కడప వెళ్తున్న సపక్ తక్ర జట్లు
Published Tue, Aug 16 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్ (అండర్–19) సపక్‌తక్ర జట్లు రాష్ట్రపోటీల కోసం బుధవారం ఇక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్తున్నట్లు జిల్లా సపక్‌తక్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంగా ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్లను సోమవారం ఎంపికచేసిన విషయం తెలిసిందే. ఎంపికైన క్రీడాకారులంతా ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తమ లగేజితోపాటు వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్, పాస్‌ఫోటోలతో చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సపక్‌తక్ర సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement