
శోభారాణి
ఇప్పటి వరకు అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఎస్.వి.ఆర్ మీడియా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ– ‘‘తమిళ హిట్ చిత్రాలను తెలుగులోకి అనువదించి ప్రేక్షకులకు దగ్గరయ్యాం. ఇప్పుడు స్ట్రయిట్ సినిమాలను నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 2020లో ఐదు సినిమాలను నిర్మించబోతున్నాం. ఇప్పటికే ఐదు సినిమాలకు సంబంధించిన కథలు సిద్ధమయ్యాయి. ఆసక్తిగల నటీనటులు(హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్), సాంకేతిక నిపుణులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఆసక్తిగలవారు starmaking2020@gmail.com లేదా 90009 10979, 91336 73367 నంబర్లకు వాట్సాప్‌లో ప్రొఫైల్స్‌ను పంపాలి’’ అన్నారు.