కోటి మందిని స్థానికులు కాదంటారా? | Ravela Kishore Babu Slams Telangana Govt Decision | Sakshi
Sakshi News home page

కోటి మందిని స్థానికులు కాదంటారా?

Published Fri, Aug 15 2014 5:57 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

కోటి మందిని స్థానికులు కాదంటారా? - Sakshi

కోటి మందిని స్థానికులు కాదంటారా?

కడప: కోటి మంది తెలంగాణ ప్రజలను స్థానికులు కాదనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, ప్రాణాలర్పించిన వారిని స్థానికేతరులు అనడం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని అంతకుముందు కిషోర్బాబు పిలుపునిచ్చారు. సర్వే ఫార్మాట్‌లో ‘ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే’ కాలమ్‌లోనూ ఇదే విషయాన్ని పొందుపరచాలని సూచించారు. ఇలా చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. రాజధాని కావడంతో హైదరాబాద్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎంతోమంది స్థిరపడ్డారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement