
రహస్యంగా శివరామకృష్ణన్ కమిటీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం విశాఖలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ పర్యటన గోప్యంగా కొనసాగుతోంది.
విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం విశాఖలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ పర్యటన రహస్యంగా కొనసాగుతోంది. మీడియాకు సమాచారం ఇవ్వద్దంటూ కమిటీ సభ్యులు డటీఆర్వోకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించడానికి సీఐఐ, వీడీసీ, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎవరికివారే ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. సీమాంధ్ర రాజధానిగా అవతరించేందుకు మహా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఈ ప్రాంతీయుల నిశ్చితాభిప్రాయం. రాజధానిగా ఈ ప్రాంతాన్నే ప్రకటించాలంటూ అనేక గళాలు ఎలుగెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.