శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు
రాజమండ్రి: రాజధాని ఎంపిక తమ పనికాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ చెప్పారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఎంపికకు సంబంధించి ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న విశాఖలో పర్యటించిన ఈ కమిటీ సభ్యులు ఈ రోజు రాజమండ్రిలో పర్యటించారు. రాజానగరం ఫారెస్ట్ భూములను పరిశీలించారు. ఆగస్టు 31లోగా నివేదిక సమర్పిస్తామని రతన్ రాయ్ చెప్పారు.
పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, వనరుల లభ్యతలను పరిశీలిస్తున్నట్లు రతన్ రాయ్ వివరించారు. రాజధానికి అనువైన ప్రదేశాలు సీమాంధ్రలో చాలా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్లో సీమాంధ్ర గొప్ప రాష్ట్రంగా ఉద్భవిస్తుందని చెప్పారు. ఈ కమిటీ రేపటి నుంచి రెండు రోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటించనుంది.