
The Wrong Swipe Movie Created By Three Doctors: ముగ్గురు వైద్యులు కలిసి తెరకెక్కించిన చిత్రం 'ది రాంగ్ స్వైప్'. ఈ చిత్రాన్ని నిర్మాత డాక్టర్ ప్రతిమా రెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి కలిసి మొబైల్ ఫోన్‌ను కమెరాగా చేసుకుని రూపొందిచారు. చాలా పరిమిత బడ్జెట్‌తో వీకెండ్స్‌లో మాత్రమే షూట్ చేసి నిర్మించిన ఈ సినిమాతో ముగ్గురు డాక్టర్లు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రం టాలీవుడ్‌లోని ప‍్రముఖుల ప్రశంసలు పొందుతుందని మేకర్స్ తెలిపారు. వారికి మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ రంగంలో తాము కూడా రాణించగలమనే నమ్మకాన్ని రెట్టింపు చేసిందని డైరెక్టర్ రవికిరణ్ అన్నారు.
'ది రాంగ్ స్వైప్' చిత్రాన్ని సుప్రసిద్ధ దర్శకుడు కోదండరామి రెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు మెచ్చుకున్నారని రవికిరణ్ తెలిపారు. ఇటీవల కాలంలో తాము చూసిన చాలా మంచి చిత్రాల్లో ఇది ఒకటని పొగిడారని పేర్కొన్నారు. '6 ఎమ్‌పీ' పేరుతో తన తదుపరి చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రవికిరణ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment