భయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుంది. మూడు జోన్లుగా రాజధానిని ఏర్పాటుచేయడమే ఉత్తమమని, ఒకచోట మొత్తం అభివృద్ధిని కేంద్రీకరిస్తే సమస్యలు తప్పవని శివరామకృష్ణన్ కమిటీ తన తుది నివేదికలో చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. ఈ విషయమై చర్చించేందుకు మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ వాయిదా పడటంతో వెంటనే అందుబాటులో ఉన్న మంత్రులందరితో సమావేశం ఏర్పాటుచేసి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన తుది నివేదికలోని అంశాలపై వారితో చర్చించారు. ఎవరు పడితే వాళ్లు ఎలా పడితే అలా ప్రకటనలు చేయొద్దని క్లాసు పీకినట్లు సమాచారం. రాజధాని అంశంలో మంత్రులెవరూ భిన్ప ప్రకటనలు చేయొద్దని, కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే రాజధానిని ప్రకటిస్తామని ఆయన అన్నారు. కేవలం అసెంబ్లీ, సచివాలయం, కొన్ని ప్రధాన కార్యాలయాలను మాత్రమే విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పాటుచేసి, హైకోర్టు, ఇతర కార్యాలయాలను ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కేటాయించాలని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు చంద్రబాబుకు గుబులు పట్టుకుంది. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు లాంటివాళ్లు ఇప్పటికే రాజధాని గురించి ప్రకటనలు చేయడం, విజయవాడ - గుంటూరు మధ్యనే వస్తుందని చెప్పడం, కమిటీ విషయాన్ని సీఎం, పీఎం చూసుకుంటారనడంతో ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్నట్లు తయారైంది. చంద్రబాబుతో సహా మంత్రులంతా విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పారు. అయితే కమిటీ ఇందుకు విరుద్ధంగా చెప్పింది. ఇదే ఇప్పుడు వాళ్లందరినీ ఆలోచనలో పడేసింది. -
ఏపీ రాజధాని నిర్మాణానికి భారీ ఖర్చు
-
రియల్ రాజధాని
► ఎవరి కోసం ఇది? ► భవిష్యత్ తరాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసమన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనుమానాలు ► భూసేకరణ సహా అన్నిటిపైనా కొరవడిన స్పష్టత.. ప్రాంతాల పేర్లు మారుస్తూ లీకులు; ప్రకటనలు ► ధరలకు రెక్కలతో ఇప్పటికే రైతుల చేతుల్లోంచి జారిపోయిన భూమి ► కనీసం 30వేల ఎకరాలుంటే ప్రణాళికాబద్ధ రాజధాని ► చుక్కల్లో ధరలతో ఆ స్థాయి సేకరణ అసాధ్యం ► భూముల లభ్యత సులభమైతేనే నయమంటున్న నిపుణులు.. ► అలాగైతేనే బతకడానికొచ్చే సామాన్యులకు చోటు సాక్షి, హైదరాబాద్: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే ఇపుడు ఆంధ్రప్రదేశ్ యావత్తూ రాబోయే రాజధాని చుట్టూరా తిరుగుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే ప్రభుత్వమే అలా తిప్పుతోంది. రాజధాని అనేది ప్రజలకోసమని, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా, వారి భవిష్యత్ నివాసానికి అనువైనదిగా ఉండాలన్న ధ్యాసే విస్మరించి... రాజధానిని భూముల ధరలు పెంచుకోవడానికి పనికివచ్చే సాధనంలా చూస్తోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ముందే భారీగా భూములు కొనిపెట్టుకున్న రాజకీయ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోంది. విజయవాడ- గుంటూరు మధ్యనంటూ ఒకసారి... అమరావతి దగ్గరంటూ మరోసారి... వీజీటీఎం పరిధిలోనంటూ ఇంకోసారి... నూజివీడు, వినుకొండ ప్రాంతాల్లోనంటూ ఇప్పుడు... ఇలా రకరకాలుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ప్రభుత్వ పెద్దలే పలు లీకులు ఇచ్చారు. ‘విజయవాడ-గుంటూరు మధ్య అయితేనే రాష్ట్రం మధ్యలో ఉన్నట్టు. అక్కడైతేనే అన్ని ప్రాం తాల వారికీ అందుబాటులో ఉంటుంది’ అని శివరామకృష్ణన్ కమిటీ పర్యటనకు ముందే చంద్రబాబు ప్రకటించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు సైతం తరచూ రాజధానిపై ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ప్రకటనలిచ్చిన ప్రతిసారీ అక్కడ భారీ ఎత్తున భూములు చేతులు మారుతూ అగ్రిమెంట్లు చేసుకోవటం తెలియనిదేమీ కాదు. నిజానికి ఇలా ప్రభుత్వం లీకులిచ్చిన ప్రాంతాలన్నిటా భూమి ఇప్పటికే రైతుల చేతుల్లోంచి నేతలు, వ్యాపారులు, దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇపుడు ధర పెరిగినా... ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి 40 శాతమో, 50 శాతమో భూ యజమానులకిచ్చినా బాగుపడేది ఈ దళారులు, రియల్ వ్యాపారులే తప్ప రైతులు కారన్నది వాస్తవం. భూ సేకరణ సాధ్యమయ్యేనా? ఇపుడున్న ధరవరల్లో భూ సేకరణ సాధ్యం కాదని, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరువగా ఉండే ప్రాంతమైతేనే రాజధానికి బాగుంటుందని శివరామకృష్ణన్ కమిటీ సైతం పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆ స్థాయిలో లేవు. ప్రయివేటు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసి అందులో రెతులకు భాగస్వామ్యం కల్పిస్తామని, ‘ల్యాండ్ పూలింగ్ చేస్తామ’ని ప్రభుత్వం చెబుతోంది. 60:40, 70:30లో రైతులకు వాటాలిస్తామంటోంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటే 60 నుంచి 65 శాతం భూమిని రోడ్లు, గ్రీనరీ తదతరాలకు వదిలిపెట్టాలి. ఇలాచేస్తే మిగిలే 35 శాతంలో భూ యజమానులకు దక్కేదెంతన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ వారి చేతికి కొంత భూమి వచ్చినా... ఇప్పటికే భారీ ధరల వద్ద కొనుగోలు చేసి... దాన్లో ప్రభుత్వానికి 60 శాతమో, 70 శాతమో ఇచ్చేయగా మిగిలిన భూమిని వారేం చేస్తారు? అందులో వారు కట్టే భవనాలు గానీ, ఇళ్లు గానీ ఎవరికి అందుబాటులో ఉంటాయి? వాటి ధరలు ఏ స్థాయిలో ఉంటాయి? రాజధానిలో బతుకుదామనో, ఉద్యోగాల కోసమో వచ్చినవారు వీటిని భరించగలరా? ప్రభుత్వం ఈ ఆలోచనలన్నీ మానేసి కేవలం కొందరు వ్యాపారులు, నాయకులకు ప్రయోజనం చేకూర్చడానికే తానున్నట్టు వ్యవహరిస్తుంటే ఏమనుకోవాలి? అసలు ప్రభుత్వ భూములో, డీ నోటిఫై చేసేందుకు వీలుగా అటవీ భూములో భారీగా ఉన్న ప్రాంతం వైపు ప్రభుత్వం ఎందుకు చూడటం లేదు? అక్కడైతే భూములపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది కనక భవిష్యత్‌లో పేదలకు సైతం ప్రభుత్వమే అందుబాటు ధరల్లో ఇళ్లు అందించే అవకాశం ఉంటుందిగా? రాజధాని ఎక్కడనేది ఇక్కడ ప్రశ్నే కాదు. కానీ అందరికీ చేరువలో ఉండటంతో పాటు అందరికీ బతకడానికి అందుబాటులో ఉండటం కూడా ముఖ్యమన్న సంగతి మన ప్రభుత్వం ఎందుకు మరిచిపోతోంది? ఇదే అంశంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ‘రియల్’ రాజధాని? రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల కమిటీని వేసింది. అది దేశవిదేశాల్లోని పలు ప్రాంతాలను సందర్శించనుంది. అహ్మదాబాద్ (గుజరాత్), నయా రాయపూర్ (చత్తీస్‌ఘర్), భువనేశ్వర్ (ఒరిస్సా) ఛండీఘడ్లతో పాటు విదేశాల్లోనూ పర్యటించనుంది. మరి ఆయా రాజధానులు మనలా రియల్ ఎస్టేట్ నీడలో నిర్మితమయ్యాయో, ప్రభుత్వ భూము ల్లో ప్రణాళికాబద్ధంగా నిర్మితమయ్యాయో చూద్దాం.... రాష్ట్రాన్ని సింగపూర్‌ను చేస్తానంటోంది ప్రభుత్వం. కానీ సింగపూర్ 714.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమైంది. 1960లలో 581 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ఈ పట్టణం ఇపుడు 723.2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. 2033 నాటికి మరో 100 చదరపుకిలోమీటర్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాక ఛత్తీస్‌గఢ్ తన కొత్త రాజధానిని నయా రాయపూర్ పేరిట నిర్మించుకుంది. చత్తీస్ఘడ్ రాజధానిగా నయా రాయపూర్ 8 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాజధాని నిర్మాణం కోసం 41 గ్రామాల ప్రజలను అక్కడినుంచి తరలించారు. మొత్తం భూమి లో సగం రోడ్లు, పార్కులు, ప్రజోపయోగం, నీటి సదుపాయాల ఏర్పాటు, గ్రీన్‌బెల్టుల కోసం వినియోగించారు. 23 శాతం భూమిని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆడిటోరియంలకు కేటాయించారు. 30 శాతం భూమిని గృహోపయోగం, వాణిజ్యావసరాలకు కేటాయిం చారు. ఒరిస్సాల్లో ఎన్ని వెనకబడిన జిల్లాలున్నా రాజధాని భువనేశ్వర్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, పంజాబ్-హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగ ఢ్ కూడా ప్రత్యేకమైనవే...భువనేశ్వర్ 393.57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 1948లోనే ఈ నగరానికి ప్రణాళికలు వేశారు. విద్యాసంస్థలు, షాపింగ్ కాంపెక్సులు, వైద్యశాలలు, ఆటస్థలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, అసెంబ్లీ, రాజభవన్, సచివాలయంతోపాటు ప్రయివేటు గృహోపయోగానికి కూడా వేర్వేరుగా భూమిని కేటాయించారు. ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. గుజరాత్ రాజధాని నగరంగా ఉన్న గాంధీనగర్‌లో 205 చదరపు కిలోమీటర్ల మేర ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. భూమిని వివిధ భవిష్యత్తు అవసరాలకోసం పలు విభాగాలుగా కేటాయింపులు చేశారు. గాంధీనగర్ చుట్టూ భారీ భూభాగాన్ని రాజధాని టెరిటోరియల్ ప్రాంతంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఛండీఘర్: పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధాని నగరంగా ఉన్న ఛండీఘర్ నగరం 114 చరదపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. రాజధానికేం కావాలి? రాజధానికి తక్షణావసరాలైన పరిపాలన భవనాలే కాదు. భవిష్యత్తు అవసరాలూ ఉంటాయి. అసెంబ్లీ, సచివాల యం, హైకోర్టు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు, ప్రభుత్వ డెరైక్టరేట్లు, కమిషనరేట్లు, కార్పొరేషన్ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు, అమ్యూజ్మెంటు పార్కులు, ధియేటర్లు, సమావేశ మందిరాలు, శిక్షణ కేం ద్రాలు, పరిశోధన కేంద్రాలు, విశాలమైన రోడ్లు, పచ్చదనం కోసం ఉద్యానవనాలు, చక్కని డ్రెయినేజి వ్యవస్థ ఇలా అనేకం ఉండాలి. పాలన భవనాలు మధ్యలో కేంద్రీకృతమైతే రాకపోకలు సాగించేందుకు విశాలమైన రహదారులుండాలి. 960 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన హైదరాబాద్‌లో ఉదాహరణకు బేగంపేట మెయిన్ రోడ్నే చూస్తే నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయి నరకం కనిపిస్తోంది. అం దుకని ప్రణాళికా బద్ధంగా నిర్మించే కొత్త రాజధానిలోనైనా ఇలాంటివన్నీ ముందే ఊహించి... రోడ్డుకిరువైపులా పదేసి లేన్లుండేలా రహదారుల నిర్మాణం జరగాలి. అలాగైతేనే కార్లకు 5 లేన్లు, బస్సులకు 2 లేన్లు, బైక్‌లకు మరో లేను... పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సైకిళ్లకు మరో లేను కేటాయించడానికి వీలవుతుంది. ఈ రోడ్లపై గ్రీన్ జోన్లు ఇతరత్రా అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే పాలన భవనాలకు అటు 6, ఇటు 6 కిలోమీటర్ల మేర... అంటే 12 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. పొడవు / వెడల్పు చూస్తే 12/12 మొత్తం 144 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. 144 చదరపు కిలోమీటర్లలో విస్తరించడానికి నిపుణుల అంచనాల మేరకు కనీసం 30 వేల ఎకరాలు అవసరం. మరి ప్రభుత్వ పెద్దలు అధికారిక లీకులిస్తున్న ప్రాంతాల్లో ఇంత స్థాయిలో భూమి అందుబాటులో ఉందా? ఆ ప్రాంతాల్లో సేకరణ సాధ్యమా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రావటం అసాధ్యం. -
'రాజధాని కోసం ప్రైవేట్ భూములు కొనొద్దు'
కడప: నూతన అంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల కొనుగోలు సరికాదని వైఎస్ఆర్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని సూచించారు. శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రుల ప్రత్యేక హోదా, ప్యాకేజీల గురించి ఒక్క అడుగు ముందుకు కదల్లేదని మైసూరారెడ్డి విమర్శించారు. -
'కడపపై శివరామకృష్ణన్ కమిటీ చిన్నచూపు'
కడప: కడపను శివరామకృష్ణన్ కమిటీ చిన్నచూపు చూసిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాయసీమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోద్యయోగ్యమైన ప్రాంతాన్నే నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను నిర్మూలించిన ఏకైక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్ ప్రతి ఏటా చేస్తున్నదేనని, కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టు వెంటనే పంటల రుణమాఫీ చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
రాజధానిగా కర్నూలే అనుకూలం
కర్నూలు(కలెక్టరేట్): నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా కర్నూలు అన్నివిధాలా అనుకూలమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ మేరకు జిల్లా ప్రజానీకంతో పాటు ప్రజా సంఘాలు ఒక్కతాటిపై ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నేడు జిల్లాకు రానుండటంతో రాజధానిగా కర్నూలు ఏవిధంగా అనుకూలమో తెలియజెప్పేందుకు వివిధ వర్గాలు సన్నద్ధమయ్యాయి. కమిటీకి నేతృత్వం వహిస్తున్న శివరామకృష్ణన్‌తో పాటు సభ్యులు అరోమార్ రవి, జగన్‌షా, కె.టి.రవీంద్రన్, పరిశోధన సలహాదారు నితిన్.కె, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ డెరైక్టర్ తిమ్మారెడ్డి సోమవారం జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. 1956లో రాజధానిని త్యాగం చేసినందున ఇప్పుడు విధిగా కర్నూలునే తిరిగి రాజధానిగా ఎంపిక చేయాలనే డిమాండ్ ఉద్ధృతమవుతోంది. అప్పుడే పెద్ద మనుషుల ఒప్పందానికి విలువనిచ్చినట్లని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్న శివరామకృష్ణన్ కమిటీ.. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనుంది. కర్నూలే ఎందుకంటే... 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం మేరకే రాజధానిని ఎంపిక చేశారు. తెలంగాణ ప్రాంతంలో 1956లో ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఎంపికైంది. విశాలాంధ్ర కోసం రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిని త్యాగం చేశారు. 1956కు ముందున్న రాష్ట్రమే తిరిగి ఏర్పడటంతో కర్నూలునే రాజధానిగా ఎంపిక చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రభుత్వ భూములు లేవు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలంటే ప్రైవేట్ భూములను సేకరించాల్సి ఉంది. కొత్త భూసేకరణ చట్టంతో ఆ ప్రక్రియ అంత సులువు కాదని తెలుస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో 30వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం రాజధాని ఎంపికకు అనుకూలమనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. రాజధాని నిర్మాణంలో కీలకమైన తాగునీటి వనరులు పుష్కలంగా ఉండటం. శ్రీశైలం ప్రాజెక్టు జిల్లాలోనే ఉండటం అదనపు బలం. కర్నూలు మీదుగా వివిధ రాష్ట్రాలను కలుపుతూ నాలుగులైన్ల జాతీయ రహదారులు ఉండటం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలను కలుపుతూ రైలు మార్గాలు. కర్నూలు, నంద్యాల, ఆదోనిల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా రైళ్లు. కర్నూలుకు అత్యంత సమీపంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మాణానికి అనువైన భూములు. ఇప్పటికే సంబంధిత అధికారుల పరిశీలన పూర్తి కావడం కలిసొచ్చే అంశం. పారిశ్రామికాభివృద్ధికి కర్నూలు అన్ని విధాలా అనుకూలం. జిల్లాలో ఐరన్ ఓర్ విస్తారంగా లభిస్తుంది. గ్రానైట్‌కు జిల్లా పెట్టింది పేరు. ముగ్గురాయి, సున్నపురాయి.. ఇలా అనేక ఖనిజాలకు నెలవు. తుగ్గలి, మద్దికెర తదితర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల పంటలు పండుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఖనిజ సంపద జిల్లాలో ఉంది. పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కర్నూలు జిల్లానే అన్ని రంగాల్లోను వెనుకబడి ఉంది. ఇంతవరకు జిల్లాలో చెప్పుకోదగిన విద్యాసంస్థ ఒక్కటీ లేదు. వెయ్యి మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ లేదు. వనరులు పుష్పలంగా ఉన్నా అభివృద్ధికి నోచుకోకపోవడం. -
మాది టెక్నికల్ నివేదిక మాత్రమే!
రాజమండ్రి: రాజధాని ఎంపిక తమ పనికాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ చెప్పారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఎంపికకు సంబంధించి ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న విశాఖలో పర్యటించిన ఈ కమిటీ సభ్యులు ఈ రోజు రాజమండ్రిలో పర్యటించారు. రాజానగరం ఫారెస్ట్ భూములను పరిశీలించారు. ఆగస్టు 31లోగా నివేదిక సమర్పిస్తామని రతన్ రాయ్ చెప్పారు. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, వనరుల లభ్యతలను పరిశీలిస్తున్నట్లు రతన్ రాయ్ వివరించారు. రాజధానికి అనువైన ప్రదేశాలు సీమాంధ్రలో చాలా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో సీమాంధ్ర గొప్ప రాష్ట్రంగా ఉద్భవిస్తుందని చెప్పారు. ఈ కమిటీ రేపటి నుంచి రెండు రోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటించనుంది. -
రహస్యంగా శివరామకృష్ణన్ కమిటీ పర్యటన
విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం విశాఖలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ పర్యటన రహస్యంగా కొనసాగుతోంది. మీడియాకు సమాచారం ఇవ్వద్దంటూ కమిటీ సభ్యులు డటీఆర్వోకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించడానికి సీఐఐ, వీడీసీ, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికివారే ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. సీమాంధ్ర రాజధానిగా అవతరించేందుకు మహా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఈ ప్రాంతీయుల నిశ్చితాభిప్రాయం. రాజధానిగా ఈ ప్రాంతాన్నే ప్రకటించాలంటూ అనేక గళాలు ఎలుగెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.