కసి ఉంటే నాపై తీర్చుకోండి | ys vivekananda reddy warns TDP over attacks | Sakshi
Sakshi News home page

కసి ఉంటే నాపై తీర్చుకోండి

Published Wed, Mar 1 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

కసి ఉంటే నాపై తీర్చుకోండి

కసి ఉంటే నాపై తీర్చుకోండి

తమ పార్టీ ప్రజా ప్రతినిధుల జోలికొస్తే ఊరుకోబోమని వైఎస్‌ వివేకా హెచ్చరిక

కడప అగ్రికల్చర్‌: టీడీపీ నాయకులు తనతో కానీ, తన కుటుంబంతో కానీ రాజకీయంగా ఎదుర్కొని తేల్చుకోవాలని వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డి సవాల్‌ చేశారు. అంత కసి ఉంటే తనపైన, తన కుటుంబంపైన తీర్చుకోవాలేగానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడటం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

మంగళవారం వైఎస్సార్‌ జిల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల కుటుంబాలను అంతమొందిస్తామని టీడీపీ నేతలు బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలకు దిగమని చెప్పినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బలహీనవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రభుత్వమే దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అని వివేకా అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని పంపించాలని కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement