
'కృపాకర్ ను హత్య చేసివుంటారు'
కడప: శాంతి సంఘం అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్ కుమారుడు కృపాకర్ ఐజాక్ కుటుంబ సభ్యుల మృతి కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్ జిల్లా పౌరహక్కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. జియోన్ పాఠశాలలో కృపాకర్, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని గురువారం సందర్శించారు.
ఆర్థికపరమైన కారణాలే వీరి మృతికి కారణమైవుంటాయని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మనోహర్ రెడ్డి అన్నారు. కృపాకర్ ను కూడా హత్య చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.