ప్రతీకాత్మక చిత్రం
విజయనగరం పూల్‌బాగ్ : కాపు, బలిజ. తెల గ, ఒంటరి కులాల నిరుద్యోగులకు ఫినిషింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఇన్‌మల్టీ మీడియా, ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ వారు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వీ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ శిక్షణా శిబిరాన్ని కాపు కార్పొరేషన్, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు.
అభ్యర్థులకు భోజన వసతి కల్పి స్తామని పేర్కొన్నారు. స్త్రీలు, పురుషులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వసతులను ఉపయోగించుకోని వారికి నెలకు రూ.5వేలు స్టయిఫండ్ ఇస్తాని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, పాలిటెక్నిక్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.
శిక్షణలో ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు జీతంతో ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగలవారు ఈనెల 20న ఉదయం 10 గంటలకు విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాయానికి హాజరుకావాలని సూచించారుర. మరిన్ని వివరాలకు 7674826174, 733117 2074, 7331172075, 73331172076 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment