Film Making
-
మెరుగైన సినిమాలే లక్ష్యంగా ‘సినిమాటిక్ ఎక్స్’ : పి.జి. విందా
తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎందరో గొప్ప దర్శకులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ సినీ రంగానికి అనువైన చోటు. షూటింగ్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, షూటింగ్ కోసం రావాలంటే అందరికీ అనువుగా ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. అందుకే హైదరాబాద్‌లో సినిమాటిక్ ఎక్స్పో నిర్వహించాం. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎక్విప్ మెంట్ గురించి ముందే తెలుస్తుంది. దాంతో సాంకేతికంగా ఇంకా మెరుగైన సినిమాలను అందించగలం’ అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు పి.జి విందా. సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడంతో పాటు, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమాటిక్ ఎక్స్పో రెండో ఎడిషన్‌కు మంచి స్పందన లభిచింది. ఈ నేపథ్యంలో తాజాగా పి.జి విందా మీడియాతో ముచ్చటిస్తూ ‘సినిమాటిక్ ఎక్స్పో’గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..2004 వచ్చిన గ్రహణం చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి మీడియా నాకు ఇస్తున్న సపోర్ట్ ను మరువలేను. గ్రహణం సినిమాటోగ్రఫీకి నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. నిజానికి ఆ సమయంలో డిజిటల్ అంతగా లేదు. ఇండియాలో తొలుత డిజిటల్ చిత్రీకరణ జరుపుకున్న సినిమాల్లో గ్రహణం ఒకటి. రాబోయే ఐదు, పదేళ్లలో డిజిటల్ దే హవా ఉంటుందని అప్పుడే చెప్పాను. నా అంచనానే నిజమైంది.నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయం నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి దేశ విదేశాలు వెళ్తుంటాను. ముఖ్యంగా విదేశాల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఎక్స్పో లు, ఎగ్జిబిషన్ లు నిర్వహిస్తుంటారు. మన దేశంలో ప్రత్యేకంగా సినీ పరిశ్రమ కోసం ఆ స్థాయి ఎక్స్పో లు లేవు. అదే ఈ సినిమాటిక్ ఎక్స్పో కు బీజం పడేలా చేసింది.తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మేము నిర్వహించిన సినిమాటికా ఎక్స్పో మొదటి ఎడిషన్ కి గొప్ప స్పందన లభించింది. ఆ ఉత్సాహంతోనే రెండో ఎడిషన్ ని మరింత అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయించాము. దీనికి ఏకంగా విశేష స్పందన లభించి, ఏకంగా 38 వేల మంది హాజరు కావడం అనేది ఆసియాలోనే రికార్డు.ఫిల్మ్ మేకింగ్ పై ఇప్పుడు ఎందరో ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అందుకే సినిమాటికా ఎక్స్పో ద్వారా సాంకేతికతను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి తగు సూచనలు చేస్తూ సెమినార్లు నిర్వహించాము. సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి సినీ ప్రముఖులు.. స్టోరీ రైటింగ్, సినిమాటోగ్రఫీ గురించి ఎంతో నాలెడ్జ్ ని పంచారు.ఈ స్పందన చూసిన తర్వాత సినిమాటికా ఎక్స్పో మూడో ఎడిషన్ ను మరింత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం రావడానికి అంగీకారం తెలిపాయి.తెలుగు సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వంగా గారు సహా అందరి మద్దతు ఉంది. అలాగే ప్రభుత్వం మరియు భాష, సాంస్కృతిక శాఖ మద్దతుతో ఈ సినిమాటిక్ ఎక్స్పో ని మరో స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము.తెలుగు సాహిత్యం కోసం మా వంతు సహకారం అందించడంతో పాటు, యువ ప్రతిభ కోసం భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. -
ఏఐలో శిక్షణ తీసుకుంటున్న రాజమౌళి?
సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను మించి..! ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్‌బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్‌ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
స్క్రీన్ మారలేదు, సీనే మారింది!
కథ చదవడం, వినడం పాత ప్రక్రియ! చూడటం వన్నె తగ్గని వెండితెర పంచే వింత వినోదం! కథను ఆడించే ఆ వెండితెర ఇంద్రజాలం నేర్చుకుంటే? మెదడు ఊహించని లోకాలకు తీసుకెళ్తుంది, నిజమే నమ్మలేని దృశ్యాలను చూపిస్తుంది. అదొక నయనానందం, అదొక మనోల్లాసం! మొత్తంగా మనిషిని మునివేళ్ల మీద నిలబట్టే సరికొత్త ప్రక్రియ! స్క్రీన్ మారలేదు, సీనే మారింది! బిహైండ్ ద స్క్రీన్ టోటల్‌గా చేంజ్ అయింది!కెమెరా కంటే ఎఫెక్ట్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఔట్ డోర్ కంటే గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎడిట్ సూట్స్ కంటే వీఎఫ్ఎక్స్ పవర్ ప్రదర్శిస్తున్నాయి. అవే మొన్న బాహుబలిని ప్రెజెంట్ చేశాయి. ఈరోజు కల్కిని క్రియేట్ చేశాయి. టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాయి. ఆ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్ను కంపాక్ట్‌గా చూద్దాం..అనాథ అయిన హీరో– అంతరిక్షం నుంచి భూమ్మీదకు పడే వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఒక రోజు విజిటింగ్ వీసా మీద వేరే గ్రహం నుంచి వచ్చిన హీరోయిన్ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సుదూరంలో ఉన్న ఆమె గ్రహానికి వెళ్తాడు. అక్కడ ఆమె తండ్రి మొదట వాళ్ల ప్రేమను కాదంటాడు. అక్కడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బ్లాక్ హోల్ దగ్గర ఉన్న తమ వారసత్వ సంపద టెక్నాలజీని తెస్తే పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెడతాడు. దీంతో హీరో స్పేస్‌లో సాహసాలు చేయాల్సి వస్తుంది.ఆ ప్రయత్నంలో తన తల్లిదండ్రులు మరో గ్రహంపై బందీలుగా ఉన్నారనే షాకింగ్ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకుని విలన్ల భరతం పడతాడు. వాళ్లను విడిపించుకుని, చాలెంజ్‌లో నెగ్గి హీరోయిన్ను దక్కించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేమ, ప్రతీకారం, లోక కల్యాణం కోసం విలన్‌ను హీరో అంతం చేయడం అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న స్టోరీ లైన్. కాకపోతే మారింది సినిమా పరిధి. నాటి ‘పాతాళ భైరవి’ నుంచి నేటి ‘కల్కి’ దాకా సినిమా అంటే కళ్లు చెదిరేలా ఉండాల్సిందే!ఎక్కడి మహాభారతం? ఎక్కడి 2898 సంవత్సరం? ఇతిహాసాన్ని ఆరువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముడిపెట్టి తీసిన కల్పితగాథ ‘కల్కి’కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మార్వెలస్‌గా ఉందని, మరో ప్రపంచంలో విహరింపజేశాడంటూ దర్శకుడిని పొగుడుతున్నారు. ఇక్కడ కథ కంటే భవిష్యత్తులో దర్శకుడి ఊహకు, అందులోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.నాటి కేవీరెడ్డి ‘మాయాబజార్’ నుంచి నేటి నాగ అశ్విన్ ‘కల్కి’ దాకా సినిమాలో కథ ఉంటుంది. కానీ, కథ కంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌కి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. దానికి కారణం గ్రాఫిక్స్ మాయాజాలం. ఒక హీరో క్లైమాక్స్‌లో విలన్ తో భూమ్మీదే ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం వినీలాకాశంలోనో, సాగర గర్భాంలోనో ఉంటే ఎలా ఉంటుందనే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మొత్తంగా ఒక సినిమా ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రేక్షకుడి కోరికను దర్శకులు తీర్చేస్తున్నారు.కథ కొంచెం.. గ్రాఫిక్స్ ఘనం..సినిమాలో కథ ఉంటుంది. కథకు తగ్గట్లు పాత్రలు కదులుతుంటాయి. కానీ, తెర వెనుక జరిగేదంతా వేరే ఉంటుంది. మొత్తం కంప్యూటర్ మీదనే మాయచేస్తారు నిపుణులు. సీన్లను నార్మల్‌గా తీసి దానికి కంప్యూటర్లో మెరుగులు అద్ది నిజంగా ఫలానా చోట తీశారా అనే భ్రమను కలిగిస్తారు. అలా కథ కంటే గ్రాఫిక్స్ ఘనంగా మారిపోతున్నాయిప్పుడు. గ్రీన్ మ్యాట్ మీద తీసిన సీన్లకు సినిమాలో చూసిన సీన్లకు తేడా గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.పాత్రధారి లేకున్నా..తెరపై కనిపించకున్నా, నటీనటులు తమ గొంతుతో సినిమాను నడిపించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే టెక్నాలజీకి ముడిపెట్టి వాయిస్ ఓవర్‌తో మ్యాజిక్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అమెజాన్, అలెక్సా, యాపిల్ సిరి, గూగుల్ నౌలను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగన్నమాట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సతో ఆలోచించే అడ్వాన్్సడ్ వెహికిల్‌గా ‘బుజ్జి’ కల్కి చిత్రంలో అదనపు ఆకర్షణ. నటి కీర్తి సురేష్ ఆ ఆకర్షణకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. తెరపై కనిపించకున్నా, ఈ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.అయితే 2013లోనే ఆ తరహా ప్రయోగం ఒకటి జరిగింది. హాకిన్ ఫీనిక్స్ లీడ్ రోల్లో ‘హర్’ అనే చిత్రం వచ్చింది. అందులో సమాంత అనే వాయిస్ టెక్నాలజీతో భావోద్వేగమైన బంధంలో మునిగిపోతాడు హీరో! నటి స్కార్లెట్ జాన్సన్ ఆ టెక్ వాయిస్ ఇవ్వడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. విశేషం ఏమిటంటే ఏఐ అనే ప్రస్తావన లేకుండా సాగుతుందీ పాత్ర. ఇలా తెర మీద కనిపించకున్నా, ఆర్టిస్టులు ప్రభావం చూపిస్తున్నారు.కేరాఫ్ హాలీవుడ్..ఎలాంటి సాంకేతికతనైనా త్వరగా అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలానికి పుట్టినిల్లు అది. మన సినిమాల్లో టెక్నాలజీ వాడకం కొంత మేర ఉంటే, వాళ్లు పూర్తిగా సినిమానే దాంతో నింపేస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా గ్రాఫిక్స్ మాయాజాలంతో బోలెడు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి.అవతార్, మ్యాట్రిక్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, జురాసిక్ పార్క్, 2012, కింగ్ కాంగ్, ది అవెంజర్స్, గ్రావిటీ, ది డార్క్ నైట్, పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్, ఇన్సెప్షన్, ఏలియన్, టెర్మినేటర్, మమ్మీ, గాడ్జిల్లా, అనకొండ, ది జంగిల్ బుక్, లయన్ కింగ్– చెబుతూ పోతే కోకొల్లలు. అందుకే మన దర్శకులు అక్కడి టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకుంటుంటారు. అయితే, వాటికి పనిచేసే టెక్నీషియన్లలో ఎక్కువ మంది అక్కడున్న భారతీయులే. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడి గ్రాఫిక్స్ సంస్థలనూ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ఇక్కడి మనవాళ్లకూ తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.కంప్యూటర్ గ్రాఫిక్స్ మొదలు..చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్ పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట్లో సెట్టింగుల కోసం, లొకేషన్ల కోసం హ్యాండ్ ప్రింటెడ్ బ్యాక్ డ్రాప్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆప్టికల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. 80, 90వ దశకంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, 2000లో వీఎఫ్ఎక్స్.. వాటికి సంబంధించి స్టూడియోలే ఏర్పడటం మొదలైంది. సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) భూమిక ప్రధానమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు కచ్చితంగా వీఎఫ్ఎక్స్ ఉండాల్సిందే! ఇప్పుడు విజువల్స్ అంటే దృశ్య విన్యాసమే కాదు, కథలో అంతర్భాగం కూడా.ఇలా వచ్చిన రోబో, బాహుబలి చిత్రాలు భారతీయ చిత్రాల సత్తాను అంతర్జాతీయంగా చాటాయి. అయితే సాంకేతికంగా ఇంత అడ్వాన్స్మెంట్ లేని కాలంలో కూడా కేవి రెడ్డి, సింగీతం శ్రీనివాస్, శంకర్ షణ్ముగంలాంటి సినీ ఉద్దండులు ఈ తరహా ప్రయోగాలకు ఏడు దశాబ్దాల కిందటే క్లాప్ కొట్టారు ‘మాయాజబార్’తో! తర్వాత కాలంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘జీన్ ్స’, అమ్మోరు’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘దేవి’, ‘ఇండియన్’ మొదలు ‘రోబో’, నిన్నటి ‘బాహుబలి’, నేటి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అలాంటి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అలా టెక్నాలజీ ఏదోరకంగా తన విజువల్ గ్రాండ్యూర్‌తో దేశీ వెండితెర మీద సందడి చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి.సజీవంగా లేకున్నా..సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా దక్షిణాది హాలీవుడ్‌తో పోటీపడుతోంది. ఏఐని విరివిగా వినియోగిస్తోంది. ఏఐ సాయంతో దివంగత గాయనీ గాయకుల గాత్రాలను వినిపిస్తోంది. నటీనటుల అభినయాన్ని చూపిస్తోంది. గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’లో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్‌ను ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. ‘లాల్ సలామ్’ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా అలాంటి ప్రయోగమే చేశారు.2022లో వచ్చిన ‘టాప్ గన్: మావెరిక్’ సినిమాలో లెఫ్టినెంట్ టామ్ ఐస్ మ్యాన్ కజన్ స్కై పాత్రధారి వల్ కిల్మర్ కోసం ఏఐ వాయిస్‌ను సృష్టించారు. 2014లో గొంతు కేన్సర్ బారినపడి మాట పడిపోయింది ఆయనకు. అయితే ఏఐ సాయంతో అచ్చం ఆయన గొంతునే క్రియేట్ చేశారు. అలా దివంగత నటులనూ తెరపై చూపిస్తోంది ఏఐ. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తను నటిస్తున్న ‘జేమ్స్’ సినిమా సెట్స్ మీద ఉండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు.మాయల బజార్..ఏఐతో అప్డేట్ అయిన సినిమాల యుగంలో కూడా మరువకుండా మరీ మరీ ప్రస్తావించుకోవాల్సిన మూవీ ‘మాయాబజార్.’ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని విజువల్ వండర్స్ వచ్చినా.. ఆ చిత్ర సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకూంటూనే ఉంటారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఊహే లేని .. అంతెందుకు కంప్యూటర్ ఉనికే లేని కాలంలో లాప్టాప్ని పోలిన ప్రియదర్శిని అనే పేటికను, స్కైప్ కాల్ని తలపించేలా అభిమన్యుడు–శశిరేఖల వీడియో కాలింగ్‌ని ఎవరైనా ఊహించగలరా? కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆ ఊహకు వెండితెర రూపమిచ్చారు.అందమైన చందమామను చూస్తూ.. లాహిరి లాహిరిలో అంటూ సాగే అందులోని పాటను వాస్తవానికి ఓ ఎర్రటి ఎండలో తీశారంటే నమ్మగలమా? ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ మాయా విన్యాసాలను ఇమాజిన్ చేయగలమా? ఆశ్చర్యం! రెట్రో రీల్, ఆంగ్లో–ఇండియన్ కెమెరామన్ మార్కస్ బార్టే› కెమెరా అద్భుతం అది! వివాహ భోజనంబు పాటనైతేతే నాలుగు రోజులపాటు శ్రమించి.. కెమెరా టెక్నిక్స్, స్టాప్ మోషన్ యానిమేషన్ టెక్నాలజీతో దాన్ని చిత్రీకరించారట.ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాంశంగా ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్.. విజువల్స్ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఒక మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇదే జరిగింది. ప్రీ–ప్రొడక్షన్ కి సరైన సమయం ఇవ్వకుండా మేకర్స్ చాలా తొందరపడ్డారు.ఫలితంగా ఆ చిత్రం విజువల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అలాగే టైమ్ తీసుకున్న చిత్రాలు మంచి అవుట్ ఫుట్‌ను ఇచ్చాయి. కాబట్టే ఆ సినిమాల కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్ అయింది. ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ సక్సెస్‌నూ సాధించాయి. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. అలాగని వీఎఫ్ఎక్స్తో ప్రయోగాలు చేసినా.. తొందర పెట్టినా.. బడ్జెట్ అంతకంతకూ పెరగడంతో పాటు అవుట్ ఫుట్ కూడా దెబ్బ తింటుంది. – పి. లక్ష్మీనారాయణ, వీఎఫ్ఎక్స్ నిపుణుడుఇదీ చిత్రమే..‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కమల్‌ను అలా ఎలా చూపించారనే ఆసక్తికరమైన చర్చ నడిచింది అప్పట్లో. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం తొలిసారి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది.. విజువల్ ఎఫెక్ట్ డిజైనర్ ఎస్టీ వెంకీకి తొలి చిత్రం.అందులోని పాటలు, సర్కస్ పోర్షన్‌కి ఈ టెక్నాలజీని వాడారు. అయితే పొట్టి కమల్ హాసన్ కోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్ ఉపయోగించకపోవడం గమనార్హం. డిఫరెంట్ టెక్నిక్స్.. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం మోకాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన షూ వాడడం, స్టడీ షాట్లో గుంతలు తీసి మోకాళ్ల దాకా కమల్ హాసన్‌ను అందులో పాతిపెట్టడం వంటివి చేశారట.డీ–ఏజ్ క్లిక్కు.. లుక్కుతో కిక్కు..మేకప్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేకప్ అనే మాట ఏనాడో పాతదైపోయింది. ప్రోస్తటిక్, త్రీడీ మేకప్‌లతో అది కథలో భాగమైంది. ఇదింత మేకప్ అయి వచ్చినా టెక్నాలజీ ఎఫెక్ట్‌కి ఫేడ్కాక తప్పట్లేదు. దాన్నలా ఫేడ్ అవుట్ చేస్తోంది డీ–ఏజింగ్ డిజిటల్ మేకప్. ఇది సిల్వర్ స్క్రీన్ ౖపై చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. వయసు పైబడిన హీరో, హీరోయిన్లను యంగ్‌గా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్టులు ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ను వాడుతున్నారు. దీనిద్వారా ఆర్టిస్ట్ ముఖంతో పాటు బాడీ షేపుల్లోనూ మార్పులు చేసుకునే వీలుంటుంది.2006లో ‘ఎక్స్‌మెన్ : ది లాస్ట్ స్టాండ్’లో ప్యాట్రిక్ స్టీవార్ట్, ఇయాన్ మెకెల్లెన్ ల కోసం ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ని ఫస్ట్ టైమ్ పక్కాగా వాడారు. హెచ్‌బీవో నిర్మించిన ‘ది రైటస్ జెమ్‌స్టోన్ ్స’ టీవీ సిరీస్‌లో నటుడు జాన్ గుడ్మన్ కోసం ఒక ఎపిసోడ్ మొత్తం డిజిటల్లీ డీ–ఏజ్డ్ టెక్నాలజీనే ఉపయోగించారు. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’లో క్రియేటర్ సాన్లీ గెస్ట్ అపియరెన్ ్స కోసం రెండు వందల షాట్స్‌తో ఒక సీన్ రూపొందించారు.‘టెర్మినేటర్: డార్క్ ఫేట్, ఇట్– చాప్టర్2’లో ఈ టెక్నిక్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ‘కెప్టెన్ మార్వెల్’, ‘జెమినీ మ్యాన్ ’, ‘ది ఐరిష్‌మ్యాన్ ’– ఈ మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. ‘కెప్టెన్ మార్వెల్’లో నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ కోసం శామ్యూల్ జాక్సన్ ని కొద్దిసేపు యంగ్‌స్టర్‌గా చూపించారు. ‘జెమినీ మ్యాన్ ’ కోసం విల్ స్మిత్‌ను ఏకంగా ఇరవై మూడేళ్ల యువకుడిగా చూపించారు. మార్టిన్ స్కార్సిస్.. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో ‘ది ఐరిష్ మ్యాన్ ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో డెబ్బైతొమ్మిదేళ్ల రాబర్ట్ డి నీరో.. నలభై తొమ్మిదేళ్ల క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఈ మూడు సినిమాలూ ఆస్కార్ 2020 బరిలో విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఇంతకాలం హాలీవుడ్‌కే పరిమితం అనుకున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మన చిత్రాల కోసం కూడా వినియోగిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్‌ని అలాగే తీర్చిదిద్దారు. అందులో ఆమె గుండ్రటి మొహం కాస్త కోలగా మారి ఆ సినిమాలో ఆమె వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.ధైర్యంగా ముందుకు..కథాంశాన్ని బట్టి బడ్జెట్ మారుతుంది. కానీ, భారీ హంగులే ప్రధానాంశమైతే సినిమా బడ్జెట్ బరువు పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్ యాక్టర్స్, భారీ సెట్లు, ఫారిన్ లొకేషన్ల కోసం బడ్జెట్ భారీగా మారేది. ఇప్పుడు ఆ జాబితాలో తారాగణం పారితోషికాలను మినహాయిస్తే మిగిలిన వాటి స్థానాలను ఒక్క గ్రాఫిక్సే భర్తీ చేస్తున్నాయి భారీగా. దీనివల్ల ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలనే హాలీవుడ్ తీరూ మనకూ అనివార్యమైంది. ఇప్పుడు మన సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలు ఉండటం, అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా చేరుతుండటం సాధారణమైంది.దీనివల్ల విజువల్ వండర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా అంటాయి సినీ వర్గాలు. కావచ్చు. ఈ బడ్జెట్‌తోనే వీఎఫ్ఎక్స్ సామాజిక అంశాలతో పాటు చరిత్ర, పురాణేతిహాసాలు, టైమ్ ట్రావెల్, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో కన్నులకు కడుతోంది. అందుకే కథను బట్టి గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్‌ని బట్టే కథను రాసుకుంటున్నారు దర్శకులు. దాన్ని భరించే నిర్మాతలను వెదుక్కుంటున్నారు. దాంతో వీఎఫ్ఎక్స్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్‌గా మారింది. దీనికి భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది.గంటల నుంచి నెలలు..సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)కు అయ్యే ఖర్చు ఎంతమంది నిపుణులు పని చేస్తారు, వాళ్ల అనుభవం, ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తారు, వాటి నిడివి, అలాగే వాళ్లు ఉపయోగించే సాఫ్ట్వేర్లను బట్టి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్ కేటాయిస్తుంటారు నిర్మాతలు. కంపెనీ ప్రతినిధులను గంటల లెక్క నుంచి రోజులు, నెలల లెక్కన కేటాయిస్తాయి అవసరాలన్ని బట్టి. కేవలం కంపెనీలు మాత్రమే కాదు, ఫ్రీలాన్ ్సగా పని చేసే నిపుణులూ ఉన్నారు.మన దేశంలో వీఎఫ్ఎక్స్ నాణ్యత, నిడివి ప్రాతిపదికన నిమిషానికి రూ.500 నుంచి రూ. 2000 దాకా తీసుకునే వీడియో ఎడిటర్లు ఉన్నారు. వీఎఫ్ఎక్స్లో షాట్స్‌ను బట్టి పని లెక్క ఉంటుంది. పది కంటే తక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే దాన్ని మినిమమ్ వర్క్‌గా భావిస్తారు. 10–50, 50–100, వంద కంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను అవసరానికనుగుణంగా వినియోగిస్తుంటారు.అయితే ఒక నిమిషం నిడివి ఉన్న వీఎఫ్ఎక్స్ వీడియో తీయాలంటే రూ. 80 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో.. ఇంటర్మీడియట్, అడ్వాన్ ్సడ్, హైలీ కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ స్థాయిలు ఉంటాయి. ఒక్కొ లెవెల్ ముందుకు వెళ్లేకొద్దీ.. అంతకు మించే(రెట్టింపు) ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడయ్యాక ఇది మరింత ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది. కానీ, ఇందులోనూ రకాలున్నాయి. తేలికగా అయ్యే వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే షార్ట్ ఫిల్మ్, యానిమేషన్, షూటింగ్ లైవ్ యాక్షన్ లార్జ్ స్కేల్ వీఎఫ్ఎక్స్– ఇలా ఒక్కో కేటగరీలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చు పెరుగుతూ పోతుంది.ఉదాహరణకు ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ చిత్రం కోసం 4 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను క్రియేట్ చేశారట! కానీ, అందులో 3,289 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను మాత్రమే తీసుకున్నాడట దర్శకుడు జేమ్స్ కామెరూన్ . ఆ ఒక్కో వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 62,500 డాలర్ల ఖర్చు అయ్యింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసమే 250 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టారట! అయితే సినీ చరిత్రలో ఇప్పటి దాకా సీజీఐ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టింది మాత్రం ‘ది అవెంజర్స్–ఎండ్‌గేమ్.’ వీటికోసం 356 మిలియన్ల డాలర్లను కుమ్మరించారంటే అతిశయోక్తికాదు. అలాగే, విజువల్స్ కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయించిన టాప్ 3 చిత్రాలు కూడా మార్వెల్ సినిమాలే కావడం మరో విశేషం! ఇదీ స్క్రీన్ మీద ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్లు క్రియేట్ చేసే సీన్! – భాస్కర్ శ్రీపతి -
ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!
అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్‌గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్‌లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్‌లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్‌లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్‌లో కెరీర్ మొదలు పెట్టింది..‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్‌లో యూఎస్‌లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్‌లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్‌లో లీడ్ రోల్లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.రేడియో టాక్ షో విషయానికి వస్తే...‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్లకు సంబంధించి బాగా కష్టపడింది.యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది."ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి -
టెర్రస్‌పై ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తుండగా..కిందపడి విద్యార్థి మృతి
ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రిస్తుండగా టెర్రస్‌పై నుంచి కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బిలాస్పూర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ షూట్ చేసేందుకు టెర్రస్‌పైకి ఎక్కాడు. ఐతే వీడియో చిత్రీకరించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థి టెర్రస్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని అశుతోష్ సోవోగా గుర్తించారు పోలీసులు. అతను తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రాం రీల్ చేయడానిక ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఐతే అశుతోష్ కాలేజ్ టెర్రస్ సరిహద్దు గోడను దూకి కిటికి స్లాబ్‌పైకి ఎక్కుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. అదే సమయంలో స్నేహితులు మొబైల్లో చిత్రికరిస్తుండటంలో మునిపోవడంతో.. ఈ అనుహ్య ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అతన్ని రక్షించలేకపోయారని పోలీసులు తెలిపారు. మృతుడు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు మృతి చెందిన కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి రిస్క్‌లు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఆ ఈ వీడియోలో వారు ఏం చెప్పాలనుకున్నారంటే..సావో అనే వ్యక్తి కిటికీ స్లాబ్‌పైకి దూకడం వీడియోలో కనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి దూకితే తిరిగి రాలేను అను చెబుతాడు. అప్పుడే అతని స్నేహితుడు నువ్వు రాగలవు అని చెబుతున్నట్లు వీడియోలో వినపడుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే పట్టు తప్పి అశుతోష్ కిందపడిపోయాడు. అతని స్నేహితులు అశుతోష్‌ని రక్షించలేకపోయారు. ఇలాంటి రిస్క్‌లతో కూడిన రీల్‌ని చిత్రీకరించేటప్పుడూ పలు జాగ్రత్తుల తీసుకోవడం ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్) -
లోకం మెచ్చిన దర్శకుడు
ఫిల్మ్ మేకర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు కోల్‌కతాకు చెందిన శౌనక్ సేన్.అతడి ఫీచర్–లెంగ్త్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ మన ఫ్యూచర్ గురించి మౌనంగానే ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.జీవజాలంపై కాస్త కరుణ చూపమని చెప్పకనే చెబుతోంది... దిల్లీలోని ఏజెకె మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సెంటర్ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న శౌనక్సేన్ జెఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్థెటిక్స్లో పీహెచ్డీ చేశాడు. ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ ఫెలోషిప్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా ఫెలోషిప్‌కు ఎంపిక కావడం, కేంబ్రిడ్జి యూనివర్శిటీ అర్బన్ ఎకోలజీస్ ప్రాజెక్ట్‌లో విజిటింగ్ స్కాలర్‌గా భాగం కావడం తన ప్రపంచాన్ని విస్తృతం చేసింది. సేన్‌లోని కళకు సామాజిక స్పృహ తోడైంది.తొలి డాక్యుమెంటరీ ‘సిటీస్ ఆఫ్ స్లీప్’కు పెద్ద పేరే వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేసింది. ఇది న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్‌ఫెస్టివల్, తైవాన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇరవై చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రత్యేక ప్రశంసలు పొందింది. ఆరు అవార్డ్లు అందుకుంది. సేన్ రెండో ఫీచర్ లెంగ్త్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూనే ఉంది.వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్(సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, యూఎస్) గెలుచుకుంది. ‘హాస్యం, వ్యంగ్యం మేళవించి పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టిన చిత్రం’ అని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు. ఈ డాక్యుమెంటరీ మరో ప్రసిద్ధ అవార్డ్ గోల్డెన్ ఐ (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్) గెలుచుకుంది. ‘ఆల్ దట్ బ్రీత్స్’కు సంబంధించిన ప్రపంచవ్యాప్త హక్కులను అమెరికన్ టెలివిజన్ నెట్వర్క్ హెచ్‌బీవో తీసుకుంది.ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మరో ఘనత ఆస్కార్ ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’కు నామినేట్ కావడం.మనుషుల కార్యకలాపాల వల్ల జీవజాలం స్థితిగతుల్లో వస్తున్న మార్పుకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ‘ఎక్కడ పడితే అక్కడ పక్షులు చచ్చిపోయి కనిపిస్తుంటాయి. అయ్యో! అని మనకు అనిపించదు. మన దారిన మనం వెళుతూనే ఉంటాం. రోజువారి పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే ఉంటాం. క్షణం కూడా వాటి గురించి ఆలోచించం. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విషాదం!’ అంటుంది ఈ చిత్రంలో ఒక పాత్ర. జీవజాలానికి సంబంధించి మనుషులలోని స్పందనారాహిత్యాన్ని, మొద్దుబారినతనాన్ని దుమ్ము దులుపుతుంది ఆల్ దట్ బ్రీత్స్. మనుషులలోని స్పందనారాహిత్యం గురించి ‘చీమ కుట్టినట్లైనా లేదు’ అంటారు. ‘ఆల్ దట్ బ్రీత్స్’ చీమ నుంచి పిచ్చుక వరకు సమస్త జీవజాలం గురించి ఆలోచించమని చెబుతుంది.‘నేను మాత్రమే..అనే స్వార్థం ఉంటే నువ్వు కూడా మిగలవు’ అనే మార్మిక సందేశాన్ని ఇస్తుంది. ‘యాంత్రికంగా నేచర్–వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో తెలుసా!లాంటి స్వీట్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. మనం వేగంగా పరుగులు తీస్తున్నాం. ఆ పరుగు కొన్ని నిమిషాల పాటు అయినా ఆపి చుట్టు ఏం జరుగుతుందో అలోచించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ విధానాలకు సంబంధించిన విషయం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటున్నాడు సేన్. సేన్ ఇష్టాల గురించి చెప్పాలంటే...సామాజిక పరిస్థితుల గురించి లోతుగా తెలుసుకోవడం అంటే ఇష్టం. సృజనాత్మకత నిండిన సినిమాలు చూడడం అంటే ఇష్టం. సామాజిక అంశాలకు, సృజనాత్మకత జోడించి తనదైన శైలిలో సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరించడం అంటే మహా ఇష్టం. -
'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా'
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అనగానే మదిలో మెదిలే బౌలర్ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఇప్పుడు అదే 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' పేరుతో బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ముహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ డైరక్టర్‌గా వ్యవహరించగా.. క్యూ ఫిలిం ప్రొడక్షన్ తెరకెక్కించింది. అయితే తాజాగా బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు షోబయ్ అక్తర్ శనివారం రాత్రి ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తన అనుమతి లేనిదే బయోపిక్ రూపొందిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు. ''రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరం. కొన్ని నెలల కింద నుంచే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే బయోపిక్ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. త్వరలోనే నా మేనేజ్మెంట్, లీగల్ టీమ్ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది. నా అనుమతి లేకుండా మేకర్స్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే మాత్రం లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అక్తర్ ఒక మ్యాచ్‌లో 161 కిమీవేగంతో విసిరిన బంతి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. Important announcement. pic.twitter.com/P7zTnTK1C0 — Shoaib Akhtar (@shoaib100mph) January 21, 2023 చదవండి: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు -
మేమంతా సినీ కార్మికులం..సినిమానే మా కులం: చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
సీనీ కార్మికులు ఎన్నో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంటారని, ఎన్నో నెలల భార్య పిల్లలకు దూరంగా ఉండి ప్రేక్షకులను అలరించడానికి శ్రమిస్తారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులు తలచుకుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజాగా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం(జనవరి 13) విడుదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా మేకింగ్ వీడియో అది. అందులో సినిమా షూటింగ్ కోసం కార్మికులు పడుతున్న కష్టాలను చూపించారు. చిరంజీవి వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. చిరంజీవి స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. ‘మేమంతా సినీ కార్మికులం. నిరంతర శ్రామికులం. కళామతల్లి సైనికులం. సినిమా ప్రేమికులం .సినిమానే మా కులం .మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం’అని రాసుకొచ్చాడు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషించారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. మేమంతా సినీ కార్మికులం నిరంతర శ్రామికులం కళామతల్లి సైనికులం సినిమా ప్రేమికులం సినిమానే మా కులం మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం! THANK YOU One & All🙏https://t.co/AdQg2v12xv pic.twitter.com/m9n2plOOAA — Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2023 -
శిష్యులకు దారిచూపుతున్న స్టార్ డైరెక్టర్.. సొంత సంస్థలో..
తమిళ సినిమా: సామాజిక అంశాలను ఇతివృత్తంగా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు పా రంజిత్ దిట్ట. నీలం ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి తన శిష్యులకు దర్శకులుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నీలం ప్రొడక్షన్స్, లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేత గణేశమూర్తితో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ్, పృథ్వీ పాండియరాజన్, కీర్తి పాండియన్, దివ్య దురైస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జైకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ.. క్రికెట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. స్నేహానికి ప్రాధాన్యతను ఇస్తూ కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర షూటింగ్‌ను అరక్కోణం పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. గోవింద్ వసంత సంగీతం, తమిళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చదవండి: Prabhas: ప్రభాస్ సినిమాకు నిర్మాత మారనున్నాడా? -
షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. దేశంలోని యువతలో దాగున్న ప్రతిభను వెలికితీయడం కోసం నెట్‌ఫ్లిక్స్ ఇండియా 'టేక్ టెన్' అనే షార్ట్‌ఫిల్మ్ వర్క్ షాప్ & పోటీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ 'టేక్ టెన్' పోటీలో ఎంపికైన వారికి వర్క్ షాప్‌కు హాజరు అయ్యే అవకాశం కల్పించడమే కాకుండా, ఆ తర్వాత 10,000 డాలర్ల(సుమారు రూ.7.5 లక్షలు)కు సమానమైన గ్రాంట్‌తో షార్ట్‌ఫిల్మ్ తీసే అవకాశాన్ని 10 మందికి కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తీసిన ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్లో ప్రదర్శించనున్నారు. 'టేక్ టెన్' కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోటీదారులు భారతదేశ పౌరుడు కావడంతో పాటు18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఈ పోటీ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 7, 2022 నుంచి ప్రారంభం కానుంది. పోటీదారులు "మై ఇండియా" అనే అంశంపై రెండు నిమిషాల షార్ట్‌ఫిల్మ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, షార్ట్‌ఫిల్మ్‌ని వారి ఫోన్ సహాయంతో షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఎంపికైన వారికి రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వంటి విభాగాల గురించి నేర్చుకునే అవకాశాన్ని పొందొచ్చని నెట్‌ఫ్లెక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాని యువత కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నెట్‌ప్లెక్స్ పేర్కొంది. 'టేక్ టెన్' అనే షార్ట్‌ఫిల్మ్ పోటీకి నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ స్పాన్సర్ చేస్తుంది. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న కమ్యూనిటీలకు చెందిన తర్వాతి తరం కథకులకు మద్దతు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలకు పైగా సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లను నిధులను కేటాయించింది. (చదవండి: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్.. లక్ష రూపాయలు మటుమాయం!) -
ఆనంద్ మహీంద్రా: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి
స్కూల్ టైంలో పెద్దయ్యాక ఏమవుతావురా? అంటే.. సంకల్లో చేతులు కట్టుకుని సంతోషంగా ‘ఫలానా అయిపోతాం సార్’ అని చెప్తుంటాం. కానీ, కష్టపడి ఆ కలను నెరవేర్చుకునేవాళ్లం కొందరమే!. పరిస్థితుల మూలంగానో, ఇతర కారణాల వల్లనో కొందరు అనుకున్నవి సాధించలేకపోవచ్చు. ఆ లిస్ట్‌లో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఒక ఫిల్మ్ మేకర్ అనే విషయం తాజాగా ఓ ఫొటో ద్వారా బయటపడింది. ‘మహీంద్రా గ్రూప్ అనే ప్రతిష్టాత్మక కంపెనీని ముందుడి నడిపిస్తున్నారు. కానీ, చదువుకునే రోజుల్లో మీ లక్ష్యం ఏంటి?.. ఫేవరెట్ ప్రొఫెషన్‌గా దానిని మిస్ అవుతున్నారా?’ అని ట్విటర్లో ఈశ్వరన్ వ్యక్తి ఎప్పుడో వారం కిందట ఆనంద్ మహీంద్రాను అడిగారు. దానికి ఇప్పుడు రిప్లై ఇచ్చారు ఆయన. Easy to answer this. I wanted to be a filmmaker & was studied film in college. My thesis was a film I made at the ‘77 Kumbh Mela. But this pic was while shooting a documentary in a remote village near Indore. Anyone old enough to guess which handheld 16mm camera I was using? https://t.co/xmLuuLrv3A pic.twitter.com/oKCddQFyGf — anand mahindra (@anandmahindra) January 20, 2022 ‘‘దానికి సమాధానం చెప్పడం సులువు. ఫిల్మ్ మేకర్ అవుదామనుకున్నా. కాలేజీలోనూ సినిమా కోర్స్ చేశా. 1977 కుంభమేళా సమయంలో ఒక సినిమా కూడా తీశా. కానీ, ఇక్కడ కనిపించే ఫొటో మాత్రం ఇండోర్ దగ్గర ఒక మారుమూల పల్లెలో డాక్యుమెంటరీని తీసేప్పుడు క్లిక్ మనిపించింది. ఇంతకీ ఈ ఫొటోలో నేను హ్యాండిల్చేసిన 16ఎంఎం కెమెరా ఏంటో ఎవరైనా చెప్పగలరా?’’ అంటూ ఓ ప్రశ్న సైతం నెటిజనులకు సంధించాడాయన. aap ko kis se dar lagta hai — Pawan Singh (@Singh12351) January 20, 2022 Was studied ?? Typo or indian English — flygps (@desigladiator) January 20, 2022 Can we watch the documentary ??? — Mourya (@SanMourya9922) January 20, 2022 కెరీర్‌కు ఎందుకు దూరం అయ్యారనే విషయం ఆయన చెప్పక్కపోయినప్పటికీ.. ఆయన బోల్తా కొట్టింది మాత్రం లేదు. ఎందుకంటే.. ఇప్పుడాయన బిలియనీర్ బిజినెస్ టైకూన్ కాబట్టి. ఇక ట్విటర్లో ఆయన పోస్ట్‌కి మాత్రం రకరకాల రియాక్షన్లు దక్కుతున్నాయి. కొందరు చమక్కులు పేలుస్తుండగా.. మరికొందరు అయ్యిందేదో మంచికే అయ్యిందని ఆనంద్ మహీంద్రాకు సర్దిచెప్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం.. అదేనండీ ఏ కంపెనీ కెమెరానో రిప్లై ఇస్తున్నారు. An AKAI. Around that time this was very popular. — AnandMadabhushi (@andmadca) January 20, 2022 Pic Kapil Dev? — TresVida Charm🇮🇳 (@TresVida18) January 20, 2022 -
ముగ్గురు డాక్టర్లు.. వీకెండ్స్‌లో షూటింగ్.. చిత్రానికి ప్రశంసలు
The Wrong Swipe Movie Created By Three Doctors: ముగ్గురు వైద్యులు కలిసి తెరకెక్కించిన చిత్రం 'ది రాంగ్ స్వైప్'. ఈ చిత్రాన్ని నిర్మాత డాక్టర్ ప్రతిమా రెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి కలిసి మొబైల్ ఫోన్‌ను కమెరాగా చేసుకుని రూపొందిచారు. చాలా పరిమిత బడ్జెట్‌తో వీకెండ్స్‌లో మాత్రమే షూట్ చేసి నిర్మించిన ఈ సినిమాతో ముగ్గురు డాక్టర్లు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రం టాలీవుడ్‌లోని ప్రముఖుల ప్రశంసలు పొందుతుందని మేకర్స్ తెలిపారు. వారికి మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ రంగంలో తాము కూడా రాణించగలమనే నమ్మకాన్ని రెట్టింపు చేసిందని డైరెక్టర్ రవికిరణ్ అన్నారు. 'ది రాంగ్ స్వైప్' చిత్రాన్ని సుప్రసిద్ధ దర్శకుడు కోదండరామి రెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు మెచ్చుకున్నారని రవికిరణ్ తెలిపారు. ఇటీవల కాలంలో తాము చూసిన చాలా మంచి చిత్రాల్లో ఇది ఒకటని పొగిడారని పేర్కొన్నారు. '6 ఎమ్పీ' పేరుతో తన తదుపరి చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రవికిరణ్ వెల్లడించారు. -
బై ది ఉమెన్ ఫర్ ది ఉమెన్
‘ఫిల్మ్‌మేకర్ కావాలనుకుంటున్నాను’ అని మగవాళ్లు అంటే అభ్యంతర పెట్టేవాళ్లు, భయపెట్టేవాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. అదే మహిళల విషయానికి వచ్చేసరికి మాత్రం ‘ఎందుకు వద్దంటే...’ అంటూ చాంతాడంత జాబితా తయారవుతుంది. ఈ నేపథ్యంలో ‘మీరు విన్నవి అపోహ లు మాత్రమే. వాస్తవాలు కాదు’ అనే స్పష్టత ఇవ్వడానికి, ‘మీ ప్రతిభ నిరూపించుకోండి’ అని ధైర్యం చెప్పడానికి వ్యక్తులే కాదు వేదిక కూడా ముఖ్యమే అంటోంది ముంబైకి చెందిన రిషి నికమ్. చిత్రసీమలోని ఆయా విభాగాలలో స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడానికి, తనలాగే ఆలోచించే మరికొద్దిమందితో కలిసి ‘బై ది ఉమెన్–ఫర్ ది ఉమెన్’ కాన్సెప్ట్ తో ‘కళాకారి’ వేదికకు ఊపిరి పోసింది. ఈ వేదిక తరపున మహిళల చేత రూపుదిద్దుకున్న ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రపంచంలోని పలు భాషల చిత్రాలను ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నిజానికి ఇవి సినిమాలు కాదు తమను ఉత్తేజపరిచే పాఠాలు. çకళాకారి ఫిల్మ్ ఫెస్టివల్లో మహిళా దర్శకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. మహిళాదర్శకుల చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. ‘ఇది మన ఫిల్మ్ ఫెస్టివల్’ అనే భావన కలుగుతుంది. ‘చైనీస్ ఫిమేల్ ఫిల్మ్ డైరెక్టర్ క్లోయే జావో తొలిరోజుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తరువాత తనను తాను నిరూపించుకుంది. బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకున్న జావోకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్ ‘సాంగ్స్ మై బ్రదర్ టాట్ మీ’ అన్నాచెల్లెళ్ల్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపింది. అది చైనీస్ ఫిల్మ్ అనిపించదు. అదేదో మన పక్కింట్లో జరుగుతున్నట్లు ఉంటుంది. డైరెక్టర్ గొప్పదనం అదే. అలాంటి డైరెక్టర్లు మన దగ్గర కూడా తయారుకావాలి’ అంటుంది రిషి. ‘ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పాల్గొనడం వలన ఏమిటి ప్రయోజనం?’ అనే ప్రశ్నకు ‘మంచి అనుభూతి మిగులుతుంది’ అనేది సంతృప్తికరమైన జవాబు కాదు. ‘కళాకారి’ నిర్వాహకులలో ఒకరైన ప్రియా యాదవ్ మాటల్లో చెప్పాలంటే...‘అక్కడ చిత్రాలను చూడడం మాత్రమే కాదు...ఇరాన్ నుంచి చైనా వరకు తమను ఇన్స్పైర్ చేసే చిత్రదర్శకుల గురించి మాట్లాడు కుంటారు. కొత్త విషయాలెన్నో తెలుసుకుంటారు. ఆ తరువాత ప్రముఖ మహిళా దర్శకులు తమ అనుభవాలను వివరిస్తారు. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు మొదలైన విషయాల గురించి మాట్లాడతారు. తర్వాత రకరకాల టాపిక్స్‌పై చర్చ జరుగుతుంది. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత! ఏదో దయతలిచి సినిమారంగంలో మహిళలకు అవకాశం ఇవ్వమని అడగడం ఈ వేదిక ఉద్దేశం కాదు. చిత్రపరిశ్రమలో లింగవివక్షత ఉండకూడదు అని డిమాండ్ చేయడం మాత్రమే. సినిమా రంగంలో మహిళల ప్రతిభ గురించి చరిత్ర పుటలు తిరిగేస్తే తెలుస్తుంది’ ‘కళాకారి’ లక్ష్యం విజయవంతం కావాలని ఆశిద్దాం. -
వర్చువల్ వరం!
మనకు తెలియని సరికొత్త ప్రపంచంలోకి, ఎప్పుడూ చూడని ప్రదేశంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేయడం సినిమాకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసే విధానం మారుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక్క యాక్టరే ఇద్దరుగా కనబడితే సంబరపడిపోయాం. ఆ తర్వాత గ్రాఫిక్స్ మాయాజాలం చూశాం. 3డీ సినిమాలు వచ్చాయి. లైవ్ యాక్షన్ టెక్నాలజీతో సినిమాలు వచ్చాయి. మారుతున్న సాంకేతికత, ప్రేక్షకుడి అభిరుచి – సినిమాను కొత్త విధానాలు అనుసరించేలా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది. కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ టెక్నిక్కే భవిష్యత్తు కాబోతోందా? వేచి చూడాలి. ఇండియాలో ఇదే తొలిసారి! మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు. ఈ పద్ధతిలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి కాన్సెప్ట్–డైరెక్షన్ గోకుల్ రాజ్ భాస్కర్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రం 5 భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) విడుదల కానుంది. ‘‘సినిమాలు తెరకెక్కించడంలో ఇదో కొత్త చాప్టర్. పరిస్థితులు మారుతున్నప్పుడు, కొత్త ఛాలెంజ్‌లు ఎదురవుతున్నప్పుడు మనం కూడా కొత్త పద్ధతులను అనుసరించాలి. ఈ కథ త్వరగా మీ అందరికీ చెప్పాలనుంది’’ అని పేర్కొన్నారు పృథ్వీరాజ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్? నిజమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అక్కడే (నిజమైన లొకేషన్లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందో ఎవ్వరికీ పక్కాగా తెలియదు. సరిగ్గా కుదరకపోతే ప్రేక్షకుడి పెదవి విరుపులు వినాల్సి వస్తుంది. వర్చువల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయొచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కోసం అటూ ఇటూ తిరిగే పని పూర్తిగా తగ్గిపోతుంది. నటీనటులందరూ గ్రీన్ మ్యాట్ ముందే నటిస్తారు. 3డీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నిజమైన లొకేషన్లో ఉన్నభావన కలుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడే సీన్ ఎలా ఉండబోతోందో దర్శకుడు మానిటర్ లో చూసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌తో పెద్దగా పని ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల వినూత్న కథలకు మరింత ఆస్కారముంటుంది. పండోరా గ్రహం టెక్నిక్ అదే ఆల్రెడీ హాలీవుడ్లో ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. జేమ్స్ కామెరూన్ ఈ టెక్నాలజీని ఉపయోగించే ‘అవతార్’ని (2019) సృష్టించగలిగారు. ఈ సినిమాను మొత్తం వర్చువల్ ప్రొడక్షన్ ఉపయోగించే పూర్తి చేశారు. ఈ చిత్ర కథాంశం ‘పండోరా’ అనే గ్రహంలో జరుగుతుంది. అదంతా ఊహాజనిత ప్రదేశం. దానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్స్ కూడా ఈ టెక్నాలజీతో పాటు మరింత సాంకేతికతతో తెరకెక్కుతున్నాయి. ఇదే టెక్నాలజీతో ‘లయన్ కింగ్, రెడ్ ప్లేయర్ వన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్ జరగడమే పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితులు ఎప్పుడు మామూలుగా మారుతాయో తెలియదు. మళ్లీ ఎప్పటిలా సినిమా చిత్రీకరణలు చేయగలమా? లేదా? అనే చిన్న సందేహం చాలామందిలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే ఛాలెంజ్‌లను ఎదుర్కొని సినిమాలు తీయడానికి ఇలాంటి కొత్త పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతులు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోతే మాత్రం ప్రయత్నం వృథా అవుతుంది. అందుకే ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమా ఉండాలి.. అలాగే నిర్మాతకు నాలుగు డబ్బులు మిగలాలి. అప్పుడే ‘వర్చువల్’లాంటి టెక్నాలజీలు వరం అవుతాయి. -
కొత్తవారికి ఆహ్వానం
ఇప్పటి వరకు అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఎస్.వి.ఆర్ మీడియా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ– ‘‘తమిళ హిట్ చిత్రాలను తెలుగులోకి అనువదించి ప్రేక్షకులకు దగ్గరయ్యాం. ఇప్పుడు స్ట్రయిట్ సినిమాలను నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 2020లో ఐదు సినిమాలను నిర్మించబోతున్నాం. ఇప్పటికే ఐదు సినిమాలకు సంబంధించిన కథలు సిద్ధమయ్యాయి. ఆసక్తిగల నటీనటులు(హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్), సాంకేతిక నిపుణులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఆసక్తిగలవారు starmaking2020@gmail.com లేదా 90009 10979, 91336 73367 నంబర్లకు వాట్సాప్‌లో ప్రొఫైల్స్‌ను పంపాలి’’ అన్నారు. -
ఫిల్మ్ మేకింగ్‌లో ఉచిత శిక్షణ
విజయనగరం పూల్‌బాగ్ : కాపు, బలిజ. తెల గ, ఒంటరి కులాల నిరుద్యోగులకు ఫినిషింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఇన్మల్టీ మీడియా, ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ వారు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వీ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ శిక్షణా శిబిరాన్ని కాపు కార్పొరేషన్, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. అభ్యర్థులకు భోజన వసతి కల్పి స్తామని పేర్కొన్నారు. స్త్రీలు, పురుషులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వసతులను ఉపయోగించుకోని వారికి నెలకు రూ.5వేలు స్టయిఫండ్ ఇస్తాని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, పాలిటెక్నిక్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. శిక్షణలో ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు జీతంతో ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగలవారు ఈనెల 20న ఉదయం 10 గంటలకు విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాయానికి హాజరుకావాలని సూచించారుర. మరిన్ని వివరాలకు 7674826174, 733117 2074, 7331172075, 73331172076 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
మేకింగ్ ఆఫ్ 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు'
-
అప్పట్లో ఏమీ తెలిసేది కాదు!
‘‘నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా నటిస్తా. అలాగని నా శైలిని వదలుకోను. ఓ పాత్ర తీరుతెన్నులను దర్శకుడు చెప్పిన తర్వాత, ఒకవేళ నేనే ఆ పాత్ర అయితే ఎలా ఉంటానో.. ఊహిం చుకుని నటిస్తా’’ అంటున్నారు అనుష్క. ‘బాహుబలి, రుద్రమదేవి, లింగా, ఎన్నయ్ అరిందాల్’.. ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ఇటీవల ఓ సందర్భంలో నటిగా రంగప్రవేశం చేసిన తొలినాళ్లను అనుష్క గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం ఎలా ఉంటుందనే విషయంపై తనకు కనీస అవగాహన ఉండేది కాదని అనుష్క చెబుతూ -‘‘సినిమాల్లోకి రాక ముందు నేను సాదా సీదా అమ్మాయిని. చాలా నిరాడంబరంగా ఉండేదాన్ని. అప్పట్లో మేకప్ వేసుకోవడం కూడా తెలియదు. ఇక కెమెరా యాంగిల్స్ గురించి ఏం తెలుస్తుంది! కానీ, ఓ నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే, కెమెరా యాంగిల్స్ కూడా తెలుసుకున్నాను. అప్పట్నుంచీ నాదైన శైలిలో నటించడం మొదలుపెట్టాను. తెరపై చూస్తున్న రెండున్నర గంటల సినిమా కోసం పడే కష్టం ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను’’ అని చెప్పారు. ‘పోటీలో ఉన్న ఇతర నాయికలు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా! మీరెందుకు చేయడంలేదు?’ అనే ప్రశ్న అనుష్క ముందుంచితే -‘‘హిందీ సినిమా చేయాలి కాబట్టి అని చేస్తే బాగుండదు. బాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఏదీ కొత్తగా అనిపించలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారామె. -
పవన్ కళ్యాణ్ నాకు గురువు: రేణు దేశాయ్
చిత్ర నిర్మాణానికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ తనకు గురువు అని సినీనటి, దర్శకురాలు రేణుదేశాయ్ అన్నారు. తాను 1999 నుంచి చిత్ర నిర్మాణంలో మెలుకువలు నేర్చుకుంటున్నానని ఆమె తెలిపారు. నా జీవితంలో పవన్ కళ్యాణ్ కంటే మంచి టీచర్ ఎవరూ లేరు అని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో రేణు దేశాయ్ తెలిపారు. ఫిల్మ్ మేకింగ్ పరిపూర్ణతను సాదించడానికి సహకరించిన పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని ఆమె అన్నారు. అయితే జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా చోటు చేసుకుంటాయని, తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను వాస్తవానికి ఆగస్టు 26 తేదిన విడుదల చేయాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వలన ట్రైలర్ విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 2 తేదికి వాయిదా పడింది. అయితే ఆరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం యాదృచ్చికంగా జరిగిందన్నారు. అయితే తనకు ఫిల్మ్ మేకింగ్ లో మెలుకువలు నేర్పిన పవన్ కళ్యాణ్ జన్మదినం రోజున విడుదల చేయడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తానని ఆమె అన్నారు. ఎక్కడో చదివాను, యాదృచ్చికంగా జరిగే సంఘటనలు మన ఆలోచనలకు దేవుడు ఇచ్చే సమాధానాలని.. ఇదే విషయాన్ని పవన్ తో చెప్పితే నవ్వి ఊరుకున్నారని రేణుదేశాయ్ తెలిపారు. -
పవిత్ర దృక్పథం
ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసింది. అలాంటి ఆమె ఎలా ఆలోచించాలి? మంచి చిత్రాలు తీయాలి, పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, పెద్ద సెలెబ్రిటీ అవ్వాలి అనే కదా! పవిత్రాచలం కూడా మొదట అలానే అనుకుంది. కానీ ఓ ఊహించని సంఘటన ఆమె ఆలోచనలను వేరే దిశగా మళ్లించింది. ఓ వ్యక్తి అన్న ఒక్క మాట... ఆమెకో కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. ఏమిటా గమ్యం? పవిత్రాచలం తీసిన డాక్యుమెంటరీలు చూస్తే... ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది! ‘‘సినిమా చూస్తే మనసు భారమైపోకూడదు. ఒత్తిళ్లను మర్చిపోవ డానికి సినిమాకెళ్తాం. అక్కడికెళ్లాక సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అక్కడికెళ్లి కూడా బాధపడితే ఇక సినిమాకి వెళ్లడం ఎందుకు? ఇలా అనుకునేవాళ్లెవరూ సందేశాత్మక చిత్రాలు చూడరు. ఇక డాక్యుమెంటరీలేం చూస్తారు, నావయితే అస్సలు చూడరు’’ అంటుంది పవిత్ర. అది నిజమే. ఆమె తీసే డాక్యుమెంటరీలు చూడాలంటే ప్రత్యేకమైన నేత్రం కావాలి. ఎదుటివాడి కష్టాన్ని చూసి కదిలిపోయే సున్నితమైన మనసు ఉండాలి. వాస్తవాలను తెలుసుకుని తట్టుకోగల స్థైర్యం ఉండాలి. అలాంటివాళ్లు మాత్రమే పవిత్ర చిత్రాలను చూడగలరు. పోతపోసిన ప్రతిభ... పవిత్రాచలం బెంగళూరులో జన్మించింది. ఆమెకు మొదట్నుంచీ చాలా ఆసక్తులున్నాయి. ప్రతిభాపాటవాలూ ఉన్నాయి. మొదట మౌంట్ కార్మెల్ కాలేజీలో బీఏ చేసింది. మంచి క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ చాంపియన్‌గా ఎదిగింది. జర్నలిజంలో డిప్లొమో చేసింది. న్యూయార్క యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేసింది. ఆ పైన ఓ జాతీయ చానెల్లో చేరింది. అప్పటివరకూ జరిగిందంతా ఒకెత్తు. 2003లో పాకిస్థాన్‌లో జరిగిన యువ శాంతి సదస్సులో పాల్గొనడానికి వెళ్లడం మరో ఎత్తు. ఆ పర్యటన... పవిత్రని, ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. శాంతి గురించి, సమాజ శ్రేయస్సు గురించి అక్కడ యువతీ యువకులు చేసిన ప్రసంగాలు పవిత్రలో స్ఫూర్తిని నింపాయి. అప్పుడే తొలిసారిగా ఆమెలోని ఫిల్మ్‌మేకర్ మేల్కొంది. ఇరుదేశాల యువత మనోభావాలూ ప్రతిఫలించేలా ‘బస్’ అనే డాక్యుమెంటరీని తీసింది. తరువాత ఆమె వరుసగా తీస్తూనే ఉంది. కానీ అనుకోకుండా ఎదురైన ఓ అనుభవం... ఆమెను ఓ స్ఫూర్తిదాయక ఫిల్మ్‌మేకర్‌ను చేసింది. 2007లో క్యాన్సర్ మీద అవగాహన కలిగించే డాక్యుమెంటరీ తీయడానికి ఆయేషా అనే యువతి దగ్గరకు వెళ్లింది పవిత్ర. ఆయేషా వయసు 26. క్యాన్సర్ ముదిరిపోయింది. మనిషి శుష్కించిపోయింది. ఇప్పుడో రేపో అన్నట్టుంది. వీడియో తీయడానికి సహకరించే ఓపిక కూడా లేదామెలో. దాంతో నీకు ఓపిక ఉన్నప్పుడు చేద్దాంలే అని చెప్పి వచ్చేసింది పవిత్ర. తర్వాత రోజు ఆయేషా నుంచి ఫోన్ వచ్చింది. ‘రండి తీసేద్దాం’ అని ఆమె అనడంతో వెంటనే వెళ్లింది. ఆయేషాని పవిత్ర అడిగింది... ఇంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని! ‘‘నేనెప్పుడు పోతానో నాకే తెలీదు, నేను పోయాక నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలు కదా’’ అంది ఆయేషా. ఆ మాట పవిత్ర మనసులోకి చొచ్చుకుని పోయింది. చనిపోతూ కూడా ఎదుటి వారికి ఉపయోగపడాలన్న ఆయేషా ఆలోచన... పవిత్రకు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసింది. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది... ఇక మీదట సమాజానికి ఉపయోగపడే చిత్రాలు మాత్రమే తీయాలని! ‘కర్లీ స్ట్రీట్ మీడియా’ అనే సంస్థను స్థాపించి, సామాజిక సమస్యల్ని చిత్రాలుగా తీయడం మొదలుపెట్టింది. ట్రాఫికింగ్ గురించి ‘బౌండ్ బై అజ్’, దేవదాసీల గురించి ‘అనామిక’, మాదక ద్రవ్యాలకు బానిసైన వారి కోసం ‘మై ఫ్రెండ్ ద అడిక్ట్’, మానసిక వికలాంగ చిన్నారుల కోసం ‘ఖుష్బూ’, డౌన్ సిండ్రోమ్ బాధితుల గురించి ‘ఇన్ డెలిబుల్’... ఆమె తీసిన ప్రతి చిత్రమూ కదిలించింది. సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఉన్నట్టుండి ఈ సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చేయలేరు. అందుకే... కనీసం సమస్యల విషయంలో అప్రమత్తం చేస్తోంది. వాటి పరిష్కారాల గురించి ఆలోచనలు రేకెత్తిస్తోంది. అందుకు పవిత్రని అభినందించి తీరాల్సిందే! - సమీర నేలపూడి పవిత్ర తీసిన డాక్యుమెంటరీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘రూట్ ఫర్ రూనా’ గురించి. ఓ రోజు ఓ ఆంగ్ల పత్రికలో రూనా అనే రెండేళ్ల అమ్మాయి గురించి కథనం వెలువడింది. త్రిపురకు చెందిన ఆ పాప హైడ్రోసెఫలస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ మెదడు సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లకు తల అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. రూనాకి కూడా అలానే పెరిగిపోయింది. ఆమె ఫొటోని పత్రికలో చూడగానే పవిత్ర కదిలి పోయింది. ఆ వ్యాధి గురించి తన టీమ్‌తో కలిసి రీసెర్చ చేసింది. మన దేశంలో రూనాలాగా ఆ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారులు చాలమంది ఉన్నారని తెలుసుకుంది. వెంటనే ‘రూటింగ్ ఫర్ రూనా’ అనే డాక్యుమెంట రీని తీసింది. రూనా చికిత్సకి నిధులు సమకూరడంలో ఈ డాక్యుమెంటరీ పెద్ద పాత్రే పోషించింది. రూనాకి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. మెల్లగా కోలు కుంటోంది. అయితే రూనా లాంటి వారందరినీ కూడా వ్యాధి నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తున్నారు పవిత్ర టీమ్. ఆ వ్యాధిపట్ల అందరికీ అవగాహన కల్పించడంతోపాటు నిధులనూ సేకరిస్తున్నారు. ************** పవిత్రతో పాటు అడుగులు వేస్తున్నవాళ్లు కొందరున్నారు. అశ్విన్, అక్షయ్ శంకర్, అనన్య రాయ్, రిషి తుషు, జ్యోత్స్న బాలకృష్ణన్, తేజేష్ కిరణ్, అనితా తుషు... వీళ్లంతా పవిత్రలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న తపన ఉన్నవాళ్లు. అందుకే ఆమెతో చేతులు కలిపారు. ఆమెతో కలిసి అడుగులు వేస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేయడం, వాటిని ఎలా చూపించాలి, దాని ద్వారా ఏ సందేశం ఇవ్వాలి అన్న విషయాలను అందరూ కలిసి చర్చించుకుంటారు. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా సాగిపోతారు. -
షూటింగ్ జరుగుతుండగా అగ్నిప్రమాదం