
సీనీ కార్మికులు ఎన్నో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంటారని, ఎన్నో నెలల భార్య పిల్లలకు దూరంగా ఉండి ప్రేక్షకులను అలరించడానికి శ్రమిస్తారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులు తలచుకుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజాగా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం(జనవరి 13) విడుదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా మేకింగ్ వీడియో అది. అందులో సినిమా షూటింగ్ కోసం కార్మికులు పడుతున్న కష్టాలను చూపించారు. చిరంజీవి వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.
చిరంజీవి స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. ‘మేమంతా సినీ కార్మికులం. నిరంతర శ్రామికులం. కళామతల్లి సైనికులం. సినిమా ప్రేమికులం .సినిమానే మా కులం .మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం’అని రాసుకొచ్చాడు.
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషించారు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు.
మేమంతా సినీ కార్మికులం
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2023
నిరంతర శ్రామికులం
కళామతల్లి సైనికులం
సినిమా ప్రేమికులం
సినిమానే మా కులం మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం!
THANK YOU One & All🙏https://t.co/AdQg2v12xv pic.twitter.com/m9n2plOOAA